Movie Reviews

సమీక్ష – దూత

Cast: Naga Chaitanya, Priya Bhavani Shankar, Parvathy Thiruvothu, Prachi Desai, Pasupathy, Ravindra Vijay, Tharun Bhascker, Rohini, Tanikella Bharani, Eeshwari Rao and others
Director: Vikram K Kumar
Producers: Sharrath Marar
Music : Ishaan Chhabra
Release Date : 01 – 12 – 2023
Streaming On : Amazon Prime

ఒక స్టార్ హీరో వెబ్ సిరీస్ లో నటించడం బాలీవుడ్ లో సాధారణమే కానీ తెలుగులో ఎవరూ సాహసించలేదు. దానికి శ్రీకారం చుట్టాడు నాగ చైతన్య. మనం, 24, ఇష్క్, నాని గ్యాంగ్ లీడర్ లాంటి విలక్షణ కథలతో ప్రయోగాలు చేసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ తీయడంతో దీని మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టే అమెజాన్ ప్రైమ్ భారీ ప్రమోషన్లతో ఆడియన్స్ కి చేరువ చేసింది. యానిమల్ హడావిడిలో పడిపోయాం కానీ క్రమంగా జనాల దృష్టి దీని మీద పడుతోంది. మరి దూత మెప్పించేలా ఉన్నాడా

కథ

సమాచార్ దినపత్రికకు చీఫ్ ఎడిటర్ గా బాధ్యతలు తీసుకున్న సాగర్ వర్మ(నాగ చైతన్య)కు వృత్తిపరంగా గొప్ప పేరుంటుంది. భార్య ప్రియా (ప్రియా భవాని శంకర్), కూతురు అంజలితో ప్రశాంతంగా గడుపుతూ ఉంటాడు. ఓ రాత్రి కారులో ఇంటికెళ్తుండగా ఒక పాత పేపర్ కటింగ్ దొరికి అందులో చేసిన హెచ్చరిక ప్రకారమే పెంపుడు కుక్క చనిపోతుంది. అక్కడ నుంచి సాగర్ కు పరిచయమైన వాళ్ళు ఒక్కొక్కరుగా హత్యకు గురవుతారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన డిసిపి క్రాంతి (పార్వతి తిరువత్తు) కి విభ్రాంతి కలిగే వాస్తవాలు తెలుస్తాయి. ఈలోగా సాగర్ కుటుంబం ప్రమాదంలో పడుతుంది. ఇంతకీ ఆ న్యూస్ పేపర్ల మిస్టరీ వెనుక ఉన్న అసలు స్టోరీనే దూత

విశ్లేషణ

ఊహాతీతంగా స్క్రీన్ ప్లే నడిపించడంలోనే థ్రిల్లర్స్ యెక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మాధవన్ 13Bతోనే ఈ విషయంలో తనకున్న పట్టుని ఋజువు చేసుకున్న విక్రమ్ కె కుమార్ ఈసారి క్రైమ్, హారర్, సస్పెన్స్ మూడింటిని ముడిపెట్టి కొందరు తప్పుదారి పడుతున్న జర్నలిస్టులకో సందేశం ఇవ్వాలనే ప్రయత్నం వెరైటీగా ఉంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో ఆరు గంటలకు దగ్గరగా ఉన్న దూతను వీలైనంత బోర్ కొట్టించకుండా చేసేందుకు దర్శకుడు విశ్వప్రయత్నం చేశారు. అందుకే మొదటి భాగం నుంచే అనవసరమైన ఎలిమెంట్స్ జోలికి వెళ్లకుండా నేరుగా సాగర్ కార్ యాక్సిడెంట్ తో తానేం చెప్పబోతున్నాడో ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తాడు.

