Baahubali
వందేళ్ల తర్వాత కూడా తెలుగు సినిమా గురించి చెప్పాలంటే… ‘బాహుబలి’కి ముందు, ‘బాహుబలి’ తర్వాత అని విడమర్చి చెప్పాల్సి ఉంటుందేమో. అంతలా తెలుగు సినిమాపైనే కాదు, ఇండియన్ సినిమాపై తన ప్రభావం చూపింది ఈ టాలీవుడ్ వండర్.
రాజమౌళి మూడేళ్ల పాటు చెక్కిన ‘బాహుబలి 2-ది కంక్లూజన్’ సినిమా విడుదలై, నేటికి మూడేళ్లు పూర్తయ్యింది. ‘డార్లింగ్’ ప్రభాస్, రానా దగ్గుపాటి, అనుష్క శెట్టి, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కనివినీ ఎరుగని రికార్డులెన్నో తిరగరాసింది.
హాలీవుడ్ మూవీస్‌కి మాత్రమే సాధ్యమనుకున్న చిత్రవిచిత్రాలన్నో భారతీయులకు తొలిసారి రుచి చూపించింది. దాదాపు రూ.180 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘బాహుబలి-2’… ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, భారతీయ సినీ చరిత్రలో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది.
వెయ్యి కోట్ల రూపాయల షేర్ మార్క్ దాటిన మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసిన ‘బాహుబలి’… డబ్ అన్ని భాషల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవడం మరో రికార్డు.
అమెరికన్ బాక్సాఫీస్ దగ్గర 22 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టిన బాహుబలి… జపాన్, గల్ఫ్ దేశాల్లోనూ అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. ఈ మూవీ రికార్డులను కొట్టాలని ఈ మూడేళ్లల్లో చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. అయితే ఎవ్వరూ ‘బాహుబలి’ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు.
‘బాహుబలి 2’ మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ట్విట్టర్‌లో ‘ప్రభాస్’, ‘బాహుబలి’ వరల్డ్ వైడ్‌గా ట్రెండింగ్‌లో టాప్‌గా నిలిచాయి. ఇదే రోజు సౌత్ ఇండియా ఇండస్ట్రీ హిట్ సాధించిన తెలుగు మూవీ ‘పోకిరి’ కూడా విడుదల కావడంతో ఏప్రిల్ 28 టాలీవుడ్‌కి చాలా స్పెషల్ డేట్‌గా మారింది.
This post was last modified on April 28, 2020 11:58 am
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…