Movie Reviews

సమీక్ష – ఇచట వాహనములు నిలుపరాదు

కొన్ని సినిమాలు చూస్తే ఇలా కూడా తీయచ్చు అన్నమాట అని అనిపిస్తుంది. కొన్ని సినిమాలు తీస్తే ఇలా ఎలా తీస్తారు? అన్న ప్రశ్న, ఇలా తీయకూడదు అనే పాఠం మనకు మిగులుతాయి. అలాంటి సినిమానే ఈ వారం విడుదలైన ఇచట వాహనములు నిలుపరాదు. టైటిల్ లో వున్న వైవిధ్యం సినిమాలో మచ్చుకు కూడా కనిపించదు. తీయ్..తీయ్..బండితీయ్ అన్నట్లుగా తీయ్ తీయ్ సినిమా తీయ్ అని తొందరపడి ఏదో ఒకటి తీసేస్తే ఇలాగే వుంటుంది వ్యవహారం.

కథ పరమ పాత చింతకాయ పచ్చడి. అది కనీసం పథ్యానికైనా పనికి వస్తుంది. కానీ ఈ కథ సినిమాకు అస్సలు ఇప్పుడు పనికిరాదు. ఓ కుర్రాడు. ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిది ఓ కాలనీ. అన్న కార్పొరేటర్. కాలనీ మొత్తం ఓ చిత్రమైన పెత్తనంతో నడుస్తూ వుంటుంది. ఇలాంటి నేపథ్యంలో కుర్రాడు ఆ అమ్మాయి కోసం వచ్చి కాలనీలో ఇరుక్కుంటాడు. పైగా గా ఓ మర్డర్ ఎటెంప్ట్ కేసు కూడా. అప్పుడు ఏం జరిగింది అని అనుకోనక్కర్లా. హీరో కదా? ఏదో విధంగా బయటపడతాడు అనే థీమా వుండనే వుంటుంది.

సినిమాలో హీరో బైక్ కొనడానికి వచ్చిన తరువాత కథ చెబుతుంటే, ప్రేక్షకుడికి వళ్లు సలసలా మరిగిపోతూ వుంటుంది. ఆ టైమ్ లో కనుక షోరూమ్ లో ప్రత్యక్షంగా వుంటే ‘ఏంటి సోది చెబుతున్నావా’ అని అడిగేయాలని వుంటుంది. సినిమాలో ప్రతి సీన్ ఒక్కో ఆణిముత్యం. దర్శకుడి అనుభవ రాహిత్యానికి పరాకాష్ట. బైక్ డ్రయివింగ్ రాదని తెలిసి కూడా బైక్ తీసుకుని హీరోయిన్ కు లిఫ్ట్ ఇవ్వడానికి వెళ్లి వళ్లు హూనం చేసుకుంటాడు హీరో. ఈ దర్శకుడు కూడా అంతే అనిపిస్తుంది. సినిమా తీయడం రాదు అని తెలిసి కూడా డైరక్షన్ చేసి నిర్మాతలను గుల్ల చేసాడేమో?

సినిమా మొత్తం చూడక్కరలేదు. హీరో బైక్ కొనడం వరకు చూస్తే చాలు అసలు దర్శకుడు దర్శన్ ఏ విధంగా, ఏం చెప్పి నిర్మాతలను, హీరోను ఒప్పించాడు అని అనుమానం కలగడానికి. మరి కాస్త చూడగలిగితే చాలు మనకు మంచి ఓపిక వుందని రుజువు కావడానికి. సాతం సినిమా చూస్తే ఉత్తమ ప్రేక్షకుడి అవార్డు కూడా ఇవ్వొచ్చు. సినిమా తొలిసగం అంతా సోది వ్యవహారమే. అసలు స్ట్రయిట్ గా కథను నెరేట్ చేసినా కొంత వరకు బాగుండేదేమో? అలా కాకుండా వెనుక నుంచి ముందుకు, ముందు నుంచి వెనక్కు లాంటి చిత్రమైన ప్రయోగాలు చేసి మరింత పాడు చేసుకున్నారు.

హీరో సుశాంత్ కథల ఎంపికలో అస్సలు ఏమాత్రం ఇంప్రూవ్ కాలేదని మరోసారి ఈ సినిమా రుజువు చేస్తుంది. కేవలం ఓ రోజులో జరిగే కథ, ఓ కాలనీలో ఓ ఇంట్లో ఇరుక్కుపోయే హీరో అనే పాయింట్లకు హీరో, నిర్మాతలు పడిపోయి, దర్శకుడికి చాన్స్ ఇచ్చి వుంటారు. ఆ పడిపోవడం అన్నది నిజంగానే పడిపోయినట్లయింది.

