Movie Reviews

సమీక్ష – కెప్టెన్ మిల్లర్

కొన్నేళ్ల క్రితం రఘువరన్ బిటెక్ రూపంలో సూపర్ హిట్ అందుకుని తెలుగు మార్కెట్ ఏర్పరుచుకున్న తమిళ స్టార్ ధనుష్ టాలీవుడ్ స్ట్రెయిట్ ఎంట్రీని గత ఏడాది సార్ రూపంలో దిగ్విజయంగా అందుకున్నాడు. అందుకే తన సినిమా ఏదైనా వస్తోందంటే ఎదురు చూసే ప్రేక్షకులు, అభిమానులు ప్రత్యేకంగా ఉన్నారు. అందుకే కెప్టెన్ మిల్లర్ ని కొంత ఆలస్యంగా అయినా థియేటర్లలో రిలీజ్ చేశారు. కంటెంట్ మీద నమ్మకంతో ఏకంగా ముందు రోజు ప్రీమియర్లు కూడా వేశారు. మరి కెప్టెన్ మిల్లర్ మిషన్ సక్సెస్ ఫుల్ గా జరిగిందా లేదా

కథ

స్వాతంత్రం రాక ముందు భారతదేశం బ్రిటిషర్ల పాలనలో ఉన్న కాలమది. తక్కువ కులానికి చెందిన అగ్ని(ధనుష్) తమ జాతికి జరుగుతున్న అవమానం భరించలేక గౌరవం కోసం మిలిటరీలో చేరి మిల్లర్ గా పేరు మార్చుకుంటాడు. అయితే తన చేతులతోనే స్వంతవాళ్లను చంపే దారుణమైన పరిస్థితి తలెత్తడంలో తెల్లదొరలను హత్య చేసి పారిపోతాడు. మిల్లర్ లక్ష్యం ఏంటి, ఇతనికి శివన్న(శివరాజ్ కుమార్), రఫీ(సందీప్ కిషన్)కు సంబంధమేంటి తెరమీద చూడాలి

విశ్లేషణ

కుల వివక్ష మీద సినిమాలు తీయడం మీద కోలీవుడ్ లో జరిగినంత వర్క్ ఇంకెక్కడా కనిపించదు. పా రంజిత్, వెట్రిమారన్ తదితరులు గొప్ప స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారంటే దానికి కారణం ఈ జానర్ ని వాళ్ళు హ్యాండిల్ చేసిన తీరు. ఇలాంటి భావజాలంతో అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించడం చాలా కష్టం. అందుకే రజనీకాంత్ చేసిన కాలా ఫ్లాప్ అయ్యింది. కెప్టెన్ మిల్లర్ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ సెటప్ పరంగా ప్రీ ఇండిపెండెన్స్ సమయానికి వెళ్లి రాసుకున్నాడు కానీ అంతర్లీనంగా అతను చెప్పాలనుకున్న పాయింట్ కూడా అణిచివేయబడిన జాతుల ఘోషను వినిపించడమే. వినూత్నంగా ఉంటుందని ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు. మంచిదే.

స్టోరీపరంగా అరుణ్ రాసుకున్న లైన్ బాగానే ఉంది. అయితే సమస్యంతా క్యారెక్టరైజేషన్లతో వచ్చింది. ముందు అగ్నిని తనవాళ్ల అణిచివేతని భరించలేక మిలిటరీలో చేరేవాడిగా చూపించి, ఆ తర్వాత దొంగగా మార్చి, తిరిగి ఫ్రీడమ్ కోసం పరితపించినవాడిగా చూపించబోయి చాలా చోట్ల కన్ఫ్యూజన్ కు గురయ్యాడు. దానికి తోడు స్క్రీన్ ప్లే ముందుకు వెనక్కు నాన్ లీనియర్ తరహాలో నడిపించాలని చూడటంతో సన్నివేశాలు నెమ్మదిగా భారంగా కదులుతాయి. హీరోయిన్ ప్రియాంకా మోహన్ కు సంబంధించిన ట్రాక్ అందుకే కనెక్ట్ కాదు. ఆమెకు సెట్ చేసిన నేపథ్యం కన్విన్సింగ్ గా లేకపోవడంతో ధనుష్ కి ఆమెకి సరైన రీతిలో ముడి పడలేదు.

అన్నయ్యగా శివన్న, సహచరుడిగా షఫీలను చక్కగా ఎస్టాబ్లిష్ చేసిన అరుణ్ ఆ తర్వాత వాళ్ళను క్యామియో స్థాయికి తగ్గించేయడంతో భారం మొత్తం ధనుష్ మీదే పడింది. జలియన్ వాలా బాగ్ తరహాలో అమాయకులను కాల్చే ఎపిసోడ్, విగ్రహాన్ని రవాణా చేస్తున్న టైంలో అగ్ని ముఠా ఆ కాన్వాయ్ మీద దాడి చేసే ఘట్టం బాగా వచ్చాయి. సుదీర్ఘంగా ఉన్నా సరే ప్రొడక్షన్ వేల్యూస్ తో వాటిని తీర్చిదిద్దిన తీరు మెప్పిస్తుంది. అయితే ఎమోషనల్ గా రీచ్ అయ్యేందుకు తగినన్ని బ్లాక్స్ లేకపోవడంతో పోరాటాలన్నీ ఫ్లాట్ గా వెళ్తాయి. సాంకేతికంగా మెచ్చుకోలు ఇవ్వాలనిపించినా ఎక్కడా ఉద్వేగం కలిగించే సీన్లు లేకపోవడంతో కథనం ఫ్లాట్ గా మారిపోయింది.

