మనం ‘పేరు’ కానిది, ఓ అచ్చ తెలుగు టైటిల్ పెట్టి.. దాన్ని అదే పేరుతో తమిళంలో రిలీజ్ చేస్తే అక్కడి వాళ్లు ఊరుకుంటారా? కనీసం ఆ సినిమాను వాళ్లు పట్టించుకుంటారా? కానీ మన వాళ్లు మాత్రం ‘సింగం-2’, ‘సింగం-3’ అని తమిళ పేర్లు పెట్టి సినిమాలు రిలీజ్ చేస్తే విరగబడి చూసేశాం. అదైనా పర్వాలేదు కానీ.. ‘వలిమై’ అని అసలు అర్థమేంటో తెలియని తమిళ పదాన్ని టైటిల్‌గా పెట్టి రిలీజ్ చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.
ఇంకేముంది? తెలుగు వాళ్లు దేన్నయినా తేలిగ్గా తీసుకుంటారు.. మనం ఎలాంటి పేర్లు పెట్టినా పర్వాలేదు అనే ఉదాసీన ధోరణి వచ్చేసింది తమిళ నిర్మాతల్లో. వరుసగా పొన్నియన్ సెల్వన్, రాయన్, వేట్టయాన్ అంటూ తమిళ పేర్లే పెట్టి సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు. కనీసం వీటిని తెలుగులో రిలీజ్ చేస్తున్న తెలుగు నిర్మాతలైనా తెలుగు పేర్లు పెడదాం అనే ప్రయత్నం కూడా చేయట్లేదు. తెలుగు డబ్బింగ్ కోసం పెడుతున్న శ్రద్ధలో పేరు మార్చడం మీద పెట్టకపోవడం విచారకరం.
ఒకప్పుడు రజినీకాంత్ సినిమాలంటే తెలుగు డబ్బింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ ఉండేది. కానీ ఇప్పుడు ఆయన సినిమాను కూడా తమిళ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. కానీ దీని గురించి ప్రశ్నించే వాళ్లు కరవయ్యారు. ఎట్టకేలకు రచయిత అబ్బూరి రవి ఈ సినిమా పేరు పెట్టకుండా.. తమిళ టైటిళ్లు పెట్టి తెలుగులో రిలీజ్ చేస్తుండడంపై ఓ పోస్టు పెట్టి మన జనాల్లో కదలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ ఆయన గోడును పట్టించుకునేదెవరు? చిన్న చిన్న విషయాలకు ట్రెండ్స్ చేస్తే నెటిజన్లు.. ఇలాంటి విషయాలకు ఎందుకు హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేయరు.. ఇలా తమిళ టైటిళ్లు పెట్టి రిలీజ్ చేస్తే చూడం అంటూ బాయ్‌కాట్ ఎందుకు చేయరు అన్నది ప్రశ్నార్థకం. ఇలా మన వాళ్లు లైట్ తీసుకుంటూ పోతే.. రేప్పొద్దున తమిళ పేర్లను తెలుగు లిపిలో కూడా రాయడం ఆపేసి తమిళంలోనే వేస్తారేమో?
This post was last modified on October 11, 2024 3:07 pm
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…
తెలుగులో ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. పాన్ వరల్డ్ హిట్…