Movie Reviews

సమీక్ష – మంజుమ్మల్ బాయ్స్

పరిమిత మార్కెట్ ఉండే ఒక మలయాళ సినిమా రెండు వందల కోట్లు దాటడమంటే మాటలు కాదు. అది కూడా మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్లు లేకుండా కేవలం ఒక కుర్ర గ్యాంగ్ తో ఈ ఫీట్ సాధించడం నమ్మశక్యంగా లేకపోయినా ముమ్మాటికీ నిజం. మంజుమ్మల్ బాయ్స్ సాధ్యం చేసి చూపించింది. తెలుగులో కొంత ఆలస్యమైనప్పటికీ ఫైనల్ గా ది ఫ్యామిలీ స్టార్ వచ్చిన మరుసటి రోజు మైత్రి మూవీస్ మేకర్స్ థియేటర్లకు తీసుకొచ్చారు. మరి ఇంత హైప్ మోసుకొచ్చిన ఈ మంజుమ్మల్ బాయ్స్ ఎలా ఉన్నారో చూద్దాం

కథ

నేపథ్యం 2006లో జరుగుతుంది. కొచ్చిలో ఉండే 11 స్నేహితుల గ్యాంగ్ మంజుమ్మల్ బాయ్స్ పేరుతో కలివిడిగా తిరుగుతూ ఉంటుంది. వేర్వేరు వృత్తులు ఉంటాయి. తరచుగా టూర్లు వేసుకునే ఈ బృందం కొడైకెనాల్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటుంది. నిషిద్ధ ప్రాంతమైన గుణ కేవ్స్ లో తిరుతుండగా ప్రమాదవశాత్తు సుభాష్(శ్రీనాథ్ బాషి) ఓ లోయలో పడిపోతాడు. సైతాన్ వంటగదిగా పిలుచుకుంటే ఆ చోటులో ఎంతో మంది చనిపోయి ఉంటారు. అయినా సరే ఫ్రెండ్ కోసం కుట్టన్(షౌబిన్ సాహిర్) సాహసంతో ప్రాణాలకు రిస్క్ చేసి మరీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని తీసుకొచ్చి కాపాడే మిషన్ మొదలుపెడతారు. చివరికి ఏం జరిగిందనేది తెరమీద చూస్తేనే కిక్కు.

విశ్లేషణ

సర్వైవర్ థ్రిల్లర్స్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒకే లొకేషన్ లో పరిమిత పాత్రలతో డ్రామాని నడిపించాలంటే చాలా కసరత్తు జరగాలి. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు చిదంబరం మంజుమ్మల్ బాయ్స్ రాసుకున్నాడు. నేటివిటీకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే మల్లువుడ్ ట్రెండ్ ఫాలో అవుతూ మొదటి అరగంట పాత్రలు, స్థానిక పరిస్థితులు ఎస్టాబ్లిక్ చేశాక వాళ్ళ మధ్య స్నేహాన్ని మెల్లగా రిజిస్టర్ చేసి త్వరగానే అసలు పాయింట్ లోకి వచ్చేస్తాడు. ప్రమోషన్ కంటెంట్ లో ముందే స్టోరీ రివీల్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్ద సస్పెన్స్ ఉండదు. ఎలా కాపాడతారనే ప్రశ్నే థ్రిల్లింగ్ రైడ్ కు పునాదిగా మారుతుంది.

సుభాష్ లోయలోకి పడిపోయాక అసలు డ్రామా మొదలవుతుంది. మిగిలిన పది మంది అతన్ని కాపాడేందుకు పడే తాపత్రయం, పోలీస్ స్టేషన్ కు వెళ్లి దెబ్బలు తినడం, వర్షం నీళ్లకు అడ్డుకట్ట వేసేందుకు దారికి అడ్డంగా పడుకోవడం లాంటివన్నీ మితిమీరిన నాటకీయత లేకుండా గొప్పగా హ్యాండిల్ చేసిన విధానం బాగా వచ్చింది. స్థానికంగా తిరిగే గైడ్, చిన్న కొట్టు పెట్టుకున్న వ్యాపారి, ఫోటోలు తీసే కెమెరామెన్, చెక్ పోస్ట్ గార్డ్ ఇలా సందర్భానికి తగ్గట్టు ఒక్కో పాత్రను ప్రవేశ పెట్టి వాళ్ళను మంజుమ్మల్ బృందంతో ముడిపెట్టిన వైనం సన్నివేశాలను ఎంగేజ్ చేస్తూ వెళ్ళింది. సన్నివేశాలలో లీనమవుతూ ఉండగానే ఇంటర్వెల్ వచ్చేయడం ఆశ్చర్యపరుస్తుంది.

