ఈ మధ్య తరచుగా ఫిలిం సెలబ్రెటీల విడాకుల వార్తలు వింటున్నాం. తాజాగా ఈ జాబితాలోకి జయం రవి కూడా వచ్చాడు. తన భార్యతో 18 ఏళ్ల వైవాహిక బంధానికి అతను తెరదించుతున్నట్లు ప్రకటించాడు. ఐతే తన అనుమతి లేకుండా విడాకుల ప్రకటన చేశాడంటూ రవి మీద ఆర్తి అసంతృప్తి వ్యక్తం చేసింది. తన మాటలు చూస్తే రవితో ఆమె కలిసి ఉండడానికే ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.
ఒకప్పుడు ఈ భార్యాభర్తలు ఒకరి గురించి ఒకరు చాలా గొప్పగా మాట్లాడారు బహిరంగ వేదికల్లో. కానీ అంత అన్యోన్యంగా ఉన్న జంట విడిపోతోంది అంటే అభిమానులకు నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఇంతకీ వీరి విడాకులకు దారి తీసిన పరిస్థితులేంటి అనే దాని మీద చర్చ నడుస్తోంది. గాయని కెనీషాతో జయం రవికి శారీరక సంబంధం ఏర్పడిందని.. అదే విడాకులకు కారణమైందని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.
ఈ ప్రచారంపై జయం రవి ఏమీ స్పందించలేదు కానీ.. కెనీషా మాత్రం రెస్పాండ్ అయింది. తన గురించి జరుగుతున్న ఈ ప్రచారం అబద్ధమని ఆమె స్పష్టం చేసింది. “జయం రవికి నాకు మధ్య శారీరక సంబంధం లేదు. ఇది నిజం. మా మధ్య ఉన్నది కేవలం వ్యాపారపరమైన సంబంధమే. ఆయన నాకు వ్యాపారంలో సపోర్ట్ చేస్తున్నారు. అన్నిటికి మించి జయం రవి నాకు మంచి మిత్రుడు. అందరూ అనుకుంటున్నట్లు జయం రవి విడాకుల నిర్ణయానికి కారణం నేను కాదు. నా పై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. దయచేసి ఈ వివాదంలోకి నన్ను లాగొద్దు” అని ఓ ఇంటర్వ్యూలో కెనీషా చెప్పింది.
ఆర్తితో విడాకులు తీసుకోవడం అత్యంత బాధాకర నిర్ణయమని.. కానీ అది తమ ఇద్దరి మంచి కోసమే అని రవి అంటున్నాడు. ఆర్తి మాత్రం విడాకులకు అంగీకరించట్లేదని తెలుస్తోంది. ఆమె రవితోనే కలిసి ఉండేలా పెద్దల ద్వారా ప్రయత్నం చేస్తున్నట్లు చెన్నై వర్గాల సమాచారం.
This post was last modified on September 29, 2024 2:21 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…