Political News

‘ఐటీ మ్యాన్‌’…. చంద్ర‌బాబు: స‌రికొత్త ప్ర‌శంస‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు రికార్డుల్లోకి స‌రికొత్త ప్ర‌శంస వ‌చ్చి చేరింది. ఆయ‌న‌ను ‘ఐటీ మ్యాన్‌’ అంటూ.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ కొనియాడారు. నిజానికి ‘ఐటీ’ గురించి ఎక్క‌డ‌మాట్లాడినా.. చంద్ర‌బాబు పేరు త‌ర‌చుగా వినిపిస్తుంది. ఆయ‌న ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. ఈ పేరు మాత్రం శాశ్వ‌తంగా నిలిచిపోయింది. దీనికి కార‌ణం.. హైద‌రాబాద్‌కు దీటుగా సైబ‌రాబాద్‌ను నిర్మించారు. దీనిలో ప్ర‌ఖ్యాత ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేలా ప్రోత్స‌హించారు. అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌ను కూడా తీసుకువ‌చ్చారు.

దీంతో చంద్ర‌బాబుపై స‌హ‌జంగానే ‘ఐటీ’ ముద్ర ప‌డింది. గ‌తంలో తెలంగాణ‌ను పాలించిన కేసీఆర్ స‌హా..అప్ప‌టి మంత్రి కేటీఆర్ కూడా.. చంద్ర‌బాబు ఐటీ కోసం చేసిన కృషిని త‌గ్గించ‌లేక‌పోయారు. పైకి కొ్న్ని కొన్ని సంద‌ర్భాల్లో బ‌య‌ట కూడా ప‌డ్డారు. ఇలా.. త‌న‌కంటూ.. ప్ర‌త్య‌క‌త‌ను సంత‌రించుకున్న చంద్ర‌బాబు.. తాజాగా కేంద్ర మంత్రి నుంచి కూడా ప్ర‌శంస‌లు ద‌క్కించుకోవ‌డం గ‌మ నార్హం. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ది ప్రాజెక్టులు.. రైల్వే ప్రాజెక్టుల‌కు సంబంధించి.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌తో చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ భేటీ అంతా.. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారానే జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, కేంద్ర మంత్రులు, బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి వంటివారు ప‌దుల సంఖ్య‌లో అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని.. కేంద్ర మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు.. “ఇంత మందితో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన ఘ‌నత మీదే” అంటూ.. అశ్వినీ వైష్ణ‌వ్‌పై ప్ర‌శంస‌లు గుప్పించారు. అయితే.. ఆయ‌న ఈ ప్ర‌శంస‌ల‌ను తిప్పి కొడుతూ.. “నేను కాదు.. అస‌లు ఐటీమ్యాన్ మ‌న ముందున్న చంద్ర‌బాబు జీ!” అని ప్ర‌శంసించారు. దీంతో హాలు హాలంగా చ‌ప్ప‌ట్లతో మార్మోగిపోయింది. అయితే.. ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగు చూడ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 26, 2024 5:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

25 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago