Movie Reviews

సమీక్ష – కొండపొలం

మన సినిమాకు మలయాళ సినిమాకు ఆది నుంచీ ఓ తేడా వుంటూనే వస్తోంది. నమ్మిన సబ్జెక్ట్ ను తెరకెక్కించడంలో ముందు వెనుకలు ఆలోచించకపోవడం అన్నది మలయాళ మేకర్ల అలవాటు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి రెండు సమస్యలు. ఒకటి మలయాళ సినిమాల మాదిరిగా చిన్నగా తీస్తే జనానికి ఆసక్తి కలగదు. అలా అని అలాంటి కథలను ఓ రేంజ్ కు అయినా తీసుకెళ్లి, సినిమాగా మారిస్తే వర్కవుట్ కాదు. వివిధ ప్లాట్ ఫారమ్ ల్లో మలయాళ సినిమాలు చూసి, ‘భలే తీసాడ్రా..వీళ్లు భలే పాయింట్లు పట్టుకుంటారు’ అని అంటాం మనమే. అలా అని మనవాళ్లు తీస్తే ‘ఆ ఏముంది..అదే సోది..బోర్ అనిపించింది’ అనేస్తాం.

ఇంతకీ ఈ సోది అంతా ఎందుకు చెప్పుకోవడం అంటే ఈ వారం కొండపొలం అనే సినిమా విడుదలయింది. ఇదే సినిమా మలయాళంలో వస్తే కచ్చితంగా ఇంతో అంతో ప్రశంసలు కురిసేవి. ఓ ప్రాంతానికి మాత్రం పరిమితం అయిన సమస్యను తీసుకుని, సిన్సియర్ సినిమాగా మార్చే ప్రయత్నం చేసాడు దర్శకుడు క్రిష్. కానీ దాన్ని రెండు గంటలకు పైగా కథ అయితే వుంది కానీ, ఆసక్తికరమైన కథ అయితే లేదు. సినిమా కథకు కావాల్సిన సరుకులు అన్నీ తెచ్చి వేసారు కానీ, ఓ కమర్షియల్ సినిమా కథను తయారు చేయలేకపోయారు. సినిమాకు రాసుకున్న కామెడీ ట్రాక్ తో బోర్ కొట్టించారు. ఎడిటింగ్ లో మరింత నిర్మొహమాటంగా వ్యవహరించి వుండాల్సింది.

రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు ఎక్కువ. అలాంటపుడు గొర్రెలు కాచుకునేవారు వాటిని తీసుకుని కొండల్లోకి వెళ్తారు. ఎందుకంటే వర్షాలు కొండల్లో కురుస్తాయి. మేత, నీటి బాధ వుండదని. కానీ ఇలా వెళ్లడం అంటే కాస్త ప్రమాదకరమైన వ్యవహారమే. ప్రకృతి ప్రతికూల పరిస్థితులను తట్టుకోవాలి. పులి లాంటి జంతువుల బారి నుంచి కాపాడుకోవాలి. ఇవన్నీ తెరపైకి ఓ అందమైన కథగా తీసుకురావడం అంటే అంత సులువు కాదు.

కొండపొలం అనే నవల ఆధారంగా దర్శకుడు క్రిష్ ఈ సినిమా తీసారు. రాయలసీమలోని కరువు బాధలు అదే సమయంలో యువతకు ఓ చిన్న సందేశం మిక్స్ చేయాలనుకున్నారు. బాగా చదువుకుని కూడా ఇంటర్వూలను సరిగ్గా చేయలేకపోతున్న కుర్రాడికి అడవి నేర్పిన ధైర్యం ఏమిటి అన్నది చెప్పాలనుకున్నారు. పులి కళ్లలోకి సూటిగా చూడగలిగిన వాడు, ఎవరి కళ్లలోకైనా చూసి సమాధానం చెప్పగలడు అని చూపించాలనుకున్నారు.

కొండపొలం సినిమాలో ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకోవాలనుకుంటే, క్రిష్ లాంటి ఓ రేంజ్ వున్న దర్శకుడు ఇలాంటి నాన్ గ్లామరస్ సబ్జెక్ట్ ను తీసుకోవడం గొప్ప విషయం. ఎంత సేపూ గొర్రెలు, కంబళి కప్పుకున్న గొర్రెల కాపరులు. వారి మధ్య ఓ అందమైన అమ్మాయి. తరచు కనిపించే ఆమె నాభి అందాలు మాత్రమే గ్లామరస్ పాయింట్లు. అయితే ఓ కమర్షియల్ సినిమాకు ఏం కావాలి. హీరోయిజం, ఒకటి రెండు ఫైట్లు, ఒకటి రెండు పాటలు ఇలాంటివి అన్నీ బాగానే సేట్ చేసుకున్నారు.

కొత్త వాతావరణం, ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని కొత్త వాతావరణం కావడంతో తొలిసగం బాగానే ఆకట్టుకుంటుంది. తొలిసగంలో పెద్దగా వంక పెట్టాల్సిన విషయాలు ఏమీ లేవు. డాక్టర్ రవి మీద ఓ సన్నివేశం వుంటుంది. కష్టాల్లో భర్తతో కాపురం చేయలేక భార్యలు పుట్టింటికి వెళ్లిపోతున్నారు అన్న పాయింట్ ను బలంగా చెప్పడం కోసం చేసిన ప్రయత్నం అది. కానీ అప్పటి వరకు కాస్త నార్మల్ గా వున్న గ్రాఫ్ అక్కడకు వచ్చేసరికి కిందకు దిగిపోతుంది. అలా చెప్పడం తప్పా? ఒప్పా అన్నది కాదు పాయింట్. సినిమాకు అతకదు..పైగా ఆ రేంజ్ క్యారెక్టర్ల మీద అస్సలు అతకదు. ఇది తప్పిస్తే సినిమా తొలిసగం ఓకె అనిపించేసుకుంటుంది.

మలిసగంలోకి వచ్చేసరికి దర్శకుడు కాస్త తడబడ్డాడనే అనుకోవాలి. అడవిలోకి వెళ్లే గొర్రెల కాపరులకు ఎన్నో సమస్యలు వుంటాయి. వుండొచ్చు. కానీ అన్నీ ఒకే సినిమాలో డీల్ చేసేయాలి అని అనుకోకూడదు. అడవిలో అన్నలు, స్మగర్లు, దొంగలు, రౌడీ రుబాబు మూకలు ఇలా కమర్షియల్ పాయింట్లు ఓకె. నాన్ కమర్షియల్ పాయింట్లు వదిలేయాలి. మరీ డిటయిల్డ్ చిత్రీకరణ పనికిరాదు. గొర్రెల కాచుకునే వాడు కూడా తన పిల్లను ఉద్యోగస్తుడికే ఇవ్వాలనుకుంటాడు. అది హీరో హీరోయిన్ల ప్రేమకు అడ్డంకి. అక్కడితో ఊరుకోవాలి. దానికో మాంటేజ్ సాంగ్. హావ భావాలు. ప్రేక్షకులు తల పట్టుకోవాల్సిందే.

క్రిష్ కు ఫన్ పండించడం రాదు అనుకోవడానికి వీలు లేదు. కానీ ఈ సినిమాకు నవల రచయితే మాటల రచయిత కూడా. ఆయన అందించిన కామెడీ ట్రాక్ చాలా నీరసంగా వుంది. నోట్లో వేళ్లు పెట్టుకున్నా వాంతి రాన్నట్లు, అస్సలు నవ్వుకుని తీరాలన్నా నవ్వు రాలేదు. సినిమాకు అదో పెద్ద మైనస్. కీరవాణి ఇచ్చిన అడియో అంత క్యాచీగా లేదు. ఇలాంటి సినిమాల్లో హుషారైన పాటలు వుండాలి. సినిమా పాటలు వచ్చినపుడల్లా పైకి లేస్తుంది. అలా కాకుండా భావగర్భితంగా, మెలోడియస్ గా వుండాలి అనుకుంటే, కనీసం క్యాచీగా అన్నా వుండాలి. సెకండాఫ్ కు ఈ అడియో పెద్ద మైనస్. ద్వితీయార్థం లోంచి కొన్ని సీన్లు, కొంత నిడివి లేపేయవచ్చు.

దర్శకుడు క్రిష్ కథను దాటి బయటకు వెళ్లాలని అనుకున్నట్లు లేదు. ఒక్క డ్రీమ్ సాంగ్ తప్పిస్తే. అడవులు భయంకరంగానే వుండవు. అందంగా కూడా వుంటాయి. ఆ పాయింట్ ను కూడా సినిమాకు వాడుకుని వుంటే, కాస్త చూడగలిగే సీన్లు కొన్ని దొరికేవి. వాటికి బదులుగా ఈ సమస్యల సీన్లు కొన్ని లేపేయచ్చు.