ఇక్కడ రెండు అంశాలను బ్యాలన్స్ చేయడంలో అరుణ్ మాతేశ్వరన్ తడబడ్డాడు. ఒకటి అణుగారిన జనం మీద దశాబ్దాల వెనుక ఉన్న వివక్ష, మరొకటి మిల్లర్ అనే కల్పిత వ్యక్తి తెల్లదొరలకు ఎదురొడ్డి జాతి ప్రయోజనాలను కాపాడటం. వీటి మధ్యలో మన దేశం వాళ్ళే స్వార్థం కోసం అయినవాళ్లను వెన్నుపోటు పొడవటం అనే సబ్ ప్లాట్. కేవలం యాక్షన్ తోనే వీటిని నెట్టుకు రావొచ్చని భావించాడు కానీ చేతిలో ఉన్న మంచి ఆర్టిస్టులను పూర్తిగా వాడుకునేలా ఏం చేయాలో అర్థం చేసుకోలేదు. దాని వల్లే శివరాజ్ కుమార్ లాంటి సీనియర్ స్టార్, సందీప్ కిషన్ లాంటి టాలెంటెడ్ యంగ్ హీరో క్లైమాక్స్ లో తప్ప ఇంకెక్కడా ఉపయోగించుకునే అవకాశం అరుణ్ తీసుకోలేదు.

కాసేపు ఈ బలహీనతలను పక్కనపెడితే కెప్టెన్ మిల్లర్ సగటు సినీ ప్రేమికులకు, మూవీ మేకర్స్ కు ఓకే అనిపిస్తుందేమో కానీ కామన్ ఆడియన్స్ మాత్రం ఇతన్ని అంతగా అర్థం చేసుకోలేరు. మాస్ కోసమే భారీ పోరాటాలు పెట్టినా వాటి ముందు వెనుకా అవసరమైన భావోద్వేగాలను దట్టించినప్పుడే ఇలాంటివి పండుతాయి. పైగా గత నాలుగైదేళ్లలో చిరంజీవితో మొదలుపెట్టి జగపతిబాబు లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టుల దాకా అందరూ స్వాతంత్ర పూర్వపు నేపధ్యాలతో సినిమాలు చేస్తున్నారు. అలాంటప్పుడు తిరిగి అదే బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నప్పుడు వావ్, గూస్ బంప్స్ అనిపించే స్థాయిలో హీరోయిక్ ఎలివేషన్లు పండాలి. కెప్టెన్ మిల్లర్ లో మిస్సయ్యింది ఇవే

నటీనటులు

ధనుష్ కి ఇలాంటివి కొట్టిన పిండి. సెట్లు షూటింగ్ స్పాట్లు మారాయి కానీ అసురన్, వడ చెన్నై లాంటి క్లాసిక్స్ లో అదరగొట్టిన ఇతనికి ప్రత్యేకంగా ఛాలెంజ్ అంటూ మిల్లర్ విసరలేదు. ఎప్పటిలాగే సీరియస్ టోన్ తో లాగించేశాడు. ప్రియాంకా మోహన్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. పెర్ఫార్మన్స్ ఇచ్చింది కానీ అంత వెయిట్ లేదు. నివేదితా సతీష్ సహజంగా ఉంది. శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ ను సరిగా వాడుకోలేదు. జయప్రకాశ్, జాన్ కొక్కెన్, అదితి బాలన్, విజె చంద్రశేఖర్, కాళీ వెంకట్, బోస్ వెంకట్, విజి చంద్రశేఖర్ ఇలా చెప్పుకుంటూ పోతే క్యాస్టింగ్ చాంతాడంత ఉంది. వాళ్ళ పరిధుల మేరకు మైనస్ అనిపించకుండా చక్కగా నటించారు.

సాంకేతిక వర్గం

జివి ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం బాగా కుదిరింది. ధనుష్ ఇంట్రోతో మొదలుపెట్టి యాక్షన్ ఎపిసోడ్స్ దాకా క్వాలిటీ బిజిఎం ఇచ్చాడు. పాటలు గుర్తుపెట్టుకునేవి, మళ్ళీ వినేవి లేవు. సిద్దార్థ నుని ఛాయాగ్రహణం అన్ని ప్రశంసలకు అర్హత సాధించింది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ తో పోటీ పడుతూ బడ్జెట్ లిమిట్స్ లోనే అప్పటి వాతావరణాన్ని సహజంగా చూపించడంలో సక్సెస్ అయ్యింది. నిడివి విషయంలో రామచంద్రన్ ఎడిటింగ్ ని పూర్తిగా బాధ్యత అనలేం కానీ ఫైట్లను ట్రిమ్ చేయాల్సింది. సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మాణం భారీగా ఉంది. ఇలాంటి సబ్జెక్టుని నమ్మి ఇంత ఖర్చు పెట్టేందుకు వెనుకాడలేదంటే హీరో దర్శకుడి మీద ఉన్న నమ్మకమే

ప్లస్ పాయింట్స్

ధనుష్
నేపధ్య సంగీతం
టెక్నికల్ వర్క్
యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్

సరిపోని ఎమోషన్
హీరోయిన్ ట్రాక్
ఫ్లాట్ గా అనిపించే మలుపులు
స్టార్ క్యాస్టింగ్ వృథా కావడం

ఫినిషింగ్ టచ్ : మెప్పించని మిల్లర్

రేటింగ్ : 2.25 / 5

This post was last modified on January 27, 2024 1:03 am

Share

Recent Posts

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

12 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

56 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

5 hours ago