Movie Reviews

సమీక్ష – హరోంహర

హీరోకు సరిపడా మెటీరియల్ ఉన్నప్పటికీ సక్సెస్ దోబూచులాడుతున్న సుధీర్ బాబు కొత్త సినిమా హరోంహర ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సెహరి లాంటి ఒక చిన్న యూత్ మూవీ తీసిన జ్ఞానసాగర్ అనే దర్శకుడు చెప్పిన మాస్ స్టోరీకి ఓకే చెప్పడం చూస్తే ఇందులో విషయమేదో గట్టిగానే ఉన్నట్టు అనిపించింది. ట్రైలర్, ప్రమోషన్లు క్రమంగా ఆసక్తి పెంచాయి. ఈసారి ప్రయోగాల జోలికి వెళ్లకుండా సుధీర్ బాబు ఎంచుకున్న పక్కా కమర్షియల్ సబ్జెక్టు ఇది. మరి అతను కోరుకున్నది దక్కేలా ఉందో లేదో చూసేద్దాం

కథ

బ్రతుకుతెరువు కోసం కుప్పం వచ్చిన సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు) ఒక కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ గా చేరతాడు. టీచర్ (మాళవిక శర్మ) ని ప్రేమిస్తాడు. తండ్రి (జయప్రకాశ్) అప్పుల పాలు కావడంతో సులభంగా డబ్బు సంపాదించడం కోసం స్నేహితుడు పళని స్వామి (సునీల్) సలహాతో స్వంతంగా తుపాకులు తయారు చేసే వ్యాపారం మొదలుపెడతాడు. స్థానికంగా ఉండే తమ్మిరెడ్డి (లక్ష్మణ్) తో కుదిరిన ఒప్పందం క్రమంగా శత్రుత్వంగా మారుతుంది. సుబ్రహ్మణ్యంని పట్టుకోవడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ (అక్షర) వల్ల ఊళ్ళో కొత్త సమస్యలు వస్తాయి. ఎదుగుబొదుగు లేని జీవితం నుంచి శక్తివంతమైన డాన్ గా సుబ్రహ్మణ్యం తన ప్రయాణాన్ని ఎలా చేశాడనేదే స్టోరీ.

విశ్లేషణ

ఎనభై దశకం నేపధ్యాలను తీసుకుని అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా రాసుకోవడం ఒక సక్సెస్ ఫార్ములాగా మారిపోయిన తరుణంలో దర్శకుడు జ్ఞానసాగర్ కూడా సుధీర్ బాబులోని మాస్ ని పరిచయం చేసేందుకు ఇదే దారి పట్టాడు. చిత్తూరు బ్యాక్ డ్రాప్ తో తుపాకుల వ్యాపారంలో దిగి మాఫియాగా ఎదిగిన ఒక యువకుడి చుట్టూ పుష్ప తరహా ట్రీట్ మెంట్ తో మాస్ ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రయత్నం మొదటి ఫ్రేమ్ నుంచే కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యంని ఎస్టాబ్లిక్ చేసిన తీరు, సునీల్ తో స్నేహం, అమ్మాయితో ప్రేమకథ, స్థానికంగా రేగే గొడవలు ఇదంతా రెగ్యులర్ టెంప్లేట్ లో వెళ్లినా ఎక్కడిక్కడక ఎలివేషన్లతో నడిపించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది.

విడిగా సన్నివేశాలపరంగా జ్ఞానసాగర్ రాసుకున్న సీన్లలో మాస్ పల్స్ పుష్కలంగా ఉంది. అయితే వాటికి జాయింట్ వేసి స్క్రీన్ ప్లేతో ముడిపెట్టే క్రమంలో ఇతని అనుభవలేమి కొంత ప్రభావం చూపించడంతో సుబ్రహ్మణ్యం చేసే బిజినెస్ తో మొదలుపెట్టి చివర్లో విలన్ల భరతం పట్టే దాకా ప్రతిదీ ఎక్కడో చూసినట్టే అనిపించడం మైనస్ గా నిలిచింది. పుష్ప, కెజిఎఫ్, విక్రమ్ తరహా మేకింగ్ ని ఎంచుకున్న దర్శకుడు వాటిలో బలంగా నిలిచిన ఎమోషన్, డ్రామాని సుబ్రమణ్యంకు రాసుకోవడంలో కొంచెం బ్యాలన్స్ తప్పడంతో ఎగ్జైట్ మెంట్ ఫ్యాక్టర్ తగ్గిపోయింది. తండ్రి అప్పులను చూపించి మాఫియా వైపు వెళ్లాడనే పాయింట్ మరింత కన్విన్సింగ్ గా చూపించాల్సింది.

