దర్శకుడు ప్రశాంత్ నీల్ మరో ఐదేళ్ళ వరకు బిజీగా ఉండేలా పర్ఫెక్ట్ లైనప్ అయితే సెట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఒక అగ్ర హీరో డేట్స్ దొరకాలి అంటే ఏడాది లేదా రెండేళ్ళు ఎదురు చూడాల్సి వస్తోంది. ఇక హీరోల పరిస్థితి కూడా దాదాపు అలానే మారింది. అందుకే అగ్ర దర్శకులతో ముందే ఒక కథ లాక్ చేసుకుంటున్నారు.
ఇక నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చెయాలనే టార్గెట్ తో ప్లాన్ అయితే సెట్ చేసుకున్నాడు. ఇక మరోవైపు ప్రభాస్ తో సలార్ 2 కూడా ఫినిష్ చేయాల్సి ఉంది. దానికి ఎక్కువ టైమ్ పట్టకపోవచ్చు. 2027లో సమ్మర్ కు సలార్ 2 రావచ్చని టాక్.
KGF3 స్క్రిప్ట్ కూడా ముందే సిద్ధం చేసుకున్న నీల్ డైలాగ్ వెర్షన్ ను ఫినిష్ చేయాల్సి ఉందట. దానికి ఒక ఏడాదిన్నర టైమ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ కాంబో సెట్టయినట్లు తెలుస్తోంది. దానయ్య నిర్మాణంలో రానున్న ఈ ప్రాజెక్టు 2029 లేదా 2030 లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
అసలైతే ఈ కాంబో సలర్ తరువాతే సెట్స్ పైకి రావాల్సింది. 2021లొనే నీల్ చరణ్ కు ఒక కథ వినిపించాడు. కానీ అప్పుడు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. ఫైనల్ గా ఇప్పుడు మరో కథకు కనెక్ట్ అయినట్లు సమాచారం. ఏదేమైనా నీల్ మాత్రం మరో ఐదేళ్ళ వరకు ఖాళీ లేకుండా అగ్ర హీరోలందరిని లాక్ చేసుకున్నాడు. మరి ఈ లైనప్ అనుకున్నట్లుగా సాగుతుందో లేదో చూడాలి.
This post was last modified on October 13, 2024 12:57 pm
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…
హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…
షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…
దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…