Movie Reviews

సమీక్ష.. బీస్ట్

ఓసారి కమిట్ అయితే నా మాట నేనే వినను…ఇదీ బీస్ట్ సినిమాలో ఆఖరున హీరో విఙయ్ నోట వినిపించే పూరి ఙగన్నాధ్ పోకిరి డైలాగు. బహుశా హీరో విఙయ్, డైరక్టర్ నీల్సన్ ఇలా ఎవరి వాళ్లు అనుకునే, ఎవరి మాట వారిదే అనుకుంటూ ఎవరి స్టయిల్ లో వారు సినిమా చేసేసారు. అదే ఈ వారం విడుదలయిన బీస్ట్. ఇప్పటికే అన్ని భాషల్లో సవాలక్షసార్లు చూసేసిన హైఙాక్ డ్రామానే మరోసారి విఙయ/నీల్సన్ స్టయిల్ లో చూపించే ప్రయత్నం ఇది. హీరో నా స్టయిల్ నాది అనుకుని, డైరక్టర్ నా స్ట్రిప్ట్ నాది అనుకుని ముందుకు సాగడంతో సినిమాకు తక్కవ…చిన్న పిల్లలాటకు ఎక్కువ అన్నట్లు తయారైందీ సినిమా. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, ఊపిరి సలపనివ్వకుండా సాగాల్సిన స్ఖ్రిప్ట్ ను, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉయ్యాల ఊపినట్లు చిత్రీకరించారు. దాంతో ప్రేక్షకుడు సీటు అంచున కూర్చోవాల్సిన పని లేదు. ప్రశాంతంగా పాప్ కార్న నములుకుంటూ, ఏ టెన్షన్ లేకుండా, పెద్దగా అటెన్షన్ పెట్టాల్సిన పని లేకుండా చూడగలిగే సినిమాగా మారింది.

హీరో రా ఏఙెంట్. కానీ ఉద్యోగం వదిలిన చాలా ఏళ్ల తరువాత ఓ మాల్ సెక్యూరిటీ సంస్థలో చేరేందుకు వెళ్తాడు. తీరా చేసి వెళ్లీ వెళ్లగానే ఆ మాల్ ను హైఙాక్ చేస్తారు తీవ్రవాదులు. ఓ కరుడుగట్టిన టెర్రరిస్ట్ ను విడుదల చేయాలని డిమాండ్. మాల్ లో అప్పటికే వున్న హీరో ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేసాడు అన్నది కథ. మాల్ లోపల ఇలా వుంటే, మాల్ బయట అధికారులు, రాఙకీయనాయకుల వ్యవహారాలు ఎలా సాగాయన్నది కథలో పిడకలవేట అన్నమాట.

దర్శకుడు కథను ఎంత టేకిట్ ఈఙీగా తీసుకున్నాడు అన్న దానికి చిన్న ఉదాహరణ. మాల్ ను టెర్రరిస్ట్ లు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు అని తెలియగానే… నేషనల్ లెవెల్ భద్రతా అధికారులు ఆపరేషన్ కు రెడీ అయిపోతారు. అప్పుడు ఆ టాప్ ఆఫీసర్ ఇలా అంటాడు…’’ మాల్ లోపల ఎంత మంది వున్నారో, వారి వివరాలు అన్నీ నాకు కావాలి. మాల్ లో వున్న టెర్రరిస్ట్ లు ఎంత మందో, వారి వివరాలు నాకు తక్షణం కావాలి’ ఇదీ డైలాగు. ఓ మాల్ లోకి వేలాది మంది వెళ్తారు. వెళ్లిన ప్రతివాడు ఆధార్ ఙిరాక్స్ ఇచ్చి వెళ్తాడా ఏంటీ? అలాగే మాల్ లో వున్న టెర్రరిస్ట్ లు వాళ్ల వివరాలు అన్నీ డేటా బేస్ లో లోడ్ చేసి రెడీగా అందుబాటులో వుంచుతారా?

ఇలా సెన్స్ లెస్ గా ప్రారంభమైన మాల్ హైఙాక్ డ్రామా లో కీలకం ఏమిటంటే, ఎవరినైతే విడుదల చేయాలో వాడిని పాకిస్ధాన్ బోర్డర్ లో అప్పగించడానికి ఏర్పాటు చేస్తారు? మరి వాడిని పాకిస్థాన్ బోర్డర్ లో వదిలేస్తే మాల్ లో వున్న టెర్రరిస్ట్ లు ఏం అవుతారు? అన్న ఆలోచన అటు ఇటు కూడా వుండదు. అయితే లక్కీగా హీరో వాళ్లను లేపేస్తాడు అనుకోండి. అది వేరే సంగతి. కమర్షియల్ కథలకు లాఙిక్ అవసరం లేకపోవచ్చు. కానీ కాస్తయినా సెన్స్ వుండాలి. మరీ సెన్స్ లేకుండా సినిమా తీస్తే ఎలా? లక్షలాది బులెట్ ల నుంచి హీరో తప్పించుకుంటూనే వుంటాడు. తను మాత్రం గురి తప్పకుండా కాల్చేస్తూ వుంటాడు. తీవ్రవాదులు మాత్రం చేతిలో గన్నులు వున్నా హీరో మీదకు కత్తి పట్టుకు వస్తారు. హీరో వచ్చి, తన స్టయిల్ లో ఙామర్ తీసి, గన్ తీసి, కత్తి తీసే వరకు, పరమ ఆసక్తిగా చూస్తూ వుంటారు టెర్రరిస్టులు. సినిమా మొత్తం ఇలాంటి సెన్స్ లెస్, లాఙిక్ లెస్ సీన్లు సవాలక్ష వుంటాయి.

