రాజమౌళి సినిమాల స్థాయిని ఎవరూ అందుకోలేరనే అభిప్రాయం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బలంగా ఉంది. జక్కన్న తరహలో భారీ సినిమాలు తీయాలని తీయాలని ప్రయత్నించిన కొందరు దర్శకుడు, నిర్మాతలు గట్టి ఎదురు దెబ్బలు తిన్నారు. ఐతే ‘కల్కి’ మూవీతో వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్, ఆయన అల్లుడైన దర్శకుడు నాగ్ అశ్విన్ ఇండియన్ స్క్రీన్ మీద అద్భుతాన్ని ఆవిష్కరించారు.
రాజమౌళి సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో భారీతనం, విజువల్స్, ఎఫెక్ట్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు అనిర్వచనీయమైన అనుభూతిని అందించింది. బాక్సాఫీస్ దగ్గర కూడా గొప్ప ఫలితాన్ని అందుకుంది. ఇంత పెద్ద సినిమా తీసి హిట్ కొట్టినా.. రాజమౌళితో సినిమా తీయాలనే కోరిక మాత్రం అలాగే ఉందని అంటున్నాడు అశ్వినీదత్.
“రాజమౌళితో ఇంతకుముందే పని చేశా. ఆయన తొలి చిత్రం ‘స్టూడెంట్ నంబర్ వన్’కు నేను ప్రెజెంటర్‌ని. అది ఆయన తొలి సినిమా అయినా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇప్పుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాడు. ఆయనతో పూర్తి స్థాయి నిర్మాతగా సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. కాకపోతే కుదరడం లేదు. ఇప్పటికీ ఆ ఆశ అలాగే ఉంది” అని దత్ చెప్పారు.
‘కల్కి’ మూవీ వరల్డ్ వైడ్ ఫుల్ రన్లో రూ.1150 కోట్లు వసూలు చేసిందని చెప్పిన అశ్వినీదత్.. తాను బడ్జెట్ విషయంలో టీంకు ఎలాంటి పరిమితులు పెట్టలేదన్నారు. ‘కల్కి-2’ ఇంకా గ్రాండ్‌గా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రభాస్ వీలును బట్టి నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్తారని చెప్పారు.
This post was last modified on September 29, 2024 9:38 pm
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…