అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లను తెరుచుకోవచ్చునని, యాభై శాతం సీట్లు మాత్రమే నిండేలా చూసుకుని సినిమాలు ప్రదర్శించుకోవచ్చునని గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. గుడ్డి కంటే మెల్ల నయం అని కొందరు ఆనందిస్తున్నారు కానీ ప్రాక్టికల్ గా ఆలోచించే నిర్మాతలు మాత్రం ఇది లాభదాయకం కాదని, పూర్తి కెపాసిటీ అమ్మే పర్మిషన్ వచ్చే వరకు వేచి చూడడం ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు.
సగం టిక్కెట్లు మాత్రమే అమ్మడానికి టికెట్ ధర డబుల్ చెయ్యాలి. కానీ ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వలేదు. మునుపటి రేట్లు పెట్టి సగం థియేటర్ మాత్రం నిండితే హౌస్ ఫుల్ అంటే థియేటర్ రెంట్స్ మాట ఏమిటి? ఇన్ని నెలల లాక్ డౌన్ వల్ల సినిమా థియేటర్స్ బిజినెస్ దారుణంగా దెబ్బ తినేసింది. ఇప్పుడు వాళ్ళు రెంట్లు తగ్గించుకునే అవకాశమే లేదు. అలా అడగడం భావ్యం కాదు కూడా. అంటే ఫుల్ రెంట్ చెల్లించి సగం గ్రాస్ కలెక్షన్ మాత్రమే వస్తే నిర్మాత, బయ్యర్ మాట ఏమిటి? దీని వల్ల డిస్ట్రిబ్యూటర్స్ కూడా మొత్తం కాకుండా సగం రేట్ ఇస్తామని అంటారు.
అంతా చేసి సినిమా రిలీజ్ చేసినా ఆ సగం థియేటర్లు అయినా నిండుతాయా లేదా అనేది అనుమానమే. అందుకే ఈ గోల అంతా దేనికని ఓటిటి రిలీజ్ కే నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. ఈలోగా ఓటిటి ద్వారా విడుదలైన సినిమాలను థియేటర్లలో ప్రదర్శించి స్పందన ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారు. సంక్రాంతి నాటికి పరిస్థితి మామూలు అవుతుందని, అప్పుడు యథావిధిగా సినిమాలు రిలీజ్ చేయవచ్చునని భావిస్తున్నారు.
This post was last modified on October 1, 2020 10:39 am
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…