ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సమంతా విచ్చేసింది. దగ్గుబాటి రానా నాలుగు మంచి మాటలు చెప్పాడు. త్రివిక్రమ్ అండగా నిలబడి స్పీచ్ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ హీరోయిన్ గా టాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకున్న అలియా భట్ ప్రధాన పాత్ర. ఒక సినిమాకు కనీస బజ్ రావడానికి ఈ మాత్రం అంశాలు సరిపోతాయి. అందుకే జిగ్రాని తెలుగులో డబ్బింగ్ చేసి మరో అయిదు సినిమాల మధ్య పోటీలో దసరాకు విడుదల చేశారు. సరే కంటెంట్ బాగుంటే భాషను మన ప్రేక్షకులు అంత సీరియస్ గా పట్టించుకోరు కాబట్టి ఆ ధైర్యంతోనే నిర్మాతలు జిగ్రాని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. అయితే జరిగింది వేరు.
ఇది 1993లో వచ్చిన శ్రీదేవి – సంజయ్ దత్ ‘గుంరా’ అనే పాత చిత్రం నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథ. తమ్ముడు అంకుర్ (వేదాంగ్ రైనా)ని ప్రాణంగా చూసుకునే అక్క సత్యభామ (అలియా భట్). ఉన్నత చదువుల కోసం మలేషియా వెళ్లిన అంకుర్ తన బంధువుతో పాటు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటాడు. అక్కడి ప్రభుత్వం మరణ శిక్ష విదిస్తుంది. తోడబుట్టినవాడిని రక్షించుకునే లక్ష్యంతో సత్య అక్కడికి వెళ్లి స్థానికంగా ఉండే ముత్తు (రాహుల్ రవీంద్రన్) లాంటి వాళ్ళ సహాయం తీసుకుంటుంది. జీవితాన్ని పణంగా పెట్టిన సత్య చివరికి అంకుర్ ని ఎలా కాపాడుకుంది, ఇండియాకు ఎలా తీసుకొచ్చిందనేది కథ.
స్టోరీ ఎలా ఉందనేది పక్కనపెడితే ఇటు ఎమోషన్స్, అటు యాక్షన్ రెండింటిని బ్యాలన్స్ చేయడం దర్శకుడు వాసన్ బాలా పడిన తడబాటు జిగ్రాని భరించలేని ప్రహసనంగా మార్చాయి. పేలవమైన కథా కథనాలను అలియా భట్ పెర్ఫార్మన్స్ కాపాడలేకపోయింది. గ్రిప్పింగ్ గా అనిపించే ఎపిసోడ్స్ లేకపోవడం ప్రధాన లోపం. అక్కా తమ్ముడి బాండింగ్ ని సైతం సరిగా రిజిస్టర్ చేయలేదు. సాంకేతిక పనితనం అండగా నిలబడ్డా రైటింగ్ చాలా బలహీనంగా ఉండటంతో కోట్ల రూపాయల బడ్జెట్ కు న్యాయం జరగలేదు. ఎలాంటి అంచనాలు పెట్టుకోకపోయినా షో అయ్యాక అలియా తూనే క్యా కియా అనకుండా ఉండలేం.
This post was last modified on October 12, 2024 4:22 pm
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…