Movie News

మోక్షజ్ఞ సరసన జూనియర్ రవీనా?

నందమూరి అభిమానులు ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ తెరంగేట్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ ద్వారా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఫస్ట్ లుక్ పోస్టర్ తో శుభవార్తను పంచుకున్నారు. టైటిల్ పెట్టడం, రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లడం ఇంకా జరగలేదు కానీ క్యాస్టింగ్ కు సంబంధించిన పనులు జరిగిపోతున్నాయి. హీరోయిన్ గా రషా తదాని పేరుని పరిశీలిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. గతంలో ఈమెను రామ్ చరణ్ 16 కోసం ట్రై చేసి ఫోటో షూట్ చేసినట్టు వార్త వచ్చింది కానీ తర్వాత ఏమైందో బయటికి రాలేదు. ఫైనల్ గా జాన్వీ కపూర్ ని లాక్ చేసుకుని అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

రషా తదాని వెనుక కొన్ని ఆసక్తికరమైన సంగతులున్నాయి. ఈమె బాలీవుడ్ సీనియర్ నటి రవీనాటాండన్ కూతురు. 1993 బంగారు బుల్లోడులో బాలకృష్ణ సరసన రమ్యకృష్ణతో పాటు మెయిన్ హీరోయిన్ గా నటించింది. అది పెద్ద హిట్టయినా తెలుగులో కొనసాగకుండా బాలీవుడ్ అవకాశాల వైపే మొగ్గు చూపింది. కొంత గ్యాప్ తీసుకుని నాగార్జున ఆకాశవీధిలో నటించినా అది డిజాస్టర్ కావడంతో మళ్ళీ కనిపించలేదు. మంచు ఫ్యామిలీ తీసిన పాండవులు పాండవులు తుమ్మెద ఆమె కనిపించిన చివరి తెలుగు సినిమా. కన్నడ కెజిఎఫ్ లో ప్రధాన మంత్రిగా మెప్పించింది కూడా ఈమెనే.

ఇంత కనెక్షన్ ఉన్న రవీనాటాండన్ తన కూతురిని సౌత్ లో లాంచ్ చేయడానికి మోక్షజ్ఞ కన్నా గ్రాండ్ ఆప్షన్ వేరే ఉండదు. ఇంకా ఖరారుగా చెప్పలేదు కాబట్టి అధికారిక ప్రకటన వచ్చేదాకా వేచి చూడాల్సిందే. నవంబర్ లేదా ఏడాది చివర్లో షూటింగ్ మొదలుపెట్టే ప్లాన్ లో ఉన్న ప్రశాంత్ వర్మ ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు. ఆయన సినిమాటిక్ యునివర్స్ తో సంబంధం లేని ఇండిపెండెంట్ మూవీగా ఇది ఉంటుందని సమాచారం. ఒకవేళ రషా తదాని కనక ఓకే కాకపోతే తర్వాత ఎవరున్నారో ఇంకా లీక్ కాలేదు. చాలా పెద్ద బడ్జెట్ తో రూపొందనున్న మోక్షజ్ఞ డెబ్యూ 2026లో విడుదల కావొచ్చని టాక్.

This post was last modified on October 13, 2024 9:52 am

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

6 minutes ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

26 minutes ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

33 minutes ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

36 minutes ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

3 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

4 hours ago