Movie Reviews

సమీక్ష – మీటర్

చిన్న హీరోగా ప్రస్థానం మొదలుపెట్టి ఎస్ఆర్ కళ్యాణమండపం రూపంలో రెండో సినిమాతోనే పెద్ద హిట్టు అందుకున్న కిరణ్ అబ్బవరంకు కొంత కాలంగా పెద్ద  బ్యానర్లు చేయూతనిస్తున్నాయి. వినరో భాగ్యము విష్ణు కథను గీతా ఆర్ట్స్ నిర్మించగా ఇవాళ రిలీజైన మీటర్ లో మైత్రి మూవీ మేకర్స్ భాగస్వామ్యం ఉంది. మాస్ రాజా రవితేజ రావణాసుర బరిలో ఉన్నప్పటికీ కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో దీన్ని పోటీలో దింపడానికి సిద్ధపడ్డారు. ప్రమోషన్లు గట్టిగానే చేశారు. మరి హంగామాకు తగ్గట్టు మీటర్ మోతాదు సరిగానే ఉందా  

కథ

నీతినిజాయితీకి కట్టుబడటం వల్ల తండ్రి పోగొట్టుకున్నదే ఎక్కువని గుర్తించిన అర్జున్ కళ్యాణ్(కిరణ్ అబ్బవరం)కు చిన్నప్పటి నుంచే పోలీస్ ఉద్యోగమంటే చిరాకు. అయినా తండ్రి సంతోషం కోసం పంజాగుట్ట సిఐగా జాబ్ తెచ్చుకుంటాడు. అనుకోకుండా చేసిన పనుల వల్ల మీడియాలో హీరో అయిపోతాడు. ఈ కారణంగా హోమ్ మినిస్టర్ కంఠం బైరెడ్డి(పవన్)తో శత్రుత్వం ఏర్పడుతుంది. దీంతో అర్జున్ ఖాకీ దుస్తులకు దూరమయ్యే ప్రమాదం తలెత్తుంది.  అక్కడి నుంచి మంత్రికి అర్జున్ కి జరిగే ఎలుకా పిల్లాట తెరమీద చూడాలి

విశ్లేషణ

కమర్షియల్ సినిమా అంటే ఆషామాషీ కాదు ఎవరు పడితే వాళ్ళు చేస్తే మాస్ ఎగబడి చూడడానికి. దానికంటూ కొన్ని కొలతలు వాటికి సరిగ్గా సూటయ్యే హీరో మెటీరియల్స్ అవసరమవుతాయి. వాళ్ళు చేస్తేనే జనం ఒప్పుకుంటారు. అంతే తప్ప చేతిలో స్క్రిప్ట్ ఉంది దాన్నిండా మసాలా అంశాలు ఉన్నాయని తొందరపడితే ఇదిగో అచ్చం ఇలా మీటర్ లా తయారవుతుంది. కిరణ్ లో హోమ్లీగా కనిపించే పక్కింటి కుర్రాడు ఉన్నాడు. దానికి తగ్గట్టు పాత్రలు చేస్తే ఆడియన్స్ అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దర్శకుడు రమేష్ కడూరికి ఏ కోణంలో తనలో ఊర మాస్ పోలీస్ ని చూశాడో అతనికే తెలియాలి.

రొటీన్ కథలను మళ్ళీ తీయడం తప్పేమీ కాదు. ఆ మాటకొస్తే స్టార్లు కూడా ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. కానీ వీటికి కొన్ని క్యాలికులేషన్లు అవసరం. కొన్ని లాజిక్కులు ఇంకా ముఖ్యం. రాష్ట్ర ముఖ్యమంత్రినే రూమ్ కి పిలిచి కాలితో తన్నే విలన్ అఫ్ట్రాల్ ఒక ఎస్ఐకి లొంగిపోయి తోలుబొమ్మలా మారడం ఏ మాత్రం సింక్ అవ్వని పరమ వీక్ ప్లాట్. ఇక్కడి నుంచే రమేష్ రాత క్రమం తప్పకుండా దారి తప్పుతూ వెళ్ళింది. ప్రతిదీ అర్జున్ కళ్యాణ్ కు అనుకూలంగా జరుగుతుంది. డిఐజి, పోలీస్ కమీషనర్లు డమ్మీలవుతారు. ఇంత తెలివైన కుర్ర పోలీసు మంత్రి చెప్పాడని కనీస విచక్షణ ఆలోచన లేకుండా ఓ అమాయకుడిని చంపేందుకు సిద్ధపడతాడు.

ఇలాంటి అతకని అతుకుల బొంతలు టైటిల్ కార్డుతో మొదలుపెట్టి చివరిదాకా వస్తూనే ఉంటాయి. బహుశా దర్శకుడు రమేష్ కడూరి మీద రౌడీ ఇన్స్ పెక్టర్, గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ చిత్రాల ప్రభావం చాలా బలంగా ఉంది కాబోలు. కానీ వాటిలో నటించింది ఫ్యాన్ బేస్ మెండుగా ఉన్న పెద్ద స్టార్లు కాబట్టి ఎన్ని లోపాలున్నా జనం పట్టించుకోలేదు. వాళ్ళ టికెట్ డబ్బులకు న్యాయం కలిగించే కంటెంట్ ఉండటంతో బ్లాక్ బస్టర్లు చేశారు. రమేష్ ఈ మీటర్ ని కూడా అలాగే తీయాలని తెగ తాపత్రయపడ్డాడు. కానీ దానికి తగ్గ కసరత్తు, కిరణ్ కు సూటయ్యేలా అండర్ డాగ్ హీరోయిజంని డిజైన్ చేసుకోవడం మర్చిపోయాడు. దీంతో మీటర్ వంద కాదు పది స్పీడులో పరిగెత్తింది.

