1989 సంవత్సరం. అక్టోబర్ 5వ తేదీ. బ్రేక్ డాన్సులు, ఫైట్లు, భారీ సెట్ల హంగులు ఆర్భాటాలు, అవుట్ డోర్ లొకేషన్ల మధ్య కమర్షియల్ సినిమా వెలిగిపోతున్న టైంలో రామ్ గోపాల్ వర్మ అనే కొత్త కుర్రాడికి నాగార్జున అవకాశం ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బెజవాడ రౌడీయిజంని కాలేజీ రాజకీయాలకు ముడిపెట్టాలనే ఆలోచన ఎంతమేరకు వర్కౌట్ అవుతుందో నిర్మాత వెంకట్ అక్కినేనికు స్పష్టత లేదు. తమ్ముడు నమ్మాడు. అంతే. మరో మాటకు తావులేదు. విడుదల రోజు అక్కినేని అభిమానులు విపరీతమైన అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్లారు. షో అయ్యాక నిశ్శబ్దంగా బయటికి వచ్చారు.
అందరిలోనూ నమ్మశక్యం కాని హావభావాలు. నిజంగా మేం చూసింది తెలుగు సినిమానేనా అని ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. రౌడీలు వెంటపడితే బస్సెక్కి పారిపోయే హీరోని చూసి ఎవరూ నవ్వలేదు. ఎందుకంటే జ్వరంతో ఉన్న అన్న కూతురు తన భుజాలపై ఉన్న శివ సమయస్ఫూర్తిని గుర్తించారు కాబట్టి. ఇంటర్వెల్ వరకు విలన్ భవానిని శివ కలుసుకోకపోతే ఫ్యాన్స్ ఫీల్ కాలేదు. కారణం ఆ లోటుని రెండింతలు తీర్చే ఒక అద్భుతమైన సన్నివేశం తర్వాత వచ్చింది కాబట్టి. బాంబ్ బ్లాస్టులు, తెరనిండా రక్తపాతం లేకుండా వయలెన్స్ ని వర్మ ఆవిష్కరించిన తీరు కరుడుగట్టిన విమర్శకులను మెప్పించింది.
ఇళయరాజా పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ శివ స్థాయిని వంద రెట్లు పైకి పెంచాయి. బోటనీ పాఠముంది సాంగ్ కోసమే రిపీట్ షోలు వేసుకున్న ఆడియన్స్ ఉన్నారు. రఘువరన్ అనే మాడరన్ విలన్ అరుపులు లేకుండా క్రూరత్వం ఎలా పండించవచ్చో నిరూపించాడు. అన్నపూర్ణ బ్యానర్ మీద గౌరవంతో కోట, గొల్లపూడి లాంటి సీనియర్ నటులు చిన్న క్యామియోలు చేశారు. జగన్, చిన్నా, ఉత్తేజ్ లాంటి ఉడుకు రక్తాన్ని తెరకు పరిచయం చేసి వాళ్లకు జీవితాన్ని ఇచ్చాడు వర్మ. ట్రెండ్ సెట్టర్ అనే పదానికి సరైన నిర్వచనంలా మిగిలిపోయిన శివ 35 కాదు వంద వసంతాలు పూర్తి చేసుకున్నా ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోతుంది.
This post was last modified on October 5, 2024 3:48 pm
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…