Movie Reviews

సమీక్ష – స్వాతిముత్యం

రెండు గంటలకు పైగా థియేటర్ లో ప్రేక్షకుడికి కూర్చోపెట్టాలంటే సులువైన ఉపాయం ఫన్..అండ్ ఎంటర్ టైన్ మెంట్. అంతకన్నా దగ్గర దారి లేదు. కానీ ఆ దారిలో నడక ఏమంత సులువూ కాదు. ఫన్..ఎంటర్ టైన్ మెంట్ పండితే పండగే. పండకపోతే కష్టమే. ఈ రిస్క్ వున్న అతి సులవైన సినిమా దారి అది. ఈ దారిని ఎంచుకుని, ఒక కొత్త పాయింట్ తో తీసిన సినిమా స్వాతిముత్యం. మొహమాటానికి పోయి వీర్యదానం చేసి ఇరుక్కుపోయిన కుర్రాడి కథ స్వాతిముత్యం. వీర్యదానం అన్నది చులకనగా చూసే వ్యవహారం కాదు. ఎంతో మంది పిల్లలు కలుగని వారికి అదో వరం అన్న చిన్న మెసేజ్.

ఇంతకీ స్వాతిముత్యం కథేంటీ?

పిఠాపురం కరెంట్ ఆఫీసులో పనిచేసే కుర్రాడు బాలు (బెల్లంకొండ గణేష్). పెళ్లి చూపుల్లో భాగ్య లక్ష్మి (వర్ష బొల్లమ్మ) ను చూపి ప్రేమిస్తాడు. పెళ్లి పీటల వరకు వెళ్లిన కథలో పెద్ద ట్విస్ట్. పెళ్లికి ముందు స్నేహితుడు (వెన్నెల కిషోర్) బలవంతం మీద చేసిన వీర్యదానం, పిల్లాడి రూపంలో ప్రత్యక్షమై పెళ్లిని పెటాకులు చేస్తుంది. పరువు పోయిందని తండ్రి (రావు రమేష్), మోసం చేసాడని ప్రియురాలు, ఇలా గోలగోల. చెప్పేది అర్థం చేసుకోరు. ఇలాంటి నేపథ్యంలో చివరకు కథ ఎలా సుఖాంతం అయిందన్నది మిగిలిన సినిమా.

కొత్త దర్శకుడు లక్ష్మణ్ పెద్దగా తాను ఇబ్బంది పడిపోయే, నటులను ఇబ్బంది పెట్టే, నిర్మాతను ఇబ్బందికి గురిచేసే విధమైన లైన్ లో వెళ్లలేదు. కేక్ వాక్ అంటారే…అలా వెళ్లిపోయే పని పెట్టుకున్నాడు. సినిమాలో లేయర్ల మీద లేయర్లు వేసుకోలేదు. ఇలా స్టార్ట్ చేసి, అలా ప్రేమ, పెళ్లి మీదుగా విశ్రాంతి బ్యాంగ్ కు సినిమాను తీసుకెళ్లిపోయాడు. ఎప్పుడయితే ప్రేమ పెళ్లి అంటూ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లా కథ సాగిపోతోందో, ప్రేక్షకుడికి అనుమానం కొడుతూనే వుంటుంది. ఇంటర్వెల్ దగ్గర పీట ముడి పడిపోతుందని. ఊహించినట్లు అదే జరుగుతుంది. నిజానికి కథ ఇక్కడ వరకు తీసుకురావడం పెద్ద సమస్య కాదు. ఆ ముడిని సజావుగా విప్పడమే సమస్య. అదంతా ద్వీతీయార్థంలోనే.

తొలిసగంలో ఫిల్లింగ్ కోసం ఫన్ నే నమ్ముకున్నాడు దర్శకుడు. అక్కడ కూడా పెద్దగా రిస్క్ తీసుకోలేదు. గోదావరి పలుకుబడిలో, అక్కడ వినిపించే ఫన్ నే వాడుకున్నాడు. అక్కడి వ్యవహారాలను సుతిమెత్తగా సెటైర్ వేసాడు. అందుకే ప్రేక్షకులు తొలిసగానికి నూరు శాతం మార్కులు వేసేస్తారు.

