పవన్ కళ్యాణ్ చేస్తున్న వకీల్ సాబ్ కంటే, ఆల్రెడీ షూటింగ్ మొదలైన క్రిష్ సినిమా కంటే గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో చేసే సినిమా విషయంలోనే ఫాన్స్ ఎక్కువ ఎక్సయిటెడ్ గా ఉన్నారు. మీడియా ఈ సంగతి గుర్తించి ఈ సినిమా గురించి పుకార్లు ప్రచారం చేయడం మొదలు పెట్టింది. ఈ సినిమాకు సంబంధించి కథ సిద్ధం చేసినా ఇంకా పవన్ కి హరీష్ అది వినిపించలేదు.
కాన్సెప్ట్ పోస్టర్ అంటూ పవన్ బర్త్ డేకి విడుదల చేసిన పోస్టర్ గురించి కూడా పవన్ స్పందించలేదు. ఆ పోస్టర్ ద్వారా ఇది కమర్షియల్ సినిమానే కానీ సోషల్ మెసేజ్ ఉంటుందని హరీష్ తెలియజేసాడు. అంతకు మించి ఆ సినిమా గురించి ఇప్పుడే మాట్లాడడం కరెక్ట్ కాదని వెయిట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో పవన్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడని, గబ్బర్ సింగ్ మాదిరిగానే పవన్ ని పోలీస్ పాత్రలో విలక్షణంగా చూపించడానికి హరీష్ ప్లాన్ చేస్తున్నాడని కొందరు రాస్తున్నారు.
మరి కొందరు ఈ చిత్రం హరీష్ తీసిన మిరపకాయ్ 2 లా ఉంటుందని అంటున్నారు. అన్నట్టు అందులో కూడా హీరో పోలీసేనండోయ్. మిరపకాయ్ కథ అప్పట్లో పవన్ కోసమే రాసిన హరీష్ ఇప్పుడా కథని మరోలా మార్చి పవన్ ని అభిమానులు మెచ్చేలా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా గురించి మాట్లాడుకోడానికి చాలా సమయం ఉంది కనుక అందాక ఈ గాసిప్స్ ఫాన్స్ ని ఖుషీ చేస్తాయి.
This post was last modified on October 1, 2020 10:39 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…