Movie News

చరణ్ ఈ భారాన్ని మోయగలడా?

‘ఆర్ఆర్ఆర్’ సినిమా జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్‌ను ఎంత పెంచిందో ‘దేవర’ సినిమాతో రుజువవుతూనే ఉంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ పెంచుకున్న స్థాయిలో కాకపోయినా.. దేశవ్యాప్తంగా తారక్ క్రేజ్, మార్కెట్ ఎంతో పెరిగిన మాట వాస్తవం.

అంతిమంగా ఎలాంటి ఫలితం అందుకుంటుందో కానీ.. ఓపెనింగ్స్ వరకు దుమ్ములేపుతోంది ‘దేవర’. మరి ‘ఆర్ఆర్ఆర్’లో మరో హీరో అయిన రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినా ఎంత పెరిగిందో చూడాలని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ ‘ఆచార్య’ చేసినా.. అది అతిథి పాత్ర. పైగా అది బ్యాడ్ మూవీ. కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు. సోలో హీరోగా శంకర్ లాంటి లెజెండరీ డైరెక్టర్‌తో చేసిన ‘గేమ్ చేంజర్’యే చరణ్ సత్తాకు పరీక్షే. కానీ ఈ సినిమా అతడికి మోయలేని భారంగా మారుతుందేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తయి విడుదలై ఉంటే.. ఫలితం ఎలా ఉన్నా ఇబ్బంది ఉండేది కాదు. కానీ మొదలైన నాలుగేళ్లకు కానీ పూర్తి కావట్లేదు. బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. వడ్డీల భారం మోయలేని స్థాయికి చేరుకుంది.

ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నడూ రాజు సినిమాలకు ఇలా ప్రొడక్షన్ కాస్ట్ చేతులు దాటిపోలేదు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా హిట్ తర్వాత రామ్ చరణ్ నుంచి రానున్న సోలో సినిమా కాబట్టి బిజినెస్ పరంగా ఇబ్బందులే ఉండకూడదు. కానీ మధ్యలో అతిథి పాత్ర చేసిన ‘ఆచార్య’ సినిమా డిజాస్టర్ అయింది.

‘గేమ్ చేంజర్’ ఏమో విపరీతంగా ఆలస్యం కావడం వల్ల దీనిపై హైప్ కొంత తగ్గింది. పైగా శంకర్ చివరి సినిమా ‘ఇండియన్-2’ పెద్ద డిజాస్టర్ కావడంతో దాని తాలూకు నెగెటివ్ ఎఫెక్ట్ కూడా దీని మీద పడింది. బడ్జెట్ అమాంతం పెరిగిపోవడం వల్ల థియేట్రికల్ హక్కులు మరీ ఎక్కువ రేట్లకు అమ్మాలని చూస్తున్నారు. కానీ బయ్యర్ల నుంచి అంత స్పందన లేదు.

నిర్మాత కోరుకున్న మేర బిజినెస్ జరిగినా.. రకరకాల కారణాలతో ముసురుకున్న నెగెటివిటీని అధిగమించి ఈ చిత్రం అంతంత పెద్ద టార్గెట్లను అందుకోగలదా అన్నది సందేహం. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప ‘గేమ్ చేంజర్’ బయ్యర్లతో పాటు నిర్మాతకు సానుకూల ఫలితం తీసుకురావడం కష్టం.

This post was last modified on September 29, 2024 3:12 pm

Share
Show comments
Published by
Satya
Tags: Ram Charan

Recent Posts

నిర్మ‌ల‌మ్మ ఎఫెక్ట్‌: ‘పాప్ కార్న్‌’పై ప‌న్ను పేలుడు!

కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలోని జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాల‌క్షేపానికి తినే…

44 minutes ago

నో బెనిఫిట్ షోస్, నో టికెట్ హైక్స్ – భవిష్యత్ ఏంటి ?

తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…

1 hour ago

భగ‌వ‌త్ గారి గీతోప‌దేశం.. మోడీకి మండేలా ఉందే!

రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ చీఫ్ మోహ‌న్ భగ‌వ‌త్‌.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాల‌కు కూడా.. ఐకాన్‌. ఆయ‌న…

2 hours ago

వంగతో ఒక్క ఛాన్స్.. రిషబ్ కోరిక!

‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…

2 hours ago

కొడుకు పేరు మీద రేవతి కుటుంబానికి కోమటిరెడ్డి ఆర్థికసాయం

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో…

2 hours ago

కోటీ 15 ల‌క్ష‌ల‌ను వ‌డ్డీతో క‌ట్టాల‌ని.. రాం గోపాల్ వ‌ర్మ‌కు నోటీసులు!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ‌కు ఏపీ ఫైబ‌ర్ నెట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. కోటీ 15 ల‌క్ష‌ల…

3 hours ago