పేపర్ ముక్కలు దొరికినప్పుడంతా హత్యలు జరగడమనే పాయింట్ లో వైవిధ్యం ఉంది. కానీ ఒక దశ దాటాక వాటిలో షాక్ వేల్యూ తగ్గిపోయి ఇంతకీ మర్డర్లు ఎవరు చేస్తున్నారనే ప్రశ్న చుట్టే చూసేవాళ్ళ మెదడు తిరగడంతో కొంత సాగతీత జరిగిన భావన కలుగుతుంది. అసలు దెయ్యాన్ని ఎక్కడా చూపించకుండా, ఉందో లేదోనని అనుమానం రేకెత్తిస్తూ ఒకవిధమైన ఇంటెలిజెంట్ కథనం మీద ఆధారపడ్డ విక్రమ్ కుమార్ కేసు విచారణ జరిగే క్రమంలో ట్విస్టులను చక్కగా తీర్చిదిద్దారు. పాత్రల మధ్య లింకులను తెలివిగా పేర్చుకుంటూ, ఇంకేదో భయంకరమైన మలుపు ఉందనే యాంగ్జైటీని పెంచుకుంటూ నాలుగో ఎపిసోడ్ దాకా చక్కగా మైంటైన్ చేస్తూ వెళ్ళాడు.

విక్రమ్ కె కుమార్ లోని సెన్సిబుల్ రైటర్ ఇంత ఘాడమైన థ్రిల్లర్ లోనూ పదునుగా పని చేయడం మెచ్చుకోవాలి. మర్డర్లు కాస్త భీతి గొలిపేలా, కుటుంబ ప్రేక్షకులకు ఇబ్బందిగా అనిపించేలా ఉన్నప్పటికీ ఈ మధ్య స్టార్ హీరోలు స్క్రీన్ మీద చేస్తున్న రక్తపాతంతో పోలిస్తే ఇదేమంత పట్టించుకునే అంశం కాదనిపిస్తుంది. వర్షం, రాత్రి ఈ రెండింటి చుట్టే ముప్పాతిక భాగం దూత నడుస్తుంది. అయినా సరే ఒకే చోట ఉన్న ఫీలింగ్ కలగకుండా సన్నివేశాలు కూర్చుకోవడం దూతను నిలబెట్టాయి. అయితే ఫ్లాష్ బ్యాక్ మొదలుపెట్టాక అక్కడ పెట్టిన 1962 నేపథ్యం డిఫరెంట్ గా ఉంది కానీ మరీ కొత్తగా అనిపించకపోవడంతో పాటు రొటీన్ గా సాగిన ఫీలింగ్ కలిగిస్తుంది.

దీంతో అప్పటిదాకా పరుగులు పెట్టిన ఫ్లోకి బ్రేకులు వేసినట్టు అయ్యింది. విలన్లను రివీల్ చేసే క్రమం, ఆత్మగా మారి పేపర్ కటింగ్లు ఎవరు వదులుతున్నారో రివీల్ చేయడం మరీ గొప్పగా లేకపోయింది. దీని వల్లే ఇంపాక్ట్ తగ్గినా ఈ ఎపిసోడ్ లో సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులను పెట్టుకోవడం వల్ల భారీ మైనస్ కాకుండా కాపాడింది. అయితే ఈ దారుణాలు సాగర్ ఎలా ఆపుతాడని సగటు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న క్రమంలో అతని నిస్సహాయత చాలా సేపు హైలైట్ కావడం ఒకవిధంగా నెరేషన్ లోపమే. నిజమేంటో తెలుసుకోవడం కోసం అతను చేసే ప్రయత్నం, ప్రయాణం ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండి ఉంటే వావ్ ఫ్యాక్టర్ పెద్ద ఎత్తున పెరిగిపోయేది.

గత కొంత కాలంగా ఆదరణ తగ్గిపోతున్న వెబ్ సిరీస్ ట్రెండ్ లో దూతకు మంచి స్పందన వచ్చే అవకాశం లేకపోలేదు. హింస, తక్కువ మోతాదులో వాడిన బూతు పదాలు, రొమాన్స్ కొంత జొప్పించినప్పటికీ వీలైనంత వరకు విక్రమ్ కె కుమార్ వాటిని హద్దుల్లోనే ఉంచేందుకు చేసిన ప్రయత్నం మెచ్చుకోవచ్చు. ఫార్వార్డ్ కు ఎక్కువ పని చెప్పకుండా ఉండేందుకు చూశారు కానీ లెన్త్ వల్ల అక్కడక్కడా తప్పలేదు. దూత సక్సెస్ అయితే నాగ చైతన్య దారిలో మరికొందరు హీరోలు నడిచే అవకాశం లేకపోలేదు. థియేటర్ కన్నా ఎక్కువ చాలా ఎక్కువ సమయం డిమాండ్ చేసే వెబ్ కంటెంట్ ని దర్శకులు వీలైనంత ఎంగేజింగ్ గా చూపించగలిగితే ఈజీగా హిట్లు కొట్టొచ్చు.

