ఇంకో ఇరవై నాలుగు గంటల కన్నా తక్కువ సమయంలో థియేటర్లలో అడుగు పెడుతున్న దేవర ఏకంగా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మాస్ ర్యాంపేజ్ ఏంటో చూపిస్తున్నాడు. దర్శకుడి ట్రాక్ రికార్డు కన్నా జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్, ప్రమోషన్స్ లో చూపించిన కంటెంట్ ఒక్కసారిగా అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లాయి. బుక్ మై షోతో కలిపి అన్ని ఆన్ లైన్ యాప్స్ లో ఇప్పటిదాకా అమ్ముడుపోయిన టికెట్లు పది లక్షలకు పైనే ఉండొచ్చని ఒక అంచనా. ఇంకా టైం ఉంది కాబట్టి ఈ సంఖ్య గణనీయంగా పెరగనుంది. భారీగా ఉన్న రేట్లు ప్రేక్షకుల ఆసక్తిని ఎంతమాత్రం ప్రభావం చూపించకపోవడం గమనార్హం.
ట్రేడ్ టాక్ ప్రకారం దేవర అడ్వాన్స్ సేల్స్ ద్వారా సుమారు 75 కోట్ల దాకా గ్రాస్ రాబట్టొచ్చని సమాచారం. ఇదే జరిగితే నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డు తారక్ పేరు మీదకు వచ్చేస్తుంది. సలార్ ముందస్తు అమ్మకాల ద్వారా తెచ్చింది 48 కోట్లే. దేవరకు ఇంకా కరెంట్ బుకింగ్ పెండింగ్ ఉంది. చిన్న పట్టణాలు, సి సెంటర్స్ లో దీని ద్వారా అమ్ముడుపోయే టికెట్లు ఎక్కువ. సో ఫైనల్ లెక్క ఊహకందని విధంగా ఉండొచ్చని అంటున్నారు. తమిళంలో సత్యం సుందరం పోటీతో పాటు పూర్తి స్థాయి స్క్రీన్లు దక్కకపోవడం ప్రభావం చూపిస్తుండగా హిందీ వెర్షన్ స్పందన ఆశించిన స్థాయిలో ప్రస్తుతానికి లేదు.
తెల్లవారేలోపు వచ్చే టాక్ ని బట్టి ట్రెండ్ ని మార్పు రాబోతోంది. పాజిటివ్ అయితే మాత్రం దేవరకు దసరా దాకా ఎలాంటి ఢోకా ఉండదు. మధ్యలