భారతీయ వ్యాపార దిగ్గజం రతన్ టాటా కన్నుమూత కోట్లాది ప్రజలను కలవరపరిచింది. మన దేశానికి పారిశ్రామిక విప్లవం రావడంలో కీలక పాత్ర పోషించిన ఈ బిజినెస్ టైకూన్ తన ఎనభై ఆరు సంవత్సరాల జీవితంలో అధిక శాతం సమాజం కోసమే ఆలోచించి వస్తువులు తయారు చేశారు తప్పించి లాభాల కోసమో కోట్ల రూపాయల సంపద కోసమో కాదు.
అందుకే అత్యున్నత పురస్కారాలు ఎన్ని దక్కినా, కాలు కింద పెట్టకుండా సర్వ భోగాలు అనుభవించే తాహతు ఉన్నా ఎప్పుడూ సామాన్యుడిగా ఉండేందుకు తపించారు తప్ప ఏనాడూ ఆర్భాటాలకు వెళ్లని గొప్ప చరిత్ర ఆయనది. ఇలాంటి మహా వ్యక్తి గురించి ఇప్పటి తరానికి చెప్పాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. దానికి సరైన మాధ్యమం సినిమా. రతన్ టాటా బయోపిక్ ని తెరమీద తీసుకురాగలిగితే ఎన్నో తరాలకు అదో గొప్ప రిఫరెన్స్ గా నిలిచిపోతుంది.
గతంలో ధీరూభాయ్ అంబానీ లైఫ్ ని మణిరత్నం గురు పేరుతో మూడు గంటల్లో చెప్పే ప్రయత్నం చేశారు. పేరు వచ్చింది కానీ ఆశించిన గొప్ప స్థాయిలో విజయవంతం కాలేదు. అయినా గురు వన్ అఫ్ ది బెస్ట్ వర్క్స్ అఫ్ మణి అంటారు విమర్శకులు. అదే తరహాలో రతన్ టాటాని కూడా స్క్రీన్ మీద చూపించేందుకు ఎవరైనా దర్శక నిర్మాతలు ముందుకు రావాలి. కొన్నేళ్ల క్రితం ఆర్ మాధవన్ లేదా అభిషేక్ బచ్చన్ లతో రతన్ టాటా బయోపిక్ ని సుధా కొంగర తీసే ప్రయత్నంలో ఉన్నారనే టాక్ వచ్చింది కానీ తర్వాత ఆ వార్తను ఆవిడ కొట్టిపారేశారు.
సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా పూనుకోవాలి. అది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో జరగాలి. ఇప్పటిదాకా లెక్కలేనన్ని బయోపిక్కులు ఎన్ని వచ్చినా ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిపోయింది గాంధీ ఒక్కటే. మళ్ళీ అదే స్థాయిలో రతన్ టాటా గురించి చెప్పగలిగితే అంతకన్నా గర్వకారణం ఎవరికైనా ఏముంటుంది. ఇప్పుడే ఎక్కువ చర్చించుకోవడం తొందరపాటు అవుతుంది కానీ ఇంకొంత కాలం వేచి చూడాలి.
This post was last modified on October 10, 2024 7:13 pm
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…