దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన యానిమల్ లో సెకండ్ హీరోయిన్ గా చేసిన త్రిప్తి డిమ్రి అందులో కనిపించేది ముప్పావు గంటే అయినా రష్మిక మందన్నకు సమానంగా ఇంకా చెప్పాలంటే యూత్ లో అంతకన్నా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. అయితే హఠాత్తుగా వచ్చిన ఈ ఫామ్ నిలబెట్టుకోవడంలో వేస్తున్న తప్పటడుగులు తగిన మూల్యాన్ని చెల్లించేలా చేస్తున్నాయి. ఆ మధ్య బ్యాడ్ న్యూజ్ అనే విచిత్రమైన సినిమాలో నటించిన త్రిప్తి డిమ్రి ఆ పాత్ర మీద వచ్చిన విమర్శలకు జడిసిపోయింది. వెరైటీ పేరుతో గర్భంలో బిడ్డకు తండ్రెవరో కనిపెట్టే ఇద్దరు హీరోల కాన్సెప్ట్ మీద నెగటివిటీ వచ్చింది.
తన కొత్త మూవీ విక్కీ విద్య కా వో వాలా వీడియో త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో సాంగ్ కు కేవలం రెండు రోజుల్లో ఇరవై మిలియన్ల వ్యూస్ వచ్చేశాయి. పాట బ్రహ్మాండంగా ఉందా అంటే అదేం కాదు. మొత్తం నాలుగు నిమిషాలు తన గ్లామర్ షోతో నింపేశాడు దర్శకుడు. పక్కన రాజ్ కుమార్ రావు ఉన్నా సరే మొత్తం త్రిప్తి మీదే ఫోకస్ పెట్టాడు. పోనీ కొరియోగ్రఫీ ఏమైనా బాగుందా అంటే ఇవేం స్టెప్పులు బాబోయ్ అంటున్నారు నెటిజెన్లు. ఈ వ్యవహారమంతా సోషల్ మీడియాలో చూస్తున్న న్యూట్రల్ ఆడియన్స్ వెతికి మరీ ఈ యూట్యూబ్ లో పాటను చూస్తున్నారు.
యానిమల్ పార్క్ మొదలవ్వడానికి ఇంకా టైం ఉండటంతో త్రిప్తి డిమ్రి కొత్త కమిట్ మెంట్లు వేగంగా ఇస్తోంది. అందులో భాగంగానే పేరు పెంచేవి కాకుండా డ్యామేజ్ చేసేవి ఎక్కువగా వస్తున్నాయి. భూల్ భులయ్యా 3 మీద బోలెడు ఆశలు పెట్టుకుంది. విద్యా బాలన్, మాధురి దీక్షిత్ తో తెరను పంచుకోవడం ఏమైనా ప్రమోషన్ ఇస్తుందేమో చూడాలి. ధఢక్ 2లోనూ ఆఫర్ కొట్టేసింది. ఈ రెండు క్లిక్ కావడం చాలా అవసరం. సందీప్ వంగా నుంచి సీక్వెల్ కు పిలుపు వచ్చేలోగా ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు చెయాలి కానీ ఇలా తగ్గించుకోకూడదని అభిమానులు కోరుతున్నారు. అయినా వినే సీన్ ఉందా అంటే డౌటే.
This post was last modified on September 26, 2024 5:39 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…