సినిమా ఎత్తుగడ దగ్గర నుంచి కాలనీలో కథ స్టక్ అయ్యే వరకు ఏదో నడుస్తోంది అనిపించిన సినిమా తీరా కాలనీలోకి చేరిన తరువాత పరమ గజిబిజిగా వుంటుంది. దానికి తోడు ఒక్కో కమెడియన్ ను తీసుకువచ్చి, లోపల హీరోను టెన్షన్ పెడుతూ, బయట కామెడీ చేయించే ప్రయత్నం చేస్తూ, దర్శకుడు సాగించిన ఫీట్లు..అబ్బో..వర్ణనాతీతం. ఈ సినిమా చూసిన వారికి ఎక్కడైనా నటుడు కమెడియన్ సునీల్ పొరపాటున కనిపిస్తే, మళ్లీ ఎప్పుడూ ఇలాంటి టుమ్రీ పాత్రలు చేసి అభిమానం పోగొట్టుకోవద్దని చెప్పాలనిపిస్తుంది.

మ్యాటర్ లేని సినిమాలో మ్యాటర్ మ్యాటర్ అంటూ కమెడియన్ చేసిన దాన్ని కామెడీ అని దర్శకుడు అనుకుని వుంటే అనుకుని వుండొచ్చు. కానీ అసలు సినిమాలోనే మ్యాటర్ లేదని చూసిన ప్రేక్షకులు అనుకోవడానికి మాత్రమే పనికి వచ్చింది. హీరో సుశాంత్ హ్యాండ్ సమ్ గా కనిపించడానికి తెగ ప్రయత్నించాడు. ఓ సీన్ లో పదే పదే కళ్లజోడు తీసి, పెట్టే వ్యవహారం చూస్తే చాలు అది అర్థం కావడానికి. చక్కగా చిలసౌ, అలవైకుంఠపురములో వంటి సినిమాలను ఎంచుకోకుండా ఎందుకో ఈ మాస్ ఎలివేషన్ల తాపత్రయం.

హీరోయిన్ ను చూస్తే కాస్టింగ్ మీద దర్శకుడికి వున్న అవగాహన అర్థం అయిపోతుంది. సినిమాలో ఇంకో అద్భుతమైన విషయం ఏమిటంటే నేపథ్య సంగీతం. తెరమీద ఏం జరుగుతోంది అన్నది అనవసరం, తన వాయింపు తనదే అన్నట్లు సాగింది. తీయ్.,.తీయ్ బండి తీయ్ అని కాదు, తీయ్ తీయ్ తలుపు తీయ్ అని ప్రేక్షకులు కొండకచో అనుకున్నా, అది వారి తప్పు కాదు. ముమ్మాటికీ దర్శకుడి అనుభవరాహిత్యంతో కూడిన మేకింగ్ ది మాత్రమే. అదే దర్శకుడికి విషయం వుంటే తీయ్..తీయ్ టికెట్ తీయ్ అనేవారేమో?

ప్లస్ పాయింట్లు
టైటిల్

మైనస్ పాయింట్లు
కథ, కథనాలు
ఇంకా..ఇంకా

ఫినిషింగ్ టచ్ : వాహనాలు షెడ్ కే

Rating: 2/5

This post was last modified on August 27, 2021 5:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంతృప్తి గ్రాఫ్‌లో ఈ మంత్రుల‌దే పైచేయ‌ట‌..!

రాష్ట్రంలో ప్ర‌భుత్వాలు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ప‌నిచేసుకుని పోవ‌డం తెలిసిందే. అయితే.. చంద్ర‌బాబు హ‌యాంలో మాత్రం ఏదో గుడ్డిగా ప‌నిచేసుకుని పోతున్నామంటే…

1 hour ago

‘రేపటి తీర్పు’గా మారనున్న ‘భగవంత్ కేసరి’?

నందమూరి బాలకృష్ణ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ని తమిళ టాప్ స్టార్ విజయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్…

3 hours ago

ఇదే జ‌రిగితే బాబు హ‌యాం… పెట్టుబ‌డుల సంక్రాంతే..!

ప్ర‌స్తుతం స్విట్జ‌ర్లాండ్ లోని దావోస్‌లో జ‌రుగుతున్న ప్ర‌పంచ పెట్టుబడుల స‌ద‌స్సులో సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, మంత్రి నారా లోకేష్…

3 hours ago

పుష్ప-2… బీజీఎం గొడవ ఇంకా సమసిపోలేదా?

పుష్ప-2 విడుదలకు ముందు ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయమై ఎంత గొడవ నడిచిందో తెలిసిందే. సుకుమార్ కెరీర్ ఆరంభం…

3 hours ago

టిల్లు హీరో… ఫ్యామిలీ స్టార్ దర్శకుడు…దిల్ రాజు నిర్మాత

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తో వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ సాధించిన సిద్దు జొన్నలగడ్డ కొంచెం గ్యాప్ తీసుకున్నట్టు…

4 hours ago

చిరు – అనిల్ : టీజర్ రాబోతోందా?

‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత తన స్థాయికి సినిమాలు చేయలేదనే అసంతృప్తి…

5 hours ago