కిరణ్ అబ్బవరం ‘క’ ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టే దీపావళిని లక్ష్యంగా చేసుకుని అక్టోబర్ 31 విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేస్తూ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. పెద్ద సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కిరణ్ కు ఈ ప్యాన్ ఇండియా మూవీ చాలా కీలకం. తమిళనాడులో పోటీ వల్ల సరైన థియేటర్లు దొరక్కపోయినా సరే రిలీజ్ కు సిద్ధపడుతున్నాడు. దీనికి స్వయానా నిర్మాణ భాగస్వామి కూడా కావడం చూస్తే కంటెంట్ మీద మాములు నమ్మకం ఉన్నట్టు కనిపించడం లేదు ప్రోమోలు, పాటలు వగైరా మంచి పీరియాడిక్ ఫీలింగ్ అయితే ఇచ్చాయి ట్రైలర్ మీద హైప్ ఆధారపడి ఉంటుంది.
ఇక రిస్క్ సంగతి చూస్తే క చుట్టూ విపరీతమైన పోటీ ముసురుకుని ఉంది. వాటిలో మొదటిది దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్. సితార లాంటి పెద్ద బ్యానర్ నిర్మాణంతో పాటు సార్ హిట్టు కొట్టిన తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి చేసిన సినిమా ఇదే కావడంతో అంచనాలు బాగున్నాయి. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. 21 గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ జరిగాక హైప్ ఎక్కడికో వెళ్ళిపోతుందని టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది. సత్యదేవ్ జీబ్రా ఇంకా పబ్లిసిటీ హడావిడి మొదలుపెట్టలేదు. టీజర్ చాలా వెరైటీగా అనిపించింది. శివ కార్తికేయన్ – సాయిపల్లవి అమరన్ కు తెలుగులోనూ మద్దతు దొరుకుతోంది.
ఇవి కాకుండా జయం రవి బ్రదర్ వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ప్రశాంత్ నీల్ కథను అందించిన బఘీరా హీరో శ్రీమురళి మనకు పరిచయం లేకపోయినా పెద్ద ఎత్తున తెలుగు డబ్బింగ్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి మధ క నెగ్గుకు రావాల్సి ఉంటుంది. నిజానికి దీనికన్నా ముందు కిరణ్ అబ్బవరం నటించిన మరో సినిమా దిల్ రుబా రిలీజ్ కావాల్సింది. కానీ క మీద ఉన్న నమ్మకంతోనే ముందు దీన్ని తీసుకొస్తున్నారు. హీరో పాత్ర ఒక గ్రామంలో పోస్ట్ మ్యాన్ గా నటించడంతో పాటు చాలా సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయని, షాక్ కి గురి చేయడం ఖాయమని అంటున్నారు.
This post was last modified on October 15, 2024 11:10 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…