వంద కోట్ల గ్రాస్ తో బాక్సాఫీస్ రన్ ఘనంగా ముగించిన సరిపోదా శనివారం మొన్న గురువారం నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగవుతున్న సంగతి తెలిసిందే. తెలుగుతో సహా మొత్తం అయిదు భాషల్లో స్ట్రీమింగ్ చేయడంతో వ్యూస్ భారీ ఎత్తున వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం టాప్ 1 ట్రెండింగ్ లో ఉన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఓటిటిలోనూ అదే స్పందన దక్కించుకోవడం పట్ల నాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ డిజిటల్ వెర్షన్ వచ్చేసింది కాబట్టి నిర్మాణ సంస్థ డివివి ఎంటర్ టైన్మెంట్స్ ఎడిటింగ్ టేబుల్ లో తీసేసిన ఎపిసోడ్లను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తోంది. అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది.
నిడివి సమస్య వల్ల సరిపోదా శనివారంలో కొన్ని కీలక భాగాలు తీసేశారని ముందే చెప్పారు కానీ అవేంటనేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా అజయ్ ఘోష్ కొడుకు సుప్రీత్ ఎందుకు నానిని ఏం చేయకుండా వదిలేశాడనే డౌట్ ప్రేక్షకుల్లో మొన్నటి దాకా ఉండేది. కానీ నాని ఇంటి దగ్గర వర్షంలో ఇద్దరి మధ్య ఫైట్ పెట్టడం ద్వారా ఒక కీలకమైన లింకుని దర్శకుడు వివేక్ ఆత్రేయ ఏర్పరిచాడు. అలాగే ఎస్జె సూర్య మొహానికి గాయమయ్యాక డాక్టర్ వేషంలో కమెడియన్ సత్య చేసే ట్రీట్ మెంట్ చాలా ఫన్నీగా ఉంది. కాసేపే అయినా తనదైన టైమింగ్ తో అదరగొట్టేశాడు. నకిలీ మరదలు సీన్ కూడా బాగా పేలింది.
ప్రియాంకా మోహన్ తో మరో సన్నివేశం బాగానే ఉన్నా ఇదొక్కటి లేకపోయినా పర్లేదు అనిపించింది. లాజిక్స్ పరంగా తలెత్తిన ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు ఇలా డిలీట్ సీన్లలో బయట పడుతున్నాయి. నిజానికి నాలుగు గంటల వరకు సరిపోదా శనివారం ఫైనల్ కట్ వచ్చిందనే టాక్ రిలీజ్ కు ముందే వినిపించింది. దాన్ని నూటా ఎనభై నిమిషాల లోపు కుదించడానికి టీమ్ చాలా కష్టపడి ఉంటుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో టాప్ ప్లేస్ ఎంజాయ్ చేస్తున్న సరిపోదా శనివారం ఇప్పట్లో నెమ్మదించేలా లేదు. సూర్యాస్ సాటర్డేని థియేటర్లో చూడని హిందీ, తమిళ ప్రేక్షకుల మద్దతు భారీ ఎత్తున ఉండబోతోంది.
This post was last modified on September 30, 2024 3:30 pm
నిజమే… నిన్నటిదాకా సినిమాల్లో మునిగిపోయి పవర్ స్టార్ గానే జనానికి తెలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్దగా…
పెట్టుబడుల వేటలో భాగంగా విదేశీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గడ్డ నుంచి తీపి కబురు…
మొన్న డిసెంబర్ 25 విడుదల కావాల్సిన నితిన్ రాబిన్ హుడ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచన…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి కేసు సినీ పరిశ్రమను కుదిపేసింది. ఈ నెల 19న తెల్లవారుజామున 2.30…
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? టాలీవుడ్కు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ షార్ట్ సీజన్. ఈ…
ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.…