బిగ్‍బాస్ హౌస్‍లో ఎవరైనా అదుపు తప్పి ప్రవర్తించినా, కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఎవరి మీదకైనా దూసుకెళ్లినా ఆ వారాంతంలో హోస్ట్ తో క్లాస్ పీకిస్తారు. అప్పుడు సదరు ప్లేయర్లు తమ తప్పులు దిద్దుకుని ప్రజల మన్ననలు గెలుచుకునేందుకు చూస్తారు. ఎవరు తప్పు చేసినా కానీ సరిదిద్ది వాళ్లను సరిగ్గా ఆడేట్టు చేయడం కూడా హోస్ట్ బాధ్యతే. అయితే హోస్ట్ షో అంతా ఫాలో కారు కాబట్టి బిగ్‍బాస్ రైటర్లు వారితో తమకు కావాల్సిన విధంగా మాట్లాడిస్తారు.
ఎవరిని హౌస్‍లో వుంచాలి, ఎవరిని ఎలిమినేట్ చేయాలనే విషయంలో ప్రేక్షకులను ప్రభావితం చేసేట్టు చేయడంలో ఎడిటర్లు, షో క్రియేటివ్ డైరెక్టర్ల పాత్ర చాలా వుంటుంది. ఇక విషయానికి వస్తే… గత వారం మనుషులు వర్సెస్ రోబోల టాస్కులో సయ్యద్ సోహైల్ అదుపు తప్పి ప్రవర్తించాడు. కుమార్ సాయి పై, అరియానా పై నోరేసుకుని పడిపోయాడు. చేతులతో అసభ్యకరమైన సౌంజ్ఞలు కూడా చేసాడు. అయితే ఇంతగా రెచ్చిపోయినా కానీ నాగార్జునతో అతడిని ఒక్క మాట కూడా అనిపించలేదు.
ఒక వేళ అతడికి క్లాస్ తీసుకున్నట్టయితే తన స్వభావాన్ని అతను మార్చుకునేవాడు. కానీ బిగ్‍బాస్ టీమ్‍కి అతడిని బయటకు పంపేసే ఆలోచన వున్నట్టుంది. షోలో ఒక్కొక్కరూ ఇన్నేసి రోజులు వుండాలనే విషయంలో వారికో లెక్క వుంటుంది. దానికి అనుగుణంగా సోహైల్‍ని టార్గెట్ చేసినట్టున్నారు. అతడు ఈవారం నామినేషన్లలో వున్నాడు. ఒకవేళ ఈసారి తప్పించుకున్నా కానీ ఈ దుడుకు ప్రవర్తన వల్ల ఎక్కువ రోజులు తప్పించుకోలేడు.
ఆల్రెడీ గతం వారం అతడి తప్పులు ఎత్తి చూపని కారణంగా అతను అదే విధమైన ప్రవర్తనతో ఈవారం చాలా యాంటీ తెచ్చుకుంటున్నాడు. వీకెండ్లో ఎలాగో నాగార్జునతో అతడికి క్లాస్ తీయిస్తారు కానీ అప్పటికే సోహైల్ జనాల దృష్టిలో వీక్ అయిపోయి ఎలిమినేషన్‍కి మరింత దగ్గరగా వెళతాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates