Movie Reviews

సమీక్ష – పుష్పక విమానం

అన్ని సినిమాలో స్ట్రిక్ట్ టు ది సబ్జెక్ట్ అంటూ వుండవు. కొన్ని సినిమాలు ఎక్కడో ప్రారంభమై, ఎక్కడెక్కడో తిరిగి, మరెక్కడో ముగుస్తాయి. ప్రేక్షకులకు సినిమా బఫే అన్నమాట. మామూలుగా అయితే భారీ సినిమాల విషయంలో ఇలాంటి బఫే వ్యవహారాలు వుంటాయి. ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించడం అన్నది పెద్ద టాస్క్ గా మారింది కాబట్టి చిన్న సినిమాల విషయంలో కూడా ఇదే దోవన వెళ్తున్నారు. ఈవారం విడుదలయిన పుష్పకవిమానం కొంచెం ఇదే టైపు. నిజానికి ఈ టైటిల్ కు సినిమాకు మరీ ఎక్కువ సంబంధం వుండదు. అది వేరే సంగతి.

ఇంతకీ పుష్పక విమానం కథేంటీ అంటే..స్కూలు టీచర్ అయిన సుందర్ (ఆనంద్ దేవరకొండ) కాస్త అమాయకుడు టైపు. సగటు కుర్రాళ్ల మాదిరిగా భార్య, పెళ్లి వీటి మీద కొన్ని ఆశలు వున్నవాడు. అలాంటి వాడు మీనాక్షి (గీత్ సైనీ)ని పెళ్లి చేసుకుంటాడు. కానీ ట్విస్ట్ ఏమిటంటే పెళ్ల‌యిన ప‌ది రోజుల‌కే మీనాక్షి వేరేవాడితో లేచిపోతుంది. ఇక అప్పుడు స్టార్ట్ అవుతాయి సుందర్ కష్టాలు. పెళ్లాం ఇంట్లోనే వుందని నమ్మించడానికి అద్దె భార్య వరకు వెళ్తుంది వ్యవహారం. కానీ భార్య కోసం వెదుకుతూనే వుంటాడు. మీనాక్షి కనిపించదు. ఆమె శవం కనిపిస్తుంది. ఆ కేసు కాస్తా సుందర్ కు చుట్టుకుంటుంది. ఇప్పుడు రెండు ప్రశ్నలు. మీనాక్షిని ఎవరు చంపారు. ఈ కేసు నుంచి సుందర్ ఎలా బయటపడ్డాడు. అదే సినిమా.

నిజానికి ఎంచుకున్నపాయింట్ బాగానే వుంది. భార్య లేచిపోవడం అన్నది కొత్త పాయింట్. చేయని నేరం మీద పడడం అన్నది పాత పాయింట్. ఈ రెండు పాయింట్లను మిక్స్ చేస్తూ, ఫన్ ప్లస్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలన్నది దర్శకుడు దామోదర ఐడియా కావచ్చు. కానీ ఇది సగమే వర్కవుట్ అయింది. తొలిసగం కొత్త పాయింట్, కొత్తగా వుండడం వల్ల పాస్ అయిపోయింది. కానీ మలిసగం దగ్గరకు వచ్చేసరికి రొటీన్ లోకి జారిపోయింది. నిజానికి తొలిసగంలో లేని పెళ్లాం వుందని నమ్మించే వ్యవహారం కూడా పాతదే. పాత ఫన్ నే. కానీ అది జనాలకు ఎవర్ గ్రీన్ ఫన్ కాబట్టి ఓకె అనిపించేసుకుంది.

అయితే మర్టర్ మిస్టరీ అనే జానర్ తో ద్వితీయార్థంలోకి ప్రవేశించాక దర్శకుడి చమక్కులు మరి సాగలేదు. ఇక్కడ అంత స్టామినా దర్శకుడు ప్రదర్శించలేకపోయాడు. అక్కడక్కడ ఒకటి రెండు సీన్లు తప్ప ప్రేక్షకులు ఓకె అనేవి లేవు. పైగా టేకింగ్ కొంత విభిన్నంగా స్లో పేస్ లో నడవడం వల్ల ఓటిటి ఫార్మాట్ అనే కామెంట్లు వినిపిస్తాయి. కమెడియన్ కమ్ హీరో సునీల్ ను తీసుకున్న తరువాత పరిశోధన మీద కాస్త అతని యాంగిల్ లో కథ ను మలిచివుంటే బాగుండేదేమో? పరిశోధనలో హీరోను కూడా ఇన్ వాల్వ్ చేసి, కాస్త కొంచెమయినా హీరోయిజం దిశగా కథను మలచడంతో తేడా కొట్టింది. పైగా హీరోయిన్ ను ముందే చంపేయడం అన్నది మన ప్రేక్షకులు అంతగా జీర్ణించుకోలేని సంగతి. పైగా తొలిసగంలో పాటలు అలరిస్తాయి. సెకండాఫ్ లో దానికి చాన్స్ లేదు. అది కూడా మైనస్ గా కనిపిస్తుంది.

లేచిపోయిన హీరోయిన్ ఆచూకీ కోసం చివరంటా వెదకడం అనే యాంగిల్ ఇచ్చిన కిక్, ఆమె చనిపోవడం, ఆ కేసు హీరోకి చుట్టుకోవడం అన్నది ఇవ్వదు. ఎందుకంటే ఈ యాంగిల్ స్టోరీలు మనవాళ్లు చూసేసారు చాలా. అప్పటికీ మరో హీరోయిన్ (శాన్వీ) ను సెట్ చేసారు. మొదటి హీరోయిన్ కన్నా నిడివి ఈ హీరోయిన్ కే ఎక్కువ కూడా.

ఆనంద్ దేవరకొండ వరకు ఓకె అనిపించేసుకున్నాడు. అతని ఫేస్ కు ఆ ఇన్నోసెంట్ ఎక్స్ ప్రెషన్స్ కు తగిన పాత్ర కాబట్టి వర్కవుట్ కావడం కూడా సులువు అయింది. ఇద్దరి హీరోయిన్లలో శాన్వీనే బెటర్. సునీల్ ఈ సినిమాకు ప్లస్ కావాల్సిందే కానీ ఎందుకో సెట్ కాలేదు. మిగిలిన వారంతా రెగ్యులర్ నే.

నిర్మాణ పరంగా కాస్త బడ్జెట్ లో వెళ్లారు. అందువల్ల ఆరంభం నుంచి చివరి వరకు ఓ చిన్న సినిమా చూస్తున్న ఫీలింగ్ వెంటాడుతూనే వుంటుంది. ట్రయిలర్ ఆశాజనకంగా వున్నా, సినిమాలో ఆ ఇంట్రస్ట్ ను కంటిన్యూ చేయలేకపోయారు. ఓటిటిలో వస్తే చూడొచ్చులే అనుకునే సినిమాల జాబితాలో అయితే దీన్ని చేర్చుకోవచ్చు.

ప్లస్ పాయింట్లు

మెయిన్ కోర్ పాయింట్
ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్లు

సెకండాఫ్
ఓల్డ్ స్టయిల్ ప్లాట్

ఫినిషింగ్ టచ్ – బోయింగ్ కాదు బోరింగ్

Rating: 2.5/5

This post was last modified on November 12, 2021 9:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

2 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

8 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

9 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

11 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

13 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

14 hours ago