హరోంహరలో ఎన్నో మాస్ బ్లాక్ బస్టర్ షేడ్స్ కనిపిస్తాయి. ఉదాహరణకు గూండా ఒకడు వచ్చి సుధీర్ దగ్గర అగ్గిపెట్టె తీసుకెళ్లే సీన్ ఎప్పుడో అమితాబ్ బచ్చన్ కాలా పత్తర్ నుంచి తీసుకున్నది. ఇది తప్పేం కాకపోయినా హీరోయిజం ఎలివేట్ చేసే క్రమంలో నాటకీయత పండితేనే ఇలాంటి వాటికి థియేటర్లో విజిల్స్ పడతాయి. జ్ఞానసాగర్ ఎంతసేపు సుధీర్ బాబుని ఎంత మ్యాచో మ్యాన్ గా చూపిస్తున్నాననే దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు తప్పించి అతని చుట్టూ ఉండే పాత్రలతో పాటు సినిమా చూసే ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారో లేదో సరైన రీతిలో చెక్ చేసుకోలేదు. దీంతో సింహాద్రి రేంజ్ లో దద్దరిల్లిపోవాల్సిన పోస్ట్ ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ జస్ట్ ఓకే అనిపిస్తుంది.

ఇలాంటి హెచ్చుతగ్గుల మధ్య్య సుబ్రహ్మణ్యం జర్నీని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేం. సెకండ్ హాఫ్ లో హడావిడి ఎక్కువైపోయి నరకడాలు పెరిగిపోవడంతో జనం దేవుడిలా అతన్ని ఎందుకు ఆరాధిస్తారనే దానికి సరైన జస్టిఫికేషన్ జరగలేదు. మాస్ బొమ్మ అంటే ఇలా ఉండాలని వివి వినాయక్, సుకుమార్, ప్రశాంత్ నీల్ ని ఇన్స్ పిరేషన్ గా తీసుకున్న జ్ఞానసాగర్ కొన్ని చోట్ల భలే తీశాడు అని అనిపించుకునే అవకాశాన్ని చేతులారా తగ్గించుకున్నాడు. చివర్లో విలన్ ఊరి జనం మీద పడి రక్తపాతం చూపించాక సుధీర్ బాబు సదరు గ్యాంగ్ ని తుదముట్టించే ఘట్టం సైతం సోసోగా అనిపిస్తుంది. సంతృప్తి అసంతృప్తి మధ్య ఊగిసలాట జరుగుతూనే ఉంటుంది.

సుబ్రహ్మణ్యం లాంటి కల్పిత డాన్ల బయోపిక్ చెబుతున్నప్పుడు ప్రేక్షకులకు సదరు ముఠా నాయకుల భావోద్వేగం అనుసంధానం అవుతుందో లేదో సరి చూసుకోవడం చాలా అవసరం. కమల్ హాసన్ నాయకుడు, యష్ కెజిఎఫ్ లు కేవలం క్యారెక్టరైజేషన్లతో క్లాసిక్స్ అవ్వలేదు. ఎన్నో అంశాలు దోహదం చేశాయి. విలన్ల విషయంలో జ్ఞానసాగర్ తీసుకున్న ఛాయస్ సైతం ఓవరాల్ ఇంపాక్ట్ ని తగ్గించేసింది. ఎలాగూ ఎంటర్ టైన్మెంట్ ఉండదు కాబట్టి సీరియస్ నెరేషన్లోనే బోర్ కొట్టకుండా చూసుకోవాలి. సెకండ్ హాఫ్ లో బోలెడు మలుపులు ఉంటాయి. విసిగించకపోయినా ఎందుకు జరుగుతున్నాయో పూర్తిగా అర్థం చేసుకునే లోపే క్లైమాక్స్ దగ్గరికి వెళ్ళిపోతాం.

జ్ఞానసాగర్ మీద కమర్షియల్ మాస్ హిస్టీరియా ప్రభావం ఎక్కువగా ఉంది. తనకు తెలియకుండా వాటిని స్ఫూర్తి తీసుకోబోయి అనుకరించడం అసలు సమస్యగా మారింది. అయినా సరే మసాలా ఎక్కువున్నా పర్లేదు బిర్యానీ తినేసి ఆకలి తీర్చుకుంటాం అనుకునేవాళ్లకు హరోంహర డీసెంట్ వాచ్ గా అనిపించవచ్చు. అలా కాకుండా కట్టిపడేసే కథనంతో సుబ్రహ్మణ్యం ఊహించని నేర ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తాడని అంచనాలు పెట్టుకుంటే మాత్రం పూర్తి సంతృప్తి కలగకపోవచ్చు. ఒక టెక్నీషియన్ గా జ్ఞాన సాగర్ లో విషయం ఉంది కానీ రైటర్ గా అతను మరింత సానబడితే స్టార్ హీరోల దృష్టిలో పడతాడు. కాకపోతే హోమ్ వర్క్ అవసరం.