సెకండ్ హాఫ్ లో గంటకు పైగా చీకటి పడిన గుహలోనే జరిగినా ఆ ఫీలింగే రాకుండా చిదంబరం స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం బాగుంది. లోపల సుభాష్ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో కేవలం రెండు మూడు షాట్స్ లోనే ఒళ్ళు గగుర్పొడిచేలా చూపించడం మెల్లగా కుర్చీల అంచులకు తెస్తుంది. ఇలాంటి దారుణమైన పరిస్థితిలో సుభాష్ మెంటల్ కండీషన్ ఎలాంటి విపరీతాలకు లోనవుతుందో కుట్టన్ ద్వారా చూపించిన చిన్న ట్విస్టుకు మంచి సౌండ్ సిస్టంలో ఒళ్ళు జలదరించడం ఖాయం. క్లైమాక్స్ ఎలా ఉంటుందో ముందుగానే ఒక అవగాహనకు వచ్చే అవకాశమున్నా అది ఎలా జరుగుతుందనే ఇంటరెస్ట్ క్రియేట్ చేసినప్పుడే దర్శకుడు విజయం సాధించినట్టు.

చిదంబరం ఇక్కడ సక్సెసయ్యాడు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఉండే పోలీసుల ప్రవర్తనని సహజంగా చూపించడమే కాక గుణ కేవ్స్ ఎంత ప్రమాదరకరమైనవో హోమ్ మినిస్టర్ బంధువు యాక్సిడెంట్ గురించి చెప్పించిన వైనం తెలివైన కథనానికి నిదర్శనం. అలా అని మంజుమ్మల్ బాయ్స్ లో లోపాలేవీ లేవని కాదు. సగటు కమర్షియల్ మాస్ ప్రేక్షకుడి కోణంలో చూస్తే ఎంటర్ టైమెంట్ ఉండదు. కమర్షియల్ ఎలిమెంట్స్ కి చోటివ్వలేదు. కుట్టన్ కి తాడు కట్టి లోపలికి పంపాక కొంత స్పీడ్ తగ్గుతుంది. మంజుమ్మాల్ బాయ్స్ బాల్యాన్ని ఫ్లాష్ బాక్ రూపంలో చూపించి దాన్ని వర్తమానానికి ముడిపెట్టిన ఎపిసోడ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది.

క్లైమాక్స్ కు దగ్గరయ్యే క్రమం, గుణలో ప్రియతమా నీవచట కుశలమాలోని ప్రేమకు సంబంధించిన లైన్స్ ని బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేస్తూ స్నేహితులందరూ ఏకతాటిపై తమ లక్ష్యాన్ని చేరుకోవడం తెరపై చూస్తున్నప్పుడు లీనమైపోయేలా చేస్తాయి. ఒక విభిన్నమైన అనుభూతిని అందించి సంతృప్తితో సాగనంపుతాయి. గతంలో నయనతార కర్తవ్యం లాంటి సినిమాల్లో ఈ తరహా సర్వైవల్ జానర్ ని టచ్ చేశారు కానీ వాటిలో లేని ఫీల్ గుడ్ ఎమోషన్, ఫ్రెండ్ షిప్ థ్రెడ్ ఈ మంజుమ్మల్ బాయ్స్ ని ప్రత్యేకంగా నిలిపింది. విభిన్న ప్రయోగాలు, రెగ్యులర్ ఫార్ములాకు భిన్నంగా చేసే ప్రయత్నాలు మెచ్చుకునే ఆడియన్స్ ని ఈ స్నేహితుల బృందం ఎంత మాత్రం నిరాశపరచదు

