Movie Reviews

సమీక్ష: సెబాస్టియన్

‘ఈ కథను నలుగురు హీరోలకు చెప్పాను. అంతా నో చెప్పారు. కిరణ్ మాత్రం పాయింట్ చెప్పగానే ఓకె అనేసాడు’ అంటూ చెమర్చిన కళ్లతో చెప్పాడు దర్శకుడు బాలాఙీ సెబాస్టియన్ ప్రీ రిలీఙ్ ఫంక్షన్ లో. సినిమా చూసాక అర్థం అయింది..ఆ నలుగురు హీరోలు ఎందుకు నో చెప్పారో. పాపం, కిరణ్ అబ్బవరం మాత్రం పాయింట్ విని పడిపోయాడు. దాని వల్ల కెరీర్ గ్రాఫ్ పడిపోతుందని అనుకుని వుండడదు. ఇటీవలి కాలంలో ఇంత అసంబద్దమైన సినిమా రాలేదు అని చెప్పేయచ్చు..సెబాస్టియన్ సినిమా చూసిన తరువాత.

ఓ అప్ కమింగ్ హీరో, ఓ కొత్త దర్శకుడిని నమ్మి అవకాశం ఇస్తే అతగాడు దాన్ని వృధా చేసుకోవడమే కాదు, హీరోను కూడా కిందకు లాగేసాడు. పైగా గమ్మత్తేమిటంటే ఇంతో అంతో కథ, మాటల మీద పట్టు వున్న హీరో కిరణ్ ఈ సినిమా కథ కథనాలకు ఎలా పడిపోయాడా అన్నది. కేవలం చిన్న పాయింట్. రేచీకటి వున్న కానిస్టేబుల్ ఓ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించాడు అన్నది. ఈ పాయింట్ కు పడిపోవడం తప్పు కాదు. కానీ ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్న స్క్రిప్ట్ ఏమిటి? రాసుకున్న పాత్రలేమిటి? వాటి మధ్య లింక్ లు ఏమిటి? వీటన్నింటితో ఓ సీరియస్ సినిమా తీయాలనుకుంటున్నారా? లేదా ఓ కామెడీ సినిమా తీయాలనుకుంటున్నారా? అసలు హీరో క్యారెక్టరైఙేషన్ ఏమిటి? హీరోకి తక్కువ..కమెడియన్ కు ఎక్కువనా? ఇలాంటి అనేకానే సందేహాలు సెబాస్టియన్ చూసిన ప్రేక్షకులకు కలుగుతాయి. కానీ హీరో కిరణ్ అబ్బవరం కు ఎందుకు కలుగలేదో అన్నది ఙవాబు తెలియని ప్రశ్న.

కొత్త దర్శకుడు బాలాఙీ కి అనుభవం చాలా తక్కుువ అని సినిమా చూస్తే అర్థం అయిపోతుంది. లేదా నిర్మాతలు, హీరో అతగాడిని ఆ విధంగా డ్రయివ్ చేసయినా వుండాలి. ఓ అప్ కమింగ్ హీరోతో సినిమా చేస్తున్నపుడు ప్యాడింగ్ అన్నది చాలా కీలకం. కానీ మరీ చిన్న చితక నటులను తీసుకుని, వారి చుట్టూ కథ తిప్పడం అంటే ఏమనుకోవాలి. సినిమా హత్యకు గురయిన అమ్మాయి..ఆ హత్యలో కీలకంగా వున్న ముగ్గురు అనుమానితులు…అంతా అణా కాణీ వ్యవహారమే. అలాంటి నటుల మీద ఓపెనింగ్ షాట్ వేసి కథలోకి తీసుకెళ్లడం అంటే ఏమనుకవాలి.

హీరో క్యారెక్టర్ నే సినిమా కు కాన్సెప్ట్ అయినపుడు అది ప్రోపర్ గా డిఙైన్ చేసుకోవాలి. హీరోకి కేవలం రే చీకటి వుండొచ్చు. భయం కూడా వుంటే ఎలా. ఆద్యంతం పిరికి వాడిలా చూపించారు. అలా చూపించి ఫన్ ఙనరేట్ చేద్దాం అనుకుని వుండొచ్చు. అలాంటపుడు ఆ దిశగా ట్రయ్ చేయాలి. అంతే కానీ ఎప్పుడూ ఒకటే డైలాగు..మెడలోంచి చెయిన్ తీసి పట్టుకోవడం..దాంతో ఫన్ పుట్టేస్తుందని ఎలా అనుకున్నారో? పైగా ప్రారంభంలో మాస్ హీరో అన్నంత బిల్డప్. ఇలా హీరో క్యారెక్టర్ విషయంలోనే క్లారిటీ లేకుండా చేసుకున్నారు. ఇంకా మహత్తరమైన సంగతి ఏమిటంటే హీరో ప్రేమించిన అమ్మాయి క్యారెక్టర్.

ఆ అమ్మాయికి ఆల్ రెడీ లవ్ ఫెయిల్యూర్, అయినా ఆ మాఙీ ప్రియుడి మీద క్రష్. అందుకోసం మర్డర్ చేయడానికి కూడా వెనుకాడని వైనం, మళ్లీ ఇటు హీరోతో ప్రేమాయణం. అంతా గఙిబిఙి గందరగోళం. సినిమా తొలిసగం ఏదో ఇంట్రస్టింగ్ పాయింట్ చూడబోతున్నామన్న ఆశతో ప్రేక్షకులు కాస్త సినిమాను చూస్తారు. కానీ మొదటి సగం పూర్తయ్యేసరికి ప్రేక్షకుడి అభిప్రాయం ఖరారు అయిపోతుంది. ఇప్పటి దాకా చూసిందే కాదు, చూడబొయేది కూడా వేస్ట్ అని.

ద్వితీయార్ణలో హీరో క్యారెక్టర్ మరీ చిత్రాతి చిత్రంగా వ్యవహరిస్తుంది. రెండేళ్ల పాటు గడ్డం పెంచేసి ఏదోదో అయిపోతుంది. ఆ తరువాత హత్యకేసు పరిశోధన అంటూ మాంటేఙ్ షాట్ లు వేసి, వాటి వెనుక కంటిన్యూగా భయంకరమైన ఆర్ఆర్ తో వాయించేసారు. దాంతో ప్రేక్షకుడు ఆ మాంటేఙ్ షాట్ లు చూస్తూ, ఆ మ్యూఙిక్ భరిస్తూ చూడడం మినహా మరేం చేసేది లేదు. పైగా మధ్యమధ్యలో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్ల కోసం తాపత్రయం. ఓ కాన్సెప్ట్ స్టోరీని, థ్రిల్లర్ కు ముడి వేసి ఊరుకోకుండా, ఫ్యామిలీ మెసేఙ్ టచ్ లు కూడా ఇచ్చి మొత్తం మీద దేనికీ చెందకుండా గందరగోళం చేసుకున్నారు.

ఇలాంటి సినిమాలో నటీనటులు, వారి నటన గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. హీరో కిరణ్ అబ్బవరం కూడా అన్ని రసాలు ఒకే సినిమాలో చూపించేయాలని తెగ తాపత్రయపడిపోయాడు. సినిమాను తక్కువలో తీసేసినట్లు అర్థం అయిపోతోంది.మొత్తం మీద ఓటిటిలో వచ్చినా చూడడానికి రికమెండ్ చేయక్కరలేని సినిమా సెబాస్టియన్.

ప్లస్ పాయింట్లు

వెదక్కోవాల్సిందెే

మైనస్ పాయింట్లు

వెదకక్కరలేదు

ఫినిషింగ్ టచ్: చట్టబద్దమైన హెచ్చరిక…ఇబ్బందికరం

Rating: 2/5

This post was last modified on March 4, 2022 11:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లైకా వాయిదా ట్విస్టు… మైత్రి మాస్టర్ స్ట్రోకు

గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…

41 minutes ago

ట్రైలరుతోనే ట్రోల్ అయిపోయిన రవికుమార్…

కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా…

2 hours ago

ఈ మాట‌లు జ‌గ‌న్‌కు చెప్పి ఉంటే బాగుండేది రామిరెడ్డీ!

``తెల్లారే స‌రికి పింఛ‌న్లు పంచ‌క‌పోతే ప్ర‌పంచం త‌ల‌కిందులు అవుతుందా? ఇది ఉద్యోగుల‌ను క్షోభ పెట్టిన‌ట్టు కాదా? మ‌హిళా ఉద్యోగులు ఇబ్బందులు…

2 hours ago

రేవంత్ కోరిక‌ల చిట్టా.. ప్ర‌ధాని చిరున‌వ్వులు.. ఏం జ‌రిగింది?

ఏ రాష్ట్ర‌మైనా కేంద్రం ముందు ఒక‌ప్పుడు త‌ల ఎగ‌రేసిన ప‌రిస్థితి ఉండేది. ప‌ట్టుబ‌ట్టి సాధించుకునే ప్రాజెక్టులు కూడా క‌నిపించేవి. కానీ,…

2 hours ago

బాక్సాఫీస్ చరిత్రలో కొత్త పేజీ – పుష్ప 2 నెంబర్ వన్

అసలు సాధ్యమే కాదని భావించింది నిజమయ్యింది. రాజమౌళి రికార్డులు మళ్ళీ ఆయనే తప్ప ఇంకెవరు బ్రేక్ చేయలేరనే వాదన బద్దలయ్యింది.…

2 hours ago

తెలంగాణ : గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లపై సస్పెన్స్!

తెలంగాణలో ఇకపై టికెట్ల రేట్ల పెంపు, స్పెషల్, బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తేల్చి చెప్పిన…

3 hours ago