ఇంకో నెల రోజుల్లో విడుదల కాబోతున్న కంగువ కోసం గ్రౌండ్ రెడీ అవుతోంది. 2024లో కల్కి 2898 ఏడి, దేవర, గుంటూరు కారం, గోట్ తర్వాత అతి పెద్ద ఓపెనింగ్స్ దక్కించుకోబోతున్న ప్యాన్ ఇండియా మూవీగా దీని మీద భారీ అంచనాలున్నాయి. ఒరిజినల్ వెర్షన్ కి సూర్య స్వంతంగా డబ్బింగ్ చెబుతుండగా ఏఐ టెక్నాలజీ వాడి ఏడు ఇతర భాషల్లో ఆయన గొంతే వినిపించేలా దర్శక నిర్మాతలు సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. 3డి వెర్షన్ తాలూకు పనులు చివరి దశకు వచ్చాయట. నవంబర్ 15 ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మిస్ కాకుండా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్న వైనం కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ మేరకు ఆహ్వానం వెళ్లిందని ఫిలిం నగర్ టాక్. ఇంత బలంగా చెప్పేందుకు కారణముంది. కంగువకు నిర్మాణ భాగస్వామి యువి క్రియేషన్స్. దాని అధినేతలు వంశీ, ప్రమోద్ లు డార్లింగ్ కు ఎంత ప్రాణ స్నేహితులో చెప్పనక్కర్లేదు. సో అడగటం ఆలస్యం నో అనకపోవచ్చు. కాకపోతే హను రాఘవపూడితో చేస్తూన్న ఫౌజీ షూటింగ్ పీక్స్ లో ఉన్న సమయంలో దీనికి అందుబాటులో ఉంటాడో లేదో చూడాలి. అయితే కాల్ షీట్స్ చెక్ చేసుకునే యువి వాళ్ళు అడుగుతారు కాబట్టి డౌట్ అక్కర్లేదేమో.
ఇదే నిజమైతే సూర్య, ప్రభాస్ లను ఒకే వేదిక మీద చూసే అభిమానులకు దక్కుతుంది. ఒకళ్ళ గురించి ఒకరు పరస్పరం చెప్పుకునే మాటలు ఎలా ఉంటాయోననే ఆసక్తి సామాన్య ప్రేక్షకుల్లోనూ ఉంటుంది. ఎంత పెద్ద హిట్లు కొట్టినా సౌమ్యంగా ఉండే ఇద్దరు పెద్ద హీరోల కలయిక కన్నా కావాల్సింది ఏముంటుంది. కంగువ కోసం భారీ ఎత్తున పబ్లిసిటీ డిజైన్ చేస్తున్న స్టూడియో గ్రీన్ సంస్థ బాహుబలి స్థాయిలో బ్లాక్ బస్టర్ ని ఆశిస్తోంది. రజనీకాంత్ పెద్దన్న నిరాశపరిచినప్పటికీ దర్శకుడు సిరుతై శివ చెప్పిన కథ విపరీతంగా నచ్చడంతో ఇంత భారీ బడ్జెట్ తో రిస్క్ తీసుకున్నారు. ట్రైలర్ లాంఛ్ త్వరలోనే ఉండబోతోంది.
This post was last modified on October 14, 2024 11:39 am
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…