నటీనటులు

ఓటిటి కంటెంట్ ఫాలో అయ్యేవాళ్ళకు షౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాషి సుపరిచితులే. ప్రాణం పెట్టేశారు. మిగిలిన ఫ్రెండ్స్ అందరూ నిజ జీవితంలో కూడా ఇలాగే ఉంటారేమో అన్నంత సహజంగా నటించారు. పరిచయం లేకపోయినా సరే వాళ్ళ యాక్టింగ్ కి త్వరగా కనెక్ట్ అయిపోతాం. కార్తీ ఖైదీతో మనకు పరిచయమైన జార్జ్ మరియన్ కు మంచి సీన్లు పడ్డాయి. ఖలిద్ రెహమాన్, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, అభిరాం, అరుణ్, విష్ణు, షెబిన్ బెన్సన్ తదితరులు క్యారెక్టర్లకు తగ్గట్టు అల్లుకుంటూ పోయారు. డిపార్ట్ మెంట్ ఆఫీసర్లుగా మణి, కదిరేసన్, విజయ్ ముత్తు, శశి కుమార్ న్యాచురల్ గా ఉన్నారు. వీళ్ళు కాకుండా స్థానికులు పెద్ద ఎత్తున కనిపిస్తారు

సాంకేతిక వర్గం

సుషిన్ శ్యామ్ సంగీతం మంజుమ్మల్ బాయ్స్ కి పట్టుకొమ్మగా నిలిచింది. ప్రారంభంలో వచ్చే పాట అంతగా లేదు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు. ఓవర్ సౌండ్ లేకుండా గుణ కేవ్ ని ప్రతిబింబించేలా ఆ ఘాడతని పట్టిచ్చే వాయిద్యాలు వాడటం బాగుంది. అవసరమైన చోట ప్రియతమాని వాడుకోవడం డెప్త్ ని పెంచింది. షైజు ఖలీద్ ఛాయాగ్రహణం అతి పెద్ద ఛాలెంజ్ ని విజయవంతంగా నిర్వర్తించింది. లోయలో విజువల్స్, డార్క్ కలర్ సెటింగ్, ఇరుకైన మలుపుల్లో ఫ్రేమ్స్ పెట్టిన విధానం అతని పనితనానికి నిదర్శనం. వివేక్ హర్షన్ ఎడిటింగ్ చక్కగా ఉంది. డబ్బింగ్ క్వాలిటీ బాగుంది. నిర్మాణంలో తక్కువ ఖర్చు ఎక్కువ నాణ్యత సూత్రం పాటించారు

ప్లస్ పాయింట్స్

స్టోరీ బ్యాక్ డ్రాప్
స్నేహితుల ఎమోషన్స్
బిగిసడలని కథనం
టెక్నికల్ టీమ్ పనితనం

మైనస్ పాయింట్స్

కొంత నేటివిటీ సమస్య
అక్కడక్కడా ల్యాగ్

ఫినిషింగ్ టచ్ : థ్రిల్లింగ్ రైడ్

రేటింగ్ : 3 / 5

This post was last modified on April 6, 2024 11:17 am

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

ఇరువురు భామలతో ‘సంక్రాంతి’ వినోదం

https://youtu.be/yCkl2Z3PBs0?si=YrheiH3HjVyB7nwZ పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు,…

7 hours ago

డబ్బింగ్ హడావిడి లేని మరో సంక్రాంతి

ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న…

8 hours ago

‘కుప్పం’ రుణం తీర్చుకుంటున్న చంద్ర‌బాబు!

రాష్ట్రానికి సంబంధించి విజ‌న్‌-2047 ఆవిష్క‌రించిన సీఎం చంద్ర‌బాబు.. తాజాగా త‌న సొంత నియోజ‌క వ‌ర్గం.. 35 ఏళ్ల నుంచి వ‌రుస…

10 hours ago

చంద్ర‌బాబు సూప‌ర్‌ విజ‌న్‌.. జ‌గ‌న్ ది డెట్ విజ‌న్‌!: నారా లోకేష్‌

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అప్పులు చేయాల్సి వ‌స్తోంద‌ని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత‌,…

10 hours ago

లైకా వాయిదా ట్విస్టు… మైత్రి మాస్టర్ స్ట్రోకు

గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…

11 hours ago

ట్రైలరుతోనే ట్రోల్ అయిపోయిన రవికుమార్…

కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా…

12 hours ago