దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి వీల్లేదు. దీనిపైకోర్టు తీర్పులు, రాజ్యాంగ పరిమితులు కూడా స్పష్టం చేస్తున్నాయి. అయితే.. ఈ రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేయనున్నట్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తాజాగా హైదరాబాద్‌లోని బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో నిర్వహించిన సంవిధాన్ సమ్మాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బుధవారం(నవంబరు 6) నుంచి రాష్ట్రంలో కుల గణన ప్రారంభం కానున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ దీనిపై సంచలన వ్యాఖ్యలుచేశారు.
తాము అధికారంలోకి(కేంద్రం) వచ్చిన వెంటనే రిజర్వేషన్ల పై ఉన్న పరిమితిని ఎత్తేయనున్నట్టు చెప్పారు. దేశంలో ఇప్పటికీ అనేక రంగాల్లో కుల వివక్ష ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. “కుల గణనను కొందరు రాజకీయాల కోసం అని అనుకుంటున్నారు. కానీ, సమాజంలోని వివక్షను తరిమ కొట్టేందుకే ఈ కుల గణన చేపట్టాం” అని రాహుల్ వెల్లడించారు. ఏ రంగంలో ఎంత మంది ఓబీసీలు ఉన్నారో.. వారి కుటుంబాలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయో ఈ గణన ద్వారా తెలుస్తాయని చెప్పారు.
“భారత్ జోడో యాత్ర చేసినప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాల్లో తిరిగా. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కుల వివక్ష ఉంది. ఈ విషయాన్ని నేను నా కళ్లతో చూశా. కానీ, కొందరు అగ్రకులంలో ఉన్నవారికి ఈ కుల వివక్ష కనిపించదు” అని దుయ్యబట్టారు. కుల గణన చేపట్టడం ద్వారా.. సమాజంలో సమానత్వాన్ని తీసుకువస్తామని రాహుల్ చెప్పారు. “ఆ వ్యవస్థ, ఈ వ్యవస్థ అనే తేడాలేదు. అన్ని వ్యవస్థల్లోనూ కుల వివక్ష ఉంది. రాజకీయంగా, న్యాయవ్యవస్థల్లోనూ.. పారిశ్రామికంగా కూడా కుల వివక్ష ఈ దేశాన్ని పట్టిపీడిస్తోంది” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
“ఎస్‌సీ, ఎస్‌టీ, గిరిజన కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. వారిలో ప్రతిభ ఉన్నా.. వెలుగులోకి రాలేక పోతున్నారు. దీనికి కుల వివక్షే కారణం” అని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో కుల గణన చేపడుతున్నామని. దీనర్థం.. కులాల లెక్కలు తీయడం కాదని.. వారి సామాజిక స్థితిగతులు తెలుసుకుని సర్కారు పరంగా వారిని సమాజంలో ఉన్నత స్థాయికి చేర్చడమే లక్ష్యమని రాహుల్ చెప్పారు. ఇక, తెలంగాణలో కుల గణన అత్యవసరమని పేర్కొన్న రాహుల్ దీనిద్వారా రాష్ట్రంలో పరిస్థితి మారుతుందన్నారు.
This post was last modified on November 5, 2024 11:34 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…