మలిసగం ప్రారంభం అయ్యాక అసలు టాస్క్ మొదలవుతుంది. ఇప్పటికీ ఇంట్లో మాట్లాడుకోవడానికి ఇబ్బంది అయిన దాన్ని తల్లితండ్రులకు అర్థం అయ్యేలా చెప్పడం అన్నది హీరోకి అతి పెద్ద సవాలు. అది చెప్పేస్తే ఓ పనైపోతుంది. సినిమా అయిపోతుంది. చెప్పడానికి ఆటంకాలు కలగాలి. అలా అని కథ అక్కకడిక్కడే గుడుగుడు గుంచం తిరుగుతున్నట్లు అనిపించకూడదు. ఎందుకంటే ప్రేక్షకుడికి తెలుసు కదా అసలు వ్యవహారం అంతా.

ఇక్కడ కూడా దర్శకుడు పెద్దగా పెయిన్ తీసుకోదల్చుకోలేదు. నటులను కిందా మీదా కానివ్వలేదు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టలేదు. పైపైన తేల్చుకుంటూ ముందుకు సాగిపోయాడు. గోపరాజు రమణ క్యారెక్టర్ ను వాడుకుని గొదావరి జనాల మధ్య వినిపించే వ్యవహారాలనే ఇక్కడా సెటైర్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఒక దశలో ఆ హీరో, హీరోయిన్ల మీద ఎమోషన్లు కాస్త ఇబ్బంది అనిపిస్తున్నాయోమో అని అనిపిస్తుంది. అంతలోనే అక్కడి నుంచి సినిమాను షిప్ట్ చేసి, చకచకా శుభం కార్డు వైపు నడిపించేసాడు.

మొత్తం మీద కొత్త దర్శకుడు లక్షణ్ కు విషయం వుంది. దానికి తగిన నటులు దొరికారు. స్వాతిముత్యం క్యారెక్టర్ కు గణేష్ బాగానే సరిపోయాడు. సిద్దూ, నవీన్ పోలిశెట్టి వుంటే ఇంకెలా వుండేదో అన్న కామెంట్లు వినిపించవచ్చు కానీ, గణేష్ చెడగొట్టలేదని మాత్రం చెప్పుకోవచ్చు. వర్ష ఓకె.రావు రమేష్..నరేష్, గొోపరాజు రమణ్, వెన్నెల కిషోర్ ఎప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తే అప్పుడు నవ్వులు పండించారు. సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ ను మరికాస్త వాడుకుని వుంటే ఇంకా బాగుండేది. కానీ అక్కడ స్కోప్ కనిపించలేదు.

టెక్నికల్ గా చిన్న సినిమాలా కాకుండా పెద్ద సినిమాలకు దీటుగా వుంది. గోదావరి ప్రాంత నాచురల్ లోకేషన్లు బాగున్నాయి. మహతి స్వరసాగర్ వర్క్ జస్ట్ ఓకె. సినిమాటోగ్రఫీ బాగుంది. లెంగ్త్ తక్కువ వుండడం అన్నది సినిమాకు ప్లస్.

రెండు పెద్ద సినిమాల మధ్య ఈ లేగదూడ స్వాతిముత్యం కాస్త నిలదొక్కుకోగలిగితే, ఫ్యామిలీలు ఇటు చూసి, థియేటర్ వైపు రావడానికి అవకాశం వుంటుంది.

ప్లస్ పాయింట్లు

ఫన్
నిడివి

మైనస్ పాయింట్లు

ద్వితీయార్థంలో ఒకటి రెండు లాగ్ సీన్లు

ఫినిషింగ్ టచ్: స్వాతిముత్యం-క్లీన్ అండ్ షైనీ

Rating: 3/5

suman

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

3 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

4 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

5 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

7 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

13 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

14 hours ago