ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం కూడా కొత్త కాదని చెప్పారు. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపు ఓటములు చూశానని తెలిపారు. ఇప్పుడు కూడా ఎన్నికలకు తాను రెడీగా ఉన్నానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని అడిగితే వెంటనే చేస్తానని అన్నారు.
ఎన్నికల భయం తనలో లేదని దానం చెప్పారు. గెలుపు ఓటములను ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. తాను పార్టీ మారినట్టు బీఆర్ ఎస్ ప్రచారం చేస్తున్నారని, ఇది ప్రస్తుతం సుప్రీంకోర్టు మరియు స్పీకర్ పరిధిలో ఉందని అన్నారు. తాను రాజీనామాకు సిద్ధమేనని, ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. తాను ఎవరికీ వ్యతిరేఖం కాదని, అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని అందుకే రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నానని తెలిపారు.
గతంలో బీఆర్ ఎస్ కూడా అనేక మంది ఎమ్మెల్యేలని తమవైపు తీసుకుందని దానం గుర్తు చేశారు. అప్పట్లో పార్టీ మారడం గురించి ప్రశ్నించకపోయినా, ఇప్పుడు మాత్రం ఎందుకు సందేహాలు వస్తున్నాయని ప్రశ్నించారు. ఖైరతాబాద్‌లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.
రేవంత్‌పై ప్రశంసలు
ఈ సందర్భంగా దానం సీఎం రేవంత్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన మరో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది అందరి అభిప్రాయమేనని పేర్కొన్నారు. మరింత మంది బీఆర్ ఎస్‌ను విడిచి రావడానికి సిద్ధంగా ఉన్నారని, ఎవరో మాత్రం కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు.
తాము పార్టీ మారలేదని, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ అభివృద్ధికి తోడ్పడుతున్నామని, బంగారు తెలంగాణ కోసం పనిచేస్తున్నామని దానం తెలిపారు.
This post was last modified on December 5, 2025 5:41 pm
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…