దేవరతో టాలీవుడ్ స్ట్రెయిట్ విలన్ గా పరిచయమైన సైఫ్ అలీ ఖాన్ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాడు. జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఉంటూనే స్వార్థంతో రగిలిపోయే ప్రతినాయకుడి పాత్రలో మంచి మ్యానరిజం చూపించాడు.
డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించినా నిండైన విగ్రహం, సీరియస్ గా ఇచ్చే ఎక్స్ ప్రెషన్లు, క్రూరత్వం బాగా పేలాయి. దర్శకుడు కొరటాల శివ సెలక్షన్ ఈసారి గురి తప్పలేదు. రొటీన్ గా అనిపించే రెగ్యులర్ ఆర్టిస్టులను తీసుకోకుండా సైఫ్ ను ఎంచుకోవడం వల్ల తారక్ ఎలివేషన్ మరింత బలంగా కుదిరింది. పైగా సైఫ్ కి విభిన్నమైన షేడ్స్ పెట్టడం ఇంటెన్సిటీ పెంచింది.
ఇదిలా ఉండగా మనకో క్రేజీ విలన్ దొరికాడని సంబరపడేందుకు లేదు. ఎందుకంటే సైఫ్ అంత ఈజీగా దొరికే రకం కాదు. బాలీవుడ్ లోనే బోలెడు కమిట్ మెంట్లున్నాయి. దేవర కథ నచ్చడంతో పాటు పదమూడు కోట్ల పారితోషికం ఆఫర్ చేయడం వల్లే ఒప్పుకున్నట్టుగా ముంబై టాక్ ఉంది.
అంటే మీడియం రేంజ్ నిర్మాతలు ఇంత రెమ్యునరేషన్ భరించలేరు. వంద కోట్ల కన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టే వాటికే తను సూటవుతాడు. బాబీ డియోల్ ఇంత డిమాండ్ చేయడం లేదు కాబట్టే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం దేవర 2 తప్ప ఇంకే తెలుగు ప్రొడ్యూసర్ కి కమిట్ మెంట్ ఇవ్వలేదు.
ఇప్పటికైతే దేవర 2కి సైఫ్ అలీ ఖాన్ డేట్లు తీసుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా అవి పూర్తయ్యాకే కొరటాల శివ సీక్వెల్ మొదలుపెట్టాల్సి ఉంటుంది. దానికి ఎంత లేదన్నా రెండేళ్లకు పైగానే పడుతుంది.
ఈలోగా వేరే హీరోతో ఇంకో కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు. ఇది పక్కనపెడితే ప్రభాస్ స్పిరిట్ కోసం సైఫ్ తో పాటు అతని భార్య కరీనా కపూర్ ని దర్శకుడు సందీప్ వంగా అడిగాడనే ప్రచారం ఉంది కానీ అదెంత వరకు నిజమో ఇంకా తెలియాల్సి ఉంది. ఆదిపురుష్ తీవ్రంగా నిరాశపరిచినా దేవర ఇచ్చిన కిక్ సైఫ్ అలీ ఖాన్ కు మాములుగా లేదు.
This post was last modified on September 29, 2024 12:26 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…