ఈ రోజు విడుదలైన దేవర పార్ట్ 1లో దావూది పాటని ఫైనల్ ఎడిటింగ్ లో తీసేసిన విషయాన్ని మా సైట్ ఎక్స్ క్లూజివ్ గా పది రోజుల క్రితమే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని ఉంచుతారేమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు. ఎందుకంటే ఉన్న రెండు డ్యూయెట్లలో మంచి డాన్స్ నెంబర్స్ పడింది ఇందులోనే. జాన్వీ కపూర్ హొయలకు జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు తోడై ఆన్ లైన్ లో మంచి స్పందన దక్కించుకున్నాయి. అలాంటిది పెద్ద తెరపై ఎంజాయ్ చేయాలని అభిమానులు భావించడం సహజం. ముందైతే ఎండ్ టైటిల్ రోలింగ్స్ తో పాటు వేద్దామనుకున్నారు.
ఫైనల్ గా తీసేయడం మంచి నిర్ణయమని చెప్పాలి. ఎందుకంటే దేవర ఒక పెద్ద ఎమోషన్ తో పాటు ఊహించని ప్రశ్నని మిగిల్చి థియేటర్ నుంచి బయటికి పంపిస్తుంది. ఆ భావోద్వేగం అలాగే ఉండాలంటే వేరే డైవర్షన్లు జరగకూడదు. అందుకే కఠినంగా అనిపించినా సరే దావూదిని తొలగించాలని నిర్ణయించుకున్నారు. రీ సెన్సార్ కు వెళ్లేముందు కత్తిరించిన ఏడు నిమిషాల ఫుటేజ్ లో ఈ సాంగ్ కూడా ఉంది. సరే ఇప్పుడు కొంత నిరాశ చెందినా రెండు లేదా మూడో వారంలో మళ్ళీ జోడించే అవకాశాలు కొట్టి పారేయలేం. తొలి వారం టాక్ కీలకం కాబట్టి ఇలాంటి కత్తిరింపులు అవసరమే.
ఇది లేకపోయినా చుట్టమల్లే, ఆయుధ పూజ పాటలలో జూనియర్ ఎన్టీఆర్ డాన్సుతో ఫ్యాన్స్ సర్దుకుంటున్నారు. ముఖ్యంగా సైఫ్ తదితర బృందంతో కలిసి తారక్ వేసిన స్టెప్పులకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ట్యూన్ విన్నప్పుడు మరీ ఎక్స్ ట్రాడినరిగా అనిపించలేదు కానీ విజువల్ గా బాగా కనెక్ట్ అయ్యేలా తీశారు దర్శకుడు కొరటాల శివ. టాక్ కొంత మిశ్రమంగా ఉన్నప్పటికీ టికెట్ బుకింగ్స్ మాత్రం ర్యాంపేజ్ ఉన్నాయి. తొలి రోజు వసూళ్లకు సంబంధించిన లెక్కలు రేపు బయటికి వస్తాయి కాబట్టి అప్పటిదాకా వేచి చూడాలి. ఇవాళ్టి సెకండ్ షోల దాకా మేజర్ స్క్రీన్లన్నీ హౌస్ ఫుల్స్ పడుతున్నాయి.
This post was last modified on September 27, 2024 11:57 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…