ప్రజల్లో ఉండాలంటూ.. నాయకులకు, కార్యకర్తలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తాజాగా సెలవిచ్చారు. ‘ప్రజల్లో ఉంటేనే గుర్తింపు ఉంటుంది. వారు మనల్ని గుర్తు పెట్టుకుంటారు. మీరు నిరంతరం ప్రజల్లో ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు. తాజాగా వైసీపీ నేతలతో ఆయన వర్క్ షాపు నిర్వహించారు. ఈ సందర్భంగానే వారికి ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. ఇది మంచిదే. ఎవరూ కాదనరు. కానీ, అసలు ప్రజల్లో ఉండాల్సింది ఎవరు? అన్నది ప్రశ్న.
ఎందుకంటే.. ఓడిపోయిన పార్టీకి ప్రజలలో ఆదరణ పెద్దగా ఉండదు. పైగా కార్యకర్తలు, నేతలు ముందుకు వెళ్లినా.. వారికి నిరసన సెగ తగులుతుంది. ఇది అన్ని పార్టీలకూ కామనే. గతంలో 2019-24 మధ్య టీడీపీ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు వచ్చేందుకు భయపడ్డారు. ఈ సమయంలో మీ కంటే ముందు నేనే ప్రజల్లో ముందుంటానంటూ.. చంద్రబాబు బయటకు వచ్చారు. ఆయనే నేరుగా కార్యక్రమాల్లో ముందు పాల్గొన్నారు.
దీంతో కార్యకర్తలు, నాయకుల్లో చైతన్యం వచ్చింది. టీడీపీ పుంజుకునేందుకు బాటలు పడ్డాయి. ఈ క్రమంలో చంద్రబాబు తన వయసును, ఇతరత్రా సమస్యలను కూడా పట్టించుకోకుండానే ముందుకు సాగారు. మరి.. ఇలాంటి పరిస్థితే వైసీపీలోనే ఉంటుంది కదా? ఈ విషయాన్ని జగన్ విస్మరించారు. మీరు వండి పెట్టండి నేను భోజనం చేస్తాను! అన్నట్టుగానే ఆయన వ్యవహారం ఉందన్న విమర్శలు వస్తున్నారు. ఇదే విషయాన్ని కొందరు కార్యకర్తలు, నాయకులు కూడా అంతర్గత సంభాషణల్లో వెల్లడించారు.
అయితే.. ఎవరూ కూడా జగన్‌ను నేరుగా ప్రశ్నించే పరిస్థితి లేకపోవడం గమనార్హం. కానీ, వారి చర్చల్లో రీజన్ కనిపిస్తోంది. ముందు రావాల్సింది.. ముందు నిలబడాల్సింది కూడా జగనే. పార్టీ బలోపేతం అనేది నాయకుడు వ్యవహరించే తీరును బట్టే ఉంటుంది. కానీ, ఈ చిన్న సూత్రాన్ని జగన్ మరిచిపోయినట్టుగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా ఉంది. కానీ, ఇది సరైన పద్ధతి కాదని, మీరు బెంగళూరులోను, తాడేపల్లిలోనూ కూర్చుంటే మేం ప్రజల్లో తిరిగితే ఫలితం ఉండదని మెజారిటీ నాయకులు చెబుతుండడం గమనార్హం.
This post was last modified on October 18, 2024 9:40 am
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…
స్టార్ హీరోల కుటుంబాల నుంచి అబ్బాయిలు హీరోలుగా మారడం మామూలే. అమ్మాయిలు మాత్రం హీరోయిన్లు కావడం అరుదు. ఐతే సినీ…
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…