సరే లైన్ సంగతి కాసేపు పక్కనపెడితే హీరో హీరోయిన్ ప్రేమలో పడే ట్రాక్ మహా విచిత్రంగా ఉంటుంది. మగాళ్ళంటేనే అసహ్యపడే అమ్మాయి ఒక ఫైట్, హీరో వెకిలి వేషాలు చూసి డ్యూయెట్ వేసుకుంటుంది. ఇలాంటివి గతంలోనూ వచ్చాయి. రవితేజ లాంటి వాళ్ళు చేస్తే ఇవన్నీ క్షమించేయొచ్చు. కానీ లేత కుర్రాడు చేస్తేనే అసలు చిక్కు. ఫస్ట్ హాఫ్ ని ఏదోలా నెట్టుకుంటూ వచ్చిన రమేష్ కడూరి సెకండ్ హాఫ్ లో పూర్తిగా చేతులెత్తేశాడు. పోలీస్ సెలక్షన్ కు సంబంధించిన పెద్ద స్కామ్ ని సెంట్రల్ థీమ్ గా తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న ట్విస్టులను సిల్లీగా రాసుకోవడంతో సీరియస్ సన్నివేశాలు కూడా కొన్నిసార్లు నవ్వు తెప్పించిన సందర్భాలున్నాయి

రమేష్ కడూరి స్వంతంగా తనదంటూ ఏ స్టైల్ ని పరిచయం చేయలేదు. ఖైదీ నెంబర్ 150లో చీకటి ఫైట్, పోకిరిలో మహేష్ బాబు గురించి నాజర్ ఇచ్చే ఎలివేషన్లు ఇవన్నీ మీటర్ లో వాడేసుకున్నాడు. జనాలు గుర్తుపట్టరనే అమాయకత్వమో లేక కిరణ్ ఏం చేసినా ఎగబడి చూస్తారనే వెర్రి నమ్మకమో ఏంటో తెలియదు కానీ రొటీన్ సైతం మొహమాటపడేంత రొటీన్ గా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. చివర్లో విలన్ ని స్మార్ట్ ఫోన్ చూపించి హీరో బకరా చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో నభూతో నభవిష్యత్. అక్కడ నవ్వాలో తీసినోళ్ల మేథాశక్తికి ఆశ్చర్యపోవాలో అంతు చిక్కని అయోమయంలో ఇరుక్కుంటాం. చివర్లో హీరో తండ్రికి ఇచ్చే ఎలివేషన్ సూపరంటే సూపరంతే  

నటీనటులు

కిరణ్ అబ్బవరం వీలైనంత త్వరగా మాస్ ఉచ్చు నుంచి బయటికి వస్తే కెరీర్ కు చాలా మంచిది. తనను కమర్షియల్ గానే చూడాలని ఆడియన్స్ కోరుకోవడం లేదు. అయినా సరే పదేపదే దెబ్బ పడుతున్నా ఎందుకు రిపీట్ చేస్తున్నాడో అర్థం కాదు. ఇలాంటి పాత్రను మోసేంత వెయిట్ కిరణ్ ఇంకా సంపాదించుకోలేదు. హీరోయిన్ అతుల్య రవి మొక్కుబడిగా ఉంది. డ్యాన్సులు రెండు మూతివిరుపులు తప్ప చేసిందేమీ లేదు. క్యాస్టింగ్ బాలేదు. హీరో తండ్రి, విలన్ పవన్ ఇద్దరూ మిస్ మ్యాచ్ అయ్యారు. డబ్బింగ్ తో మేనేజ్ చేశారు కానీ అనుభవమున్న నటులు చేసి ఉంటే స్క్రీన్ ప్రెజెన్స్ పెరిగి బాగుండేది. సప్తగిరి, గోపిల కామెడీ రెగ్యులర్. మిగిలిన పాత్రలేవీ గుర్తుండవు

సాంకేతిక వర్గం

సంగీత దర్శకుడు సాయికార్తిక్ పాటలు, నేపధ్య సంగీతం రెండూ కంటెంట్ కు తగ్గట్టే ఉన్నాయి. హీరో బిల్డప్ కి ఇచ్చిన బీజీఎమ్ లో సౌండ్ ఎక్కువైపోయింది. వెంకట్ సి దిలీప్ – సురేష్ ఛాయాగ్రహణం క్వాలిటీకి కట్టుబడింది. ప్రొడక్షన్ లో రాజీ ఉన్నప్పటికీ దాన్ని వీలైనంత కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ లెన్త్ ని రెండు గంటల ఏడు నిమిషాలకే కుదించడం మెచ్చుకోదగ్గ విషయం. రమేష్ – సూర్యల సంభాషణలు అక్కడక్కడా పేలాయి. నిర్మాణ విలువలు మరీ చెప్పుకున్నంత రిచ్ గా అయితే కనిపించవు

ప్లస్ పాయింట్స్

పెద్దగా లేవు

మైనస్ పాయింట్స్

అరిగిపోయిన కథ
ఓవర్ హీరోయిజం
సిల్లీ నెరేషన్
అర్థం లేని లాజిక్స్

ఫినిషింగ్ టచ్ : చెడిపోయిన మీటర్

రేటింగ్ : 1.75/5 

This post was last modified on April 8, 2023 9:28 am

Share
Show comments
Published by
Satya
Tags: FeatureMeter

Recent Posts

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

47 minutes ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

54 minutes ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

2 hours ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

2 hours ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

3 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

3 hours ago