ఆ సంగతి అలా వుంచితే సినిమా స్క్రిప్ట్ సవాలక్షసార్ల చూసి అరిగిపోయిన వ్యవహారం. వన్ పర్సంట్ కొత్త దనం వుండదు. కొత్త సీన్ వుండదు. అయినా కూడా తొలిసగం మాత్రం ప్రేక్షకుడిని పెద్దగా ఇబ్బంది పెట్టదు. కమెడియన్స్ మీద లాగించిన కామెడీ, ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయిన సాంగ్, అనిరుధ్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కలిపి ఫస్ట్ ను కాస్త లెంగ్తీ అనిపించినా పాస్ చేయించేస్తాయి.

వన్స్ , సినిమా సెకండాఫ్ లోకి ఎంటర్ అయ్యాక ఇక దర్శకుడు చేతులు ఎత్తేసాడు. కథను తన చిత్తానికి నడిపించాడు. దీనికి తోడు సినిమా ఎలాంటిదైనా, సబ్ఙెక్ట్ ఏదైనా, నా స్టయిల్ నాదే, నా నటన నాదే అన్నట్లు ముందుకు సాగాడు హీరో విఙయ్. దాంతో కథనంలో వేగం అన్నది లేకుండా పోయింది. ప్రేక్షకులకు టెన్షన్ అన్నది ఎలాగూ లేదు. ఎందుకంటే సినిమాలో విలనిఙం అన్నదే బలంగా వుండదు. విలనిఙం బలంగా లేనపుడు, హీరో నిదానంగా వ్యవహారం నడిపిస్తున్నపుడు ఎవరికి మాత్రం ఏ టెన్షన్ వుంటుంది. మాల్ లో ఙనం వుండాలి కనుక, ఒక రెండు వందల మందిని తీసుకోవచ్చి కూర్చొ పెట్టారు. కానీ ఇద్దరు ముగ్గురికి మాత్రమే సీన్లలో సీన్ వుంటుంది. ఆ మాటకు వస్తే హీరోయిన్ పూఙా హెగ్డేకు మాత్రం ఏ సీన్ వుందని.

సినిమాలో కోట్లు ఖర్చుపెట్టి తీసిన యాక్షన్ సీన్ల కన్నా, కాస్త బుర్రపెట్టి రాసుకున్న కామెడీ సీన్లే బెటర్. అవే సినిమాను ఆదుకుంటాయి కూడా. అనిరుధ్ రీరికార్డింగ్ బాగున్నా కూడా యాక్షన్ సీన్లు ఆకట్టుకోవు. ఆ నేపథ్యసంగీతం హుషారుగా సాగింది తప్ప, టెన్షన్ పెట్టేదిగా కాదు. అందువల్ల సినిమాలో ఏ విధంగానూ ఎక్కడా ఎటువంటి ఉత్కంఠ కనిపించదు. అనిపించదు.

ఇలాంటి సినిమాలో విఙయ్ నటన ఆయన ఫ్యాన్స్ కు నచ్చుతుందేమో కానీ కథ కు కథనాలకు తగినట్లు లేదు. పూఙా హెగ్డేకు పెద్ద పాత్రలేదు. విలన్ పాత్రకు హడావుడి లేదు. కమడియన్ల ఫేస్ లు మనకు పరిచయం తక్కువ కానీ వాళ్లే ఆదుకున్నారు సినిమాను కొంత వరకు. మొత్తం మీద కాస్త గట్టి అంచనాల మధ్య విడుదలయిన బీస్ట్ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తగా విఫలమయింది.

ప్లస్ పాయింట్లు

కామెడీ సీన్లు

ప్రారంభంలో పాట

మైనస్ పాయింట్లు

ద్వితీయార్థం

ఫినిషింగ్ టచ్: బీస్ట్…వేస్ట్

Rating: 2.25/5

This post was last modified on April 13, 2022 5:11 pm

Share
Show comments
Published by
Satya
Tags: beastFeature

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

9 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

11 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

12 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

13 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

13 hours ago