‘దేవర’ సందడి ముగిసింది. ఇక తెలుగు ప్రేక్షకుల దృష్టంతా ‘పుష్ప-2’ మీదే ఉంది. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు డిసెంబరు 5 వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే సినిమాకు ఫస్టాఫ్ లాక్ చేయడం.. దాని గురించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఒక రేంజిలో చెప్పడం.. యూనిట్ సభ్యుల నుంచి కూడా ప్రథమార్ధం అదిరిపోయిందనే టాక్ వస్తుండడంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి.
‘పుష్ప-2’ కోసం తెలుగు ప్రేక్షకులను మించి హిందీ ఆడియన్స్ ఎదురు చూస్తుంటారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ‘పుష్ప’ తెలుగు వెర్షన్ ఓ మోస్తరుగా ఆడితే.. హిందీ వెర్షన్ బ్లాక్ బస్టర్ అయింది.
సినిమా రిలీజ్ తర్వాత పుష్ప మేనరిజమ్స్, ఆ సినిమా పాటలు హిందీలో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ‘పుష్ప-2’ సినిమాకు హిందీలో బిజినెస్ కూడా ఒక రేంజిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల పరంగా కూడా హిందీ మార్కెట్ మీద ప్రత్యేకంగా దృష్టిసారించబోతోందట టీమ్.
ప్రస్తుతం తెలుగు సినిమాలకు అర్ధరాత్రి 1 గంట నుంచే పెయిడ్ ప్రిమియర్స్ పడుతున్న సంగతి తెలిసిందే. కల్కి, దేవర సినిమాలకు ఇలాగే చేశారు. ‘పుష్ప-2’కు కూడా ఇదే ఒరవడి కొనసాగనుంది. ఐతే అంతకంటే ముందు హిందీలో స్పెషల్ షో పడబోతోందట.
ముంబయిలో ముందు రోజు రాత్రి 9.30కే ‘పుష్ప-2’ స్పెషల్ ప్రిమియర్ వేయబోతున్నారట. బాలీవుడ్ సెలబ్రెటీలు, మీడియాకు ఈ షో ఉంటుందని సమాచారం. సినిమా మీద సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉన్న టీం.. ఈ ప్రిమియర్ ద్వారా ముందే పాజిటివ్ టాక్ ముందే బయటికి వచ్చి హిందీ ప్రేక్షకుల్లో ఇంకా హైప్ పెరగడానికి ఉపయోగపడుతుందని.. తద్వారా ఓపెనింగ్స్ కూడా పెంచుకోవచ్చని భావిస్తున్నారట.
త్వరలోనే దీని గురించి అనౌన్స్‌మెంట్ కూడా వస్తుందని సమాచారం. ‘పుష్ప’ ప్రి ప్రొడక్షన్ పనులు సమయానికి ముగియక హడావుడి పడ్డ టీం.. ‘పుష్ప-2’కు మాత్రం అన్నీ ముందే సిద్ధం చేసి పక్కాగా రిలీజ్ చేయాలని భావిస్తోంది.
This post was last modified on October 15, 2024 1:27 pm
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…
ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న…
https://youtu.be/zHiKFSBO_JE?si=HDSpx4GNEhcOje0y కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి…
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…