జగన్ ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కొత్త రోడ్ల సంగతి పక్కనబెడితే…ఉన్న రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేని దుస్థితి గత ప్రభుత్వంలో ఉందని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో రోడ్లకు మహర్దశ కల్పించేందుకు సీఎం చంద్రబాబు నడుం బిగించారు. ఏపీలో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో చంద్రబాబు నేడు శ్రీకారం చుట్టారు.
సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్రంలోని రోడ్లపై ఒక్క గుంత ఉండకూడదని, అన్ని గుంతలు పూడ్చాల్సిందేనని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రా ఎస్కోబార్ వచ్చి రోడ్లపై గుంతలు పెట్టి వెళ్లారని జగన్ను విమర్శించారు. జగన్ హయాంలో రోడ్లపై నాట్లు వేశారని, చేపలు పట్టారని, స్విమ్మింగ్ ఫూల్స్ దర్శనమిచ్చాయని సెటైర్లు వేశారు. జగన్ హయాంలో నరకానికి మార్గాలుగా రోడ్లు ఉండేవని, వాటిని డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి మారుస్తామని చెప్పారు. విశాఖ నుండి అమరావతికి 2 గంటల్లో చేరుకునేలా రోడ్లు వేస్తామని చెప్పారు.
ఇక, మద్యం, ఇసుక వ్యాపారాల్లో అక్రమాలు చేస్తే సహించబోనని చంద్రబాబు అన్నారు. ఉచిత ఇసుక అక్రమ వ్యాపారం చేస్తే చర్యలు తప్పవని, పీడీ యాక్ట్ పెడతానని వార్నింగ్ ఇచ్చారు. ఇక, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానని, మద్యం రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోబోనని హెచ్చరించారు.
This post was last modified on November 2, 2024 2:38 pm
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు…
తాజాగా మరో రాజ్యసభ సీటుకు సంబంధించి ఎన్నికలకు రంగం రెడీ అయింది. వైసీపీ నాయకుడు, కీలక నేతల వేణుంబాకం విజయ…
ఇటీవలే విడుదలైన రవితేజ మాస్ జాతర పాటలో స్వర్గీయ చక్రి గొంతు విని సంగీత ప్రియులు ఆశ్చర్యపోయారు. అభిమానులు భావోద్వేగానికి…