ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు పరిచయం చేసిన చంద్రబాబుకు మహిళా అభిమానులు ఎక్కువ. తమ కాళ్లపై తాము నిలబడేలా చేసిన చంద్రబాబును మహిళలు ఎంతో గౌరవిస్తూ అభిమానిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబును ఓ మహిళా అభిమాని ముద్దు పెట్టబోయిన ఘటన వైరల్ గా మారింది. ఇందుకు సంబంధఇంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు రోడ్డు మీద నడుచుకుంటూ తన కాన్వాయ్ దగ్గరకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళా అభిమాని చంద్రబాబుకు పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనను ఆప్యాయంగా ఆమె హత్తుకున్నారు. దీంతో, చంద్రబాబు కూడా ఆమె భుజంపై ఆప్యాయంగా చేయి వేసి ఫొటో దిగుతున్నారు. అయితే, హఠాత్తుగా ఆ మహిళ చంద్రబాబును ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించడంతో చంద్రబాబుతోపాటు అక్కడి భద్రతా సిబ్బంది కూడా అవాక్కయ్యారు.
వెంటనే ఆ మహిళను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని దూరంగా లాగేసే ప్రయత్నం చేశారు. అయితే, భద్రతా సిబ్బందిని సున్నితంగా వారించిన చంద్రబాబు…ఆ మహిళకు కాస్త దూరం జరిగి ఫొటో దిగారు. అయితే, ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగింది అన్న విషయంపై స్పష్టత లేదు. ఏది ఏమైనా చంద్రబాబును ఆ మహిళ ముద్దుపెట్టుకోబోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on November 2, 2024 10:08 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…