నిన్న విడుదలైన స్వాగ్ యువతకు బాగానే కనెక్ట్ అయ్యిందని సోషల్ మీడియా రెస్పాన్స్ చెబుతోంది. సాధారణ ప్రేక్షకులకు ఏ మేరకు రీచ్ అవుతుందనేది ఇంకో రెండు మూడు రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.
క్లిష్టంగా అనిపించే కాన్సెప్ట్ ని ఎమోషనల్ గా చెబుతూనే ట్రెండ్ మిస్ అవ్వకుండా చెప్పాలని చూసిన దర్శకుడు హసిత్ గోలి హిట్ అందుకుంటాడా లేదానేది పక్కనే పెడితే ఫిలిం మేకింగ్ పరంగా ఒక కొత్త ఒరవడిని ట్రై చేసిన మాట వాస్తవం. స్క్రీన్ ప్లేలో కాస్త కన్ఫ్యూజన్ తగ్గించి, నాగార్జున మనం తరహాలో అందరికీ అర్థమయ్యేలా కథనం రాసుకుని ఉంటే మెరుగైన ఫలితం దక్కేదనే కామెంట్లో నిజముంది.
సరే రిజల్ట్ తేలడానికి టైం ఉంది కానీ శ్రీవిష్ణు మాత్రం స్వాగ్ దెబ్బతో ఒకేసారి నాలుగు మెట్లు ఎక్కేశాడు. ఎలా అంటే నాలుగు విభిన్న పాత్రలు చేయడమే కాక వాటిలోని వేరియేషన్స్ ని మెప్పించేలా నటించడంతో పాటు పదకొండు గెటప్స్ లో శభాష్ అనిపించుకున్నాడు. మాములుగా అయితే ఇలాంటి సబ్జెక్టుకి యూత్ హీరోలు అంత సులభంగా ఓకే చెప్పరు.
రిస్క్ తో ముడిపడిన వ్యవహారం కాబట్టి ఇమేజ్ కి ఇబ్బందవుతుందనే ఉద్దేశంతో నో అనేస్తారు. ఓం భీమ్ బుష్ లోనూ దెయ్యం ఫ్లాష్ బ్యాక్ వెనుక షాకింగ్ ట్విస్టుకి ఒప్పుకున్న శ్రీవిష్ణు ఇప్పుడు స్వాగ్ లోనూ క్రియేటివ్ కంటెంట్ ఎంచుకున్నాడు.
ఇప్పుడిప్పుడే పైకొస్తున్న కుర్ర హీరోలే సేఫ్ గేమ్ ఆడుతున్న పరిస్థితిలో శ్రీవిష్ణు లాంటి వాళ్ళు ప్రయోగాలు చేయడం అవసరమే. కమర్షియల్ గా రికార్డులు బద్దలు కొట్టకపోవచ్చు కానీ ఎప్పటికైనా గుర్తుండిపోయే ఎక్స్ పరిమెంట్స్ ఇవి.
స్వాగ్ ఫైనల్ స్టేటస్ మీద ఇప్పటికిప్పుడు ఒక నిర్ధారణకు రాలేం కానీ ప్రమోషన్లు బాగా చేయాలని టీమ్ నిర్ణయించుకుంది. బాక్సాఫీస్ వద్ద దేవర తర్వాత తమదొకటే ఆప్షన్ కావడంతో వీలైనంత దీన్ని వాడుకునే ఉద్దేశంతో పబ్లిసిటీ ప్లాన్ చేసుకుంటోంది. రాజరాజ చోర రేంజులో స్వాగ్ రీచ్ తెచ్చుకోకపోవచ్చు కానీ ప్రయత్నమైతే మెచ్చుకోదగినదే.
This post was last modified on October 5, 2024 11:16 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…