సమీక్ష: తిప్ప‌రా మీసం

 నటీనటులు : శ్రీ విష్ణు, నిక్కీ తంబోలీ, రోహిణి తదితరులు
దర్శకత్వం : కృష్ణ విజయ్ఎల్
నిర్మాత‌లు : రిజ్వాన్
సంగీతం : సురేష్ బొబ్బిలి

అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయష…అని వెనకటికి ఓ మాట వుంది. అది ఎవరు పట్టించుకున్నా, పట్టించుకోకున్నా మన సినిమా జనాలు మాత్రం బాగా వంట పట్టించుకున్నారు. వెనకటి పురాణాలు, వెనకటి సినిమాలు తిప్పి తిప్పి కథలు అల్లి సినిమా తీయడం బాగా అలవాటు చేసుకున్నారు. ఈవారం సర్రున దూసుకువచ్చిన శ్రీవిష్ణు ‘తిప్పరా మీసం’ కూడా ఇలాంటి వ్యవహారమే.

పాండురంగమహాత్యం సినిమాలో పుండరీకుని కథనే తిప్పి..తిప్పి, తిప్పరా మీసం అంటూ చూపించారు దర్శకుడు విజయ్. చిన్నప్పటి నుంచి చెడు వ్యవసనాలకు బానిసై, మగువ, మదిర అంటూ తిరిగి తల్లితండ్రులను క్షోభ పెట్టి, చివరకు, సత్యం గ్రహించి, ‘అమ్మా అని పిలచినా ఆలకించవా’ అంటూ ఏడిచిన వైనం ఆ సినిమా.

చిన్నప్పుడే అనుకోకుండా మత్తు మందులకు అలవాటు పడి, తల్లిని అపార్థం చేసుకుని, ఆమెను ద్వేషిస్తూ బతికి, చివరకు సత్యం గ్రహించి, ఆమెకు చేయాల్సిన సాయం చేసిన వాడే తిప్పరా మీసంలో మణిశంకర్.

మణి (శ్రీ విష్ణు) చిన్నపుడే మత్తు మందులకు అలవాటు పడడంతో, తల్లి (రోహిణి) బలవంతగా రిహాబిలిటేషన్ సెంటర్ లో చేరుస్తుంది. అదే కారణంగా, అకారణంగా తల్లి మీద ద్వేషం పెంచుకుంటాడు. పబ్ లో డిజె గా పని చేస్తూ, డబ్బు కోసం పందాలు ఆడుతూ, ఒక్కో మెట్టు దిగజారుతూ, ఆఖరికి తల్లి సంతకం ఫోర్జరీ చేసి, ఆమె పైనే కోర్టులో కేసు వేసే స్థితికి చేరుకుంటాడు. ఇలాంటి కొడుకు ఎప్పుడు ఎలా పశ్చాత్తాపం చెందాడు? చివరకు ఏమయింది? అన్నది సినిమా.

ఒక్కోసారి కొన్ని సినిమాలు వచ్చి, మేకర్లను బాగుచేస్తాయి, పాడు చేస్తాయి కూడా. అర్జున్ రెడ్డి సినిమా అలాంటిదే. ఇది తెలుగు సినిమాను కొంత వరకు కొత్త పుంతలు తొక్కిస్తే, వాతలు పెట్టుకుని, కిందపడిన సినిమాలు కూడా వున్నాయి. తిప్పరా మీసం సినిమా మీద అర్జున్ రెడ్డి ప్రభావం పూర్తిగా వుంది. మత్తు మందులు, జిప్ లు విప్పడాలు, అమ్మాయిల మీదకు ఎగబడడం, చొక్కా విప్పుకు తిరగడం ఇలా ఒకటేమిటి అర్జున్ రెడ్డిని చూసి సమస్త అవలక్షణాలు తిప్పరామీసంలోకి వచ్చేసాయి.

వాస్తవానికి ఈ అనుకరణల సంగతి పక్కన పెడితే, పాత కథను కొత్తగా చెప్పడానికి చేసిన ప్రయత్నం, కథలో కొత్త పాయింట్ ను చొప్పించడానికి ప్రయత్నించి వుంటే బాగుండేది. తల్లిని ద్వేషించే కొడుకు ఎలాగైనా తప్పు తెలుసుకంటాడని ప్రేక్షకుడికి ముందు నుంచి తెలుస్తూనే వుంటుంది. ఆ తప్పు ఎలా తెలుసుకుంటాడు అన్న దగ్గర మరింత కొత్తగా ఆలోచించాల్సింది. అదే సినిమాకు కీలకమైన ఆ పాయింట్. దాని దగ్గరే పరమ రొటీన్ గా వుంది. ప్రీ క్లయిమాక్స్, క్లయిమాక్స్ మరింత కొత్తగా ఆలోచించి వుంటే కనీసం సెకండాఫ్ బాగుండి వుండేది.

మరోపక్క తొలి సగం మొత్తం వృధా చేసుకున్నారు. డార్క్ మూవీ షేడ్ లో తీయాలనుకోవడం వరకు ఓకె. కానీ కాస్తయినా ఫన్ చొప్పించి వుండాల్సింది. అలా జరగలేదు. ఫస్ట్ హాఫ్ లోని ఒకటి రెండు ఫన్ మూవ్ మెంట్ లకు ప్రేక్షకులు హమ్మయ్య అనుకున్నారన్న సంగతి దర్శకుడికి తెలిస్తే, సినిమాలో ఆ మేరకు మార్పులు చేసుకుని వుండేవారు.  అదే విధంగా హీరోయిన్ ట్రక్ ను చాలా బెటర్ మెంట్ చేయడంలో కూడా దర్శకుడు విఫలమయ్యారు.

తొలిసగం ఎప్పుడయితే ఒకే మోడ్ లో, రిపీటెడ్ ఎక్స్ ప్రెషన్స్ తో వెళ్లిందో, ప్రేక్షకుడికి మలిసగం మీద ఉత్సాహం చచ్చిపోతుంది. మలిసగం చాలా వరకు తొలిసగం కన్నా బెటర్ అని అనిపించుకున్నా, ఈ కారణంగానే దానికి కూడా తక్కువ మార్కలు పడిపోతాయి.

శ్రీవిష్ణు తొలిసగంలోని చాలా సీన్లలో బాగున్నాడు. శ్రీవిష్ణులో మంచి నటుడు వున్నాడు కాబట్టి, అతని పాత్రను చాలా వరకు కేక్ వాక్ గా చేసుకుంటూ వెళ్లిపోయాడు. అతని నటన వరకు మార్కులకు సమస్యలేదు. తల్లిగా రోహిణి పాత్రను ప్రెజెంట్ చేయడం లో కూడా దర్శకుడు అంతగా సక్సెస్ కాలేదు. మిగిలిన పాత్రలు అంతగా రిజిస్టర్ అయ్యేంత వ్యవహారం లేదు.

సినిమా నేపథ్య సంగీతం మీద కూడా అక్కడక్కడ అర్జున్ రెడ్డి ప్రభావం కనిపించింది. సినిమాటోగ్రఫీ అధ్భుతాలేమీ చూపించలేదు. ఇక మిగిలిన విషయాల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

చివరిగా….మీసకట్టు..తీసికట్టు

రేటింగ్ : 2/5

This post was last modified on April 19, 2020 11:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్యాన్స్ కోరుకున్న ‘ధోప్’ స్టెప్పులు ఇవే చరణ్!

ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…

2 minutes ago

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

4 hours ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

12 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

15 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

16 hours ago