నటీనటులు

నటుడిగా నాగచైతన్యలోని పరిణితిని మరింతగా పరిచయం చేయడానికి దూత ఉపయోగపడింది. కాస్త గ్రే షేడ్ ఉన్నప్పటికీ దాన్ని బ్యాలన్స్ గా పోషించిన విధానం ఆకట్టుకుంది. ఎఫ్ లాంటి పదాలు వినడం ఇబ్బందిగా ఉన్నా ఎబ్బెట్టుగా ఉండదు. ప్రియా భవాని శంకర్ పర్వాలేదు. ఒదిగిపోయింది. పార్వతి తన పాత్ర డిమాండ్ చేసిన హుందాతనం, పెర్ఫార్మన్స్ రెండూ ఇచ్చింది. రవీంద్ర విజయ్ కు డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత గౌతమ్ కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ కు పరిమితమైన తరుణ్ భాస్కర్, తనికెళ్ళ భరణి, పశుపతిలు బాగా కుదిరారు. ప్రచీ దేశాయ్ ఓకే. లెన్త్ ఎంత దొరికిందనేది పక్కన పెడితే అందరికి ప్రాధాన్యం వచ్చేలా చూసుకున్నారు

సాంకేతిక వర్గం

సింపుల్ సౌండ్ అయినా దూతకు కావాల్సిన డెప్త్ ఫీలయ్యేలా ఇషాన్ చాబ్రా అందించిన నేపధ్య సంగీతం బాగుంది. విపరీతమైన హోరు లేకుండా నీట్ గా కంపోజ్ చేయడం నచ్చుతుంది. మికోలజ్ సైగులా ఛాయాగ్రహణం పగలు ప్రస్తావన ఎక్కువ లేకుండా కేవలం రాత్రి, వర్షానికే కట్టుబడాల్సి వచ్చినా విజువల్స్ లో క్వాలిటీ తగ్గకుండా మంచి వర్క్ చేశారు. వెబ్ సిరీస్ కాబట్టి ఎడిటింగ్ పరంగా నవీన్ నూలికున్న పరిమితులను ఊహించుకోలేం కనక నో డిస్కషన్. వెంకటేష్ దొండపాటి సంభాషణల్లో జర్నలిజం గురించిన కొన్ని విషయాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడక్షన్ పరంగా ఖర్చు విషయంలో పెద్దగా వెనుకాడలేదు.

ప్లస్ పాయింట్స్

విభిన్నమైన కథ
నాగ చైతన్య
ట్విస్టులు
విక్రమ్ టేకింగ్

మైనస్ పాయింట్స్

సగమయ్యాక పెరిగిన నిడివి
ఫ్లాష్ బ్యాక్ కొంత రొటీనే
వయొలెన్స్ ఎలిమెంట్
ఆశించినంత భయం లేదు

ఫినిషింగ్ టచ్ – ఓకే అనిపించే థ్రిల్

This post was last modified on December 4, 2023 8:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సప్తగిరి పక్కన హీరోయిన్ గా ఒప్పుకోలేదా…

ఈ రోజుల్లో స్టార్ హీరోల పక్కన సరైన హీరోయిన్లను సెట్ చేయడమే కష్టమవుతోంది. మన దగ్గర బోలెడంతమంది హీరోలున్నారు. కానీ…

2 hours ago

18న ఢిల్లీకి బాబు… అజెండా ఏంటంటే?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.…

2 hours ago

మహిళలకు కూటమి అదిరే గిఫ్ట్!… అగ్రి ప్రోడక్ట్స్ కూ బూస్టే!

ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర…

3 hours ago

షాకింగ్‌: ద‌స్త‌గిరి భార్య‌పై దాడి.. చంపుతామ‌ని బెదిరింపు!

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌లో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవ‌ర్‌గా మారిన షేక్ ద‌స్త‌గిరి భార్య షాబానాపై…

4 hours ago

విజయ్ దేవరకొండ అన్నయ్యగా సత్యదేవ్ ?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కింగ్…

5 hours ago

ఎంపీ డీకే ఇంట్లోకి ఆగంతకుడు… కానీ చోరీ జరగలేదు

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించిన విషయం ఆదివారం హైదరాబాద్…

5 hours ago