ఎదుగుతున్న దశలో మీడియం రేంజ్ హీరోలు సేఫ్ గేమ్ ఆడేందుకే ప్రాధాన్యం ఇస్తారు. కానీ శ్రీవిష్ణు కేసు వేరు. ట్రెండీగా ఉండే కథలను ఎంచుకుంటూ కొంచెం రిస్క్ అనిపించినా సరే ప్రయోగాలకు సై అంటాడు. రాజ రాజ చోర విజయం వెనుక రహస్యం ఇదే. కొన్ని ఎక్స్ పరిమెంట్లు తేడా కొట్టినా శ్రీవిష్ణుకి యువతలో మంచి క్రేజ్ ఉన్న మాట వాస్తవం. ఓం భీమ్ బుష్ తర్వాత శ్రీవిష్ణు చేసిన కొత్త మూవీ స్వాగ్ అక్టోబర్ 4 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. దేవర రిలీజైన వారానికే రావడం పట్ల ఫ్యాన్స్ కొంత ఆందోళన చెందినా ఇది పూర్తిగా వేరే జానర్ కావడంతో దర్శక నిర్మాతలు ధైర్యం చేసి తీసుకొస్తున్నారు.
ఇవాళ ట్రైలర్ వచ్చింది. కాన్సెప్ట్ మహా విచిత్రంగా ఉంది. ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం స్వాగణిక వంశంకు చెందిన మహారాజు బ్యాక్ డ్రాప్ తో మొదలుపెట్టి భూత, వర్తమాన, భవిష్యత్ తరాలకు ముడిపెట్టి శ్రీవిష్ణుతో ఏకంగా ట్రిపిల్ రోల్ చేయించడం బాగా పేలింది. పురుషాంగం, వృషణం లాంటి పదాలను నేరుగా వాడేసి దర్శకుడు హసిత్ గోలి షాక్ ఇచ్చాడు. విజువల్స్ గట్రా చూస్తుంటే ఊహించని ఎలిమెంట్స్ తో స్వాగ్ ఏదో కొత్తగా ఉండనుందనే అభిప్రాయాన్ని కలిగించింది. ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకోవడంలో ట్రైలర్ ఉపయోగపడింది. ట్రెండీ థీమ్ ని బాగా వాడుకున్నారు.
సినిమా ఫలితం మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న శ్రీవిష్ణు బ్లాక్ బస్టర్ కి తక్కువ ఉండదని చెబుతున్నాడు. ఇంటర్వ్యూలలో ఉత్సాహంగా పాల్గొంటూ స్వాగ్ ని ఆడియన్స్ దగ్గరికి చేర్చేందుకు బాగా కష్టపడుతున్నాడు. పెళ్లి చూపులు తర్వాత సరైన సక్సెస్ లేక వెనుకబడిన హీరోయిన్ రీతువర్మకి స్వాగ్ ఫలితం ఎంతో కీలకం. అదే రోజు చెప్పుకోదగ్గ థియేట్రికల్ మూవీ ఏదీ లేకపోవడం బాగా కలిసి రానుంది. కాకపోతే టాక్ బాగా తెచ్చుకుంటే లాంగ్ వీకెండ్ తో పాటు దసరా సెలవులు కలిసి వస్తాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ పీరియాడిక్ ఎంటర్ టైనర్ లో రీతూ వర్మ కాకుండా మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజరాజ చోర కాంబో కావడంతో స్వాగ్ మీద మంచి క్రేజ్ ఉంది.
This post was last modified on October 1, 2024 8:52 am
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…
‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో…