గత మూడేళ్లుగా సెట్ మీద, వార్తల్లో వుంటూ వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మీద పేరుకుంటూ వచ్చిన అంచనాలు ఈ రోజు విడుదల టైమ్ లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లను ఊపేసాయి. బాహుబలి సిరీస్ తరువాత రాజమౌళి సినిమా కావడం, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటించడం కీలకమైన ప్రామిసింగ్ పాయింట్లుగా మారాయి. ఇలా వెయ్యి కోట్ల బిజినెస్ జరుపుకున్న ఆర్ఆర్ఆర్ ఎలా వుంది? అంచనాలు అందుకుందా? ఇద్దరు పెద్ద హీరోల ఫ్యాన్స్ ను రంజింప చేసిందా? చూద్దాం.
బాహుబలి లాంటి భయంకరమైన వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన తరువాత ఎలాంటి, ఎంత గొప్ప డైరక్టర్ కు అయినా మైండ్ కాస్త బ్లాంక్ అయిపోతుంది. తరువాత ఏం చేయాలా? అన్నది డిసైడ్ చేసుకోవడం అంత సులువు కాదు,. రాజమౌళి కూడా అలాంటి ఊగిసలాటకు, వత్తిడికి గురయినట్లు కనిపించింది ఆర్ఆర్ఆర్ చూస్తుంటే. సరైన కథను అల్లుకోలేక, కేవలం విజువల్స్ నమ్ముకుని, ముందుకు వెళ్లినట్లు అర్థమైపోతోంది. ఇద్దరు హీరోలను ఫిక్స్ చేసుకుని, వాళ్లకి రెండు క్యారెక్టర్లు రాసుకుని, వాళ్లద్దరి ఇమేజ్ కు సరిపోయే నాలుగయిదు యాక్షన్ ఎపిసోడ్ లు రాసుకుని ముందుకు వెళ్లిపోయారు తప్ప, బాహుబలి మాదిరిగా మరిన్ని బలమైన క్యారెక్టర్లు, బలమైన కథ సమకూర్చుకోలేకపోయారు.
బాహుబలి సినిమాలో శివగామి, ఆమె భర్త, కొడుకు రానా, ఇలా ప్రతి క్యారెక్టర్ బలంగా వుంటాయి. ఆ స్థాయి ఆర్ఆర్ఆర్ లోని అజయ్ దేవగన్, ఆలియాభట్ క్యారెకర్లకు కనిపించలేదు. కేవలం రెండు ప్రధాన పాత్రలను ఎలివేట్ చేయడంతోనే రాజమౌళి శ్రమ అంతా సరిపోయింది. అదే విధంగా బాహుబలి హ్యాంగోవర్ అన్నట్లుగా, చిత్ర విచిత్రమైన ఫాంటసీ పోరాట సన్నివేశాలను డిజైన్ చేసి మళ్లీ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేసారు.
ఆర్ఆర్ఆర్ తొలిసగం చాలా నెమ్మదిగా కథలోకి ప్రవేశిస్తుంది. చరణ్, తారక్ ల ఇంట్రడక్షన్ ల దగ్గర కేరంతలు కొట్టిన ఫ్యాన్స్ మళ్లీ సీట్లలోంచి లేచి గెంతడానికి దాదాపు ముప్పావు గంట పడుతుంది. నాటు..నాటు పాట వాళ్లను ఊగిపోయేలా చేస్తుంది. ఆ హుషారు మళ్లీ ప్రీ క్లయిమాక్స్ దగ్గర కనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర అన్ని పులులు, ఇతర జంతువులను ఢిల్లీ నడిబొడ్డుకు తెచ్చి విడిచిపెట్టిన వైనం ఫాంటసీలా జనాలను అలరిస్తుంది. రాజమౌలి సినిమాలకు లాజిక్ లు అడక్కూడదు అని మరోసారి గుర్తు చేస్తుంది.
సినిమా మలిసగం ప్రారంభమైన తరువాత దాదాపు ఎక్కువ భాగం సీరియస్ నోట్ తో, ఎమోషనల్ గా నడుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏమంత ఆకట్టుకోదు. ఎన్టీఆర్ ను చిత్రహింసలు పెట్టడం, చరణ్ ను జైల్లో పడేయడం , ఇలా లెంగ్తీగా సినిమా నడిచి ప్రీ క్లయిమాక్స్, క్లయిమాక్స్ పోరాట సన్నివేశాల దగ్గర మళ్లీ ఊపందుకుంటుంది. రోలింగ్ టైటిల్స్ లో పాట పెట్టడం అన్నది ప్లస్ అయింది. రెగ్యులర్ ఫార్మాట్ లో హీరోలు, హీరోయిన్లు కలిసి, మాంచి ఊపుతో డ్యాన్స్ చేసి అలరించడంతో, ఫ్యాన్స్ ను, ఆడియన్స్ ను కాస్త రిలీఫ్ గా బయటకు వెళ్లేలా చేసింది.
రాజమౌళి సినిమాలు విజువల్ వండర్ గా వుంటాయి. అందుకు తగినట్లే బ్రిటిష్ కాలం యాంబియన్స్ తీసుకువచ్చారు. సిజి వర్క్ లో భారీ భవనాలు, జనాలు కనిపించేలా చేసారు. కానీ ఎమోషనల్ సీన్లలో డయిలాగ్ పార్ట్ చాలా తక్కువ. బుర్రా సాయి మాధవ్ మార్క్ చమక్కులు కొన్ని చోట్లే కనిపించాయి కానీ మిగిలినదంతా విజవల్ ఎమోషన్ తోనే నడిపించారు. నిజానికి విజువల్ ఎమోషన్లకు ఇంకా బలమైన డైలాగులు పడితే బాగుండేది.
ఆర్ఆర్ఆర్ సినిమాకు కథే వీక్. సినిమా తొలిసగం అంతా బ్రిటిష్ జనాల డైలాగుల ఇంగ్లీష్ లో వుండడం మరో అతి పెద్ద మైనస్. అన్ని చోట్లా లాజిక్ లు గాలికి వదిలేసే రాజమౌళి ఇక్కడ ఎందుకు ఆలోచించలేదో తెలియదు. కానీ ద్వితీయార్థంలో మళ్లీ ఇంగ్లీష్ డైలాగ్ మీద తెలుగు డైలాగ్ ను ఓవర్ లాప్ చేసారు. అది కొంత వరకు మాత్రమే బెటర్ అనిపించింది.
కీరవాణి చేసిన నాటు నాటు, ఎత్తర జెండా పాటలు ఆకట్టుకుంటాయి. రీరికార్డింగ్, సౌండ్ ఎఫెక్ట్ లు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ గురించి చెప్పేదేముంది. సినిమా అంతా దాని మీదే ఆధారపడి సాగింది.
రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ ల పేర్లు, ఓ పద్దతి ప్రకారం సినిమాకు తీసుకువచ్చిన బజ్ కలిసి సినిమాను కమర్షియల్ గా ఏ మేరకు సక్సెస్ చేస్తాయో చూడాలి.
ప్లస్ పాయింట్లు
చరణ్..ఎన్టీఆర్
ఇంటర్వెల్ బ్యాంగ్
క్లయిమాక్స్
నాటు..నాటు సాంగ్
మైనస్ పాయింట్లు
స్క్రిప్ట్
లెంగ్తీ నెరేషన్
ఫినిషింగ్ టచ్: విజవల్ ఎమోషన్..
Rating: 3.25/5
This post was last modified on March 25, 2022 2:39 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…