సినిమాకు యూనివర్సల్ ప్లస్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్. కీరవాణి ఆ విషయంలో బాగా వర్క్ చేసారు. యూనివర్సల్ మైనస్ ఏమిటంటే టేకింగ్. మరీ ఫ్లాట్ నెరేషన్ తో వెళ్లారు క్రిష్. హీరో హీరోయిన్లు గొర్రెల కాపరులు అయినంత మాత్రాన స్వీట్ నంథింగ్స్, రొమాంటిక్ మూవ్ మెంట్స్, గ్లామరస్ సీన్లు వుండవని ఏమీ లేదు. అందులోనూ అందమైన హీరో హీరోయిన్లు వున్నాక ఇక అభ్యంతరం ఏమిటి? సమస్యలు మాత్రమే ప్రస్తావించే ఆఫ్ బీట్ సీన్లు, గొర్రెలతో అనుబంధం, అడవి జ్వరాలు, జొన్న రొట్టేలు, అవి మాడిపోవడాలు, ఇలా మరీ డిటైల్ట్ టేకింగ్ బదులు అవి బెటర్ అయ్యేవి కదా?

తొలిసగం కొత్తగా వుందని ఓపికతో చూసే ప్రేక్షకుడు మలిసగానికి వచ్చేసరికి బోర్ ఫీలవుతాడు. అది సహజం. దాంతో సినిమాపై అభిప్రాయాన్ని ద్వితీయార్థం కిందకు లాగేస్తుంది. ఇలాంటి సినిమాలను ఓటిటికి ఇవ్వడం బెటర్. ఎందుకంటే హీరో, హీరోయిన్లు తప్పిస్తే మిగిలిన అర కొర నటులతో జనాలను థియేటర్ కు రప్పించడం అంత సులువు కాదు. అది కూడా ఇలాంటి ‘డ్రయ్ సబ్జెక్ట్’ తో.

క్రిష్ అభిరుచిని మెచ్చుకోవాలి. అతనికి సహకరించిన నిర్మాతల అభిరుచిని మెచ్చుకోవాలి. ఇబ్బంది వున్నా, ఇలాంటి సినిమాను కూడా జనం చూస్తే మన వాళ్లకు మరీ పొరిగింటి పుల్లకూరే కాదు, మన ఇంటి సద్దికూడు కూడా నచ్చుతుందనుకోవాలి.

మలి సినిమాలో హీరోగా వైష్ణవ్ బాగానే చేసాడు. కానీ ఇంటర్వూలు బాగా చేయలేని కుర్రాడు హుషారుగా వుంటే తప్పేం లేదు. కాస్త హుషారు డోసు పెంచి వుంటే సినిమాకు ఉపయోగపడేది. పైగా అలాంటి హుషారు డోస్ తో రకుల్ ప్రీత్ సింగ్ ఆకట్టుకుంటుంది. సాయి చంద్ తో సహా మిగిలిన వారంతా బాగానే చేసారు. సినిమాటోగ్రఫీ అడవిని బాగానే చూపించింది. అచ్చమైన రాయలసీమ మాండలీకం వాడారు. కొంత వరకు ఓకె.

దర్శకుడిగా క్రిష్ ఓ అభిరుచితో చేసిన ఈ ప్రయత్నంలో తప్పులు వెదక్కుండా చూసి ఆదరించే గుణం అలవాటు చేసుకుంటే మరిన్ని భిన్నమైన ప్రయత్నాలు జరిగే అవకాశం వుంటుంది. లేదూ అంటే కమర్షియల్ ఫెయిల్యూర్ లే మిగులుతాయి.

ప్లస్ పాయింట్లు
అడవి నేపథ్యం
సిజి వర్క్ లు

మైనస్ పాయింట్లు
ఫ్లాట్ నెరేషన్
అనవసరపు సీన్లు

ఫినిషింగ్ టచ్: సినిమా ‘కరువు

Rating: 2.5/5

This post was last modified on October 8, 2021 2:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దావోస్ లో ‘అరకు’ ఘుమఘుమలు!

స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…

2 hours ago

అమరావతికి హడ్కో నిధులు వచ్చేశాయి!

ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…

4 hours ago

దావోస్ లో కాలి నడకన నారా లోకేశ్

అసలే అది ఇన్వెస్టర్ల సమావేశం. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు…

10 hours ago

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

10 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

11 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

12 hours ago