ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రెండు రోజుల కిందట రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంపై కీలక ఆరోపణలు చేశారు. శాంతి భద్రతలు ఎటు పోతున్నాయో తెలియడం లేదన్నారు. హోం శాఖ మంత్రి పైపైనే పనిచేస్తున్నారని కూడా చెప్పారు. అంతేకాదు.. తానే హోం మంత్రి అయి ఉంటే.. పరిస్థితి దీనికి భిన్నంగా ఉండేవని కూడా చెప్పుకొచ్చారు. రోజుకొక దాడి జరుగుతున్నా.. సోష ల్ మీడియాలో వికృత చేష్ఠలకు పాల్పడుతున్నా.. సహించాల్సి వస్తోందని ఆవేదన, ఆందోళన కూడా వ్యక్తం చేశారు. మొత్తంగా పవన్ కల్యాణ్ వేదన గురించి రాజకీయంగా చర్చ అయితే సాగింది. సాగుతోంది.
అయితే.. ఇంత కోపం పవన్‌కు ఎందుకువ చ్చింది? అనేది ఇప్పటి వరకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు ఆయన ఆవేదన చెందారా? లేక, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి.. కంట్రోల్ చేయకపోతే.. తనకు కూడా మచ్చ వస్తుందని భావించిన ఆయన ఇలా ఫైరయ్యారా? అనేది ఇప్పటికీ విశ్లేషకులు సైతం తేల్చలేక పోతున్నారు. అయితే.. ఈ విషయానికి సంబంధించి.. పవన్ కల్యాణ్ ఇంత ఫైర్ అవడం వెనుక.. తాజాగా ఓ కీలక సంగతి వెలుగు చూసింది. అది కూడా.. పవన్ కల్యాణ్ నోటి నుంచే బయటకు రావడం గమనార్హం.
తాజాగా ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల విషయంతోపాటు.. మంత్రుల పనితీరుపైనా చర్చ వచ్చింది. ఈ సమయంలో జోక్యం చేసుకున్న పవన్ కల్యాణ్.. వైసీపీకి అధికారం పోయినా.. దూకుడు తగ్గలేదని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని ప్రభుత్వంపైనా, మంత్రులపైనా, నాయకులపైనా తీవ్ర స్థాయిలో పోస్టులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. దీనిని కట్టడి చేయాలని ఆయన సూచించారు.
ఈ క్రమంలోనే పవన్ అసలు సంగతి చెప్పారు. “వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోతోంది. ఎంత మాట పడితే అంత మాట అనేస్తోంది. దీనిని ఎలా డైజెస్ట్ చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పినా.. వినిపించుకోవడం లేదు. చర్యలు కూడా తీసుకోవడం లేదు. నామటుకు నాకే అసహ్యం వేస్తోంది. నేనే స్వయంగా కొందరు ఎస్పీలకు ఫోన్లు చేశారు. కానీ, ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. కనీసం .. కాల్ బ్యాక్ కూడా చేయలేదు. వీరి సంగతి ఏంటో ఆలోచించండి” అని చంద్రబాబుకు సూచించారు. అంటే.. దీనిని బట్టి.. పవన్ ఆగ్రహం వెనుక.. తనకు(డిప్యూటీ సీఎంగా) కూడా ఎస్పీలు స్పందించకపోవడం అనే ఆవేదన ఉందన్న సంగతి అర్ధమవుతోంది. అందుకే పవన్ ఇలా రియాక్ట్ అయ్యారనే సంకేతాలు వచ్చాయి.
This post was last modified on November 7, 2024 9:23 am
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…