యానిమల్ సినిమా చాలామంది కెరీర్లను మలుపు తిప్పింది. కానీ ఆ సినిమా వల్ల అత్యధిక ప్రయోజనం పొందింది బాబీ డియోల్ అంటే అతిశయోక్తి కాదు. హీరోగా రణబీర్ కపూర్, దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ భారీ విజయాలందుకుని తమ స్థాయిని ఎంతో పెంచుకున్నారు.
అనిల్ కపూర్, త్రిప్తి దిమ్రి లాంటి వాళ్ల కెరీర్లకు కూడా ఈ సినిమా మంచి ఊపు తెచ్చింది. కానీ బాబీ డియోల్ పొందిన ప్రయోజనం మాత్రం అనూహ్యం. ఈ సినిమాకు ముందు బాబీని అందరూ మరిచిపోయారు. ఆ పేరుతో ఓ మాజీ హీరో ఉన్న సంగతే గుర్తించడం మానేశారు.
హీరోగా కాకపోయినా క్యారెక్టర్, విలన్ రోల్స్ కూడా ఇచ్చేవాళ్లు కాదు. అలాంటి టైంలో ‘యానిమల్’ మూవీలో సందీప్ రెడ్డి డిజైన్ చేసిన వయొలెంట్ క్యారెక్టర్‌ను అద్భుత రీతిలో పోషించిన బాబీ.. ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. ఇందులో తన పెర్ఫామెన్స్ స్టాండౌట్‌గా నిలిచింది. రిలీజ్ తర్వాత ఈ పాత్ర సెన్సేషన్ క్రియేట్ చేసింది.
దీంతో బాబీ కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. ఇండియాలోనే బిజీయెస్ట్ విలన్లలో ఒకడైపోయాడు బాబీ. ఆల్రెడీ తెలుగులో బాలకృష్ణ-బాబీ సినిమాలో విలన్ పాత్ర పోషించాడు. పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’లోనూ అతనో ముఖ్య పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
సూర్య క్రేజీ మూవీ ‘కంగువ’లోనూ బాబీనే విలన్. ఇవి కాక హిందీలో యశ్ రాజ్ ఫిలిమ్స్ వారి ‘ఆల్ఫా’లో విలన్‌గా ఎంపికయ్యాడు. అనురాగ్ కశ్యప్ కొత్త చిత్రంలోనూ నటిస్తున్నాడు. తాజాగా బాబీ నటించబోయే మరో క్రేజీ మూవీ గురించి అప్‌డేట్ వచ్చింది.
తమిళంలో టాప్ స్టార్ అయిన విజయ్ చిత్రంలో బాబీ విలన్ పాత్ర చేయబోతున్నాడు. రాజకీయాల్లోకి వెళ్లేముందు విజయ్ చివరగా హీరోగా నటించే చిత్రాన్ని హెచ్.వినోద్ రూపొందించనున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో బాబీ నటిస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. బాబీ చేస్తున్నాడంటే అది విలన్ రోలే అయి ఉంటుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుందని చెన్నై వర్గాల సమాచారం.
This post was last modified on October 2, 2024 12:02 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…