నటీనటులు

సీరియస్ రోల్స్ కు బాగా నప్పే సుధీర్ బాబు ఇందులో సుబ్రహ్మణ్యంగా దొరికిన అవకాశాన్ని వాడుకున్నాడు. తన భుజాల మీదే నడిచే మాస్ కంటెంట్ కావడంతో తొణక్కుండా ఉన్నంతలో మంచి పరిణితి చూపించాడు. మాళవిక శర్మ గురించి మరీ ప్రత్యేకంగా చెప్పుకునే ఛాన్స్ దక్కలేదు. ఉన్నంతలో అందంగా కనిపించి నీట్ గా చేసింది. అక్షర ఓకే. సునీల్ తనకిచ్చిన స్కోప్ ని వాడుకున్నాడు. జయప్రకాశ్ ది రెగ్యులర్ గా ఎన్నోసార్లు చూసిన తంతే. విలన్లలో రవి కాలే మనకు అలవాటే కాబట్టి ఇబ్బంది లేదు. లక్కీ లక్ష్మణ్, అర్జున్ గౌడలు అంతగా నప్పలేదు. కాదంబరి కిరణ్ లాంటి సీనియర్లతో మొదలుపెట్టి చిన్న ఆర్టిస్టుల దాకా క్యాస్టింగ్ పెద్దగానే తీసుకున్నారు

సాంకేతిక వర్గం

చేతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హరోంహరకు అసలు ప్రాణం పోసింది. వీక్ గా అనిపించిన చోట కూడా మంచి నేపధ్య సంగీతంతో నిలబెట్టడం బాగుంది. పాటలు యావరేజ్ దగ్గరే ఆగిపోయాయి. అరవింద్ విశ్వనాథన్ ఛాయాగ్రహణం అప్పటి కుప్పంని ఆర్ట్ వర్క్ తో పోటీ పడి బాగానే ఆవిష్కరించింది. డిఐ మీద ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. రవితేజ గిరజాల ఎడిటింగ్ లో కంప్లయింట్ చేయాల్సింది నిడివి గురించే. ల్యాగ్ అనిపించే బ్లాక్స్ ఉన్నాయి. పుష్ప తరహాలో మొత్తం చిత్తూరు స్లాంగ్ వాడటం బాగానే ఉంది కానీ అందరితో అదే పనిగా మాట్లాడించడం కొంత ఆర్టిఫీషియల్ గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సబ్జెక్టు డిమాండ్ మేరకు ఖర్చు పెట్టారు

ప్లస్ పాయింట్స్

సుబ్రహ్మణ్యం పాత్ర
కొన్ని యాక్షన్ బ్లాక్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్

క్యారెక్టరైజేషన్ లోపాలు
విలన్ల ఎంపిక
రెగ్యులర్ మాస్ స్క్రీన్ ప్లే

ఫినిషింగ్ టచ్ : ఎలివేషన్ ఓకే ….ఎమోషన్ వీకే

రేటింగ్ : 2.5 / 5

This post was last modified on June 14, 2024 5:30 pm

Share
Show comments
Published by
Satya
Tags: haroam Hara

Recent Posts

ఇరువురు భామలతో ‘సంక్రాంతి’ వినోదం

https://youtu.be/yCkl2Z3PBs0?si=YrheiH3HjVyB7nwZ పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు,…

4 hours ago

డబ్బింగ్ హడావిడి లేని మరో సంక్రాంతి

ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న…

5 hours ago

‘కుప్పం’ రుణం తీర్చుకుంటున్న చంద్ర‌బాబు!

రాష్ట్రానికి సంబంధించి విజ‌న్‌-2047 ఆవిష్క‌రించిన సీఎం చంద్ర‌బాబు.. తాజాగా త‌న సొంత నియోజ‌క వ‌ర్గం.. 35 ఏళ్ల నుంచి వ‌రుస…

7 hours ago

చంద్ర‌బాబు సూప‌ర్‌ విజ‌న్‌.. జ‌గ‌న్ ది డెట్ విజ‌న్‌!: నారా లోకేష్‌

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అప్పులు చేయాల్సి వ‌స్తోంద‌ని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత‌,…

7 hours ago

లైకా వాయిదా ట్విస్టు… మైత్రి మాస్టర్ స్ట్రోకు

గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…

8 hours ago

ట్రైలరుతోనే ట్రోల్ అయిపోయిన రవికుమార్…

కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా…

9 hours ago