వ్యాపార వేత్తల కుటుంబాలు కూడా.. రాజకీయాలు చేయడం ఇప్పుడు పెద్ద చిత్రంకాదు. అసలు అవసరం కూడా వారికే ఎక్కువగా ఉంది. ఏ పని కావాలన్నా.. వ్యాపార వేత్తలకు రాజకీయ నేతలతో ముడి పడిపోయింది. అందుకే… వారే రాజకీయ నేతలుగా మారుతున్నారు. అయితే.. ఎంత మంది వ్యాపార వేత్తలు ప్రజలకు నేరుగా సేవలు అందిస్తున్నారన్న విషయాన్ని పరిశీలిస్తే.. కొంత డౌటే కొడుతుంది. అవకాశం తీరింది.. కాబట్టి.. అవసరం ఇప్పుడు ప్రజలది అన్నట్టుగా ఉంది.
అయితే.. ఈ అభిప్రాయాలకు భిన్నంగా.. ఒక మహిళా పారిశ్రామిక వేత్త.. మాత్రం ఎమ్మెల్యేగా తన కర్తవ్యాన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపైనా దృష్టి పెట్టారు. ఆమే.. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి. ఎన్నికల సమయంలో ఆమె చుట్టూ రాజుకున్న రాజకీయాలు అన్నీ ఇన్నీకావు. అనేక రూపాల్లో ఆమెపై వివాదాలు చెలరేగాయి. అయినా.. తట్టుకుని విజయం దక్కించుకున్నారు.
దీనికి ప్రాతిపదిక.,. వేమిరెడ్డి ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు. “నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటా” అని చెప్పిన ప్రశాంతి.. ప్రస్తుతం అదే పనిచేస్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే.. ప్రజలకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేగా ప్రశాంతి పేరే ముందుంది. అంతేకాదు.. సమస్యలను కూలంకషంగా వినడంతోపాటు.. పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో 100మందికి కొత్త పింఛన్లను రాయించారు.
అంతేకాదు.. సమస్య ఎక్కడ ఉంటే అక్కడకు ఆమే వెళ్తున్నారు. నిజానికి ఎమ్మెల్యేలు బాధితులను తమ కార్యాలయాలకు పిలుస్తున్నారు. కానీ, ప్రశాంతి మాత్రం తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా.. ఉదయాన్నే ప్రజల మధ్యకు వస్తున్నారు. కోవూరులో వాకింగ్ క్లబ్‌ను ఏర్పాటు చేసి.. వృద్ధుల సమస్యలు ఈ క్లబ్ ద్వారా పరిష్కరిస్తున్నారు.
ఇప్పటికి ప్రతి నెలా(4సార్లుగా) ఉద్యోగమేళా నిర్వహిస్తూ.. తమ వ్యాపారాలు సహా.. ఇతర వ్యాపారస్తులను కూడా పిలిచి నియోజకవర్గంలోని నిరుద్యోగులకు నెలకు రూ.15000 వేతనం తగ్గకుండా ఉపాధి కల్పిస్తున్నారు. అయితే..ఎక్కడా ఆమె ప్రచారం చేసుకోకపోవడం మరి ముఖ్య విషయం.
This post was last modified on October 29, 2024 10:00 am
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలోనే జరగబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ముందుగానే…
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా…
టీడీపీ సీనియర్ నాయకురాలు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత… రాజకీయంగా చర్చనీయాంశం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి…
గేమ్ ఛేంజర్ ఇంకా విడుదలే కాలేదు రామ్ చరణ్ అప్పుడే తన తదుపరి సినిమాను పట్టాలెక్కించేశాడు. సుకుమార్ ప్రియ శిష్యుడు…
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉన్న పార్టీ మార్పుల కేసులో హైకోర్టు సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. బీఆర్ఎస్…