ఈ రోజు నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సమావేశాలకు వైసీపీ సభ్యులు వెళ్లబోవడం లేదని, సభ జరిగినన్ని రోజులు మీడియా ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ నిర్ణయంలో కాస్త మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ మినహా మిగతా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లబోతున్నారు. అయితే, కేవలం తమ ప్రశ్నలు ఉన్నపుడు మాత్రమే వారు సభకు హాజరు కావాలని, మిగతా సమయాల్లో గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.
ఇక, తొలిరోజు సమావేశాలకు వైసీపీ సభ్యులు మొత్తం దూరంగా ఉండబోతున్నారు. అంటే, బడ్జెట్ ప్రసంగానికి పూర్తిగా వారు దూరంగా ఉంటారు. రెండో రోజు సమావేశాల నుంచి జగన్ తప్ప మిగతా సభ్యులు తమ ప్రశ్నలు ఉన్నపుడు సభకు హాజరవుతారు. మరోవైపు, శాసన మండలి సమావేశాలకు మాత్రం వైసీపీ సభ్యులందరూ యథావిధిగా హాజరు కాబోతున్నారు. మండలిలో వైసీపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, ఈ రోజు 10.30కు వైసీపీ సభ్యులతో జగన్ భేటీ కాబోతున్నారు. జగన్ మాక్ అసెంబ్లీ నిర్వహించి మీడియా ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో సభకు వెళ్లకపోవడం, సభ జరుగుతున్న సమయంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అన్న విషయంపై వైసీపీ సభ్యులతో జగన్ చర్చిస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న 10 రోజులు కార్యకచరణ ఏమిటి అన్నదానిపై కూడా చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on November 11, 2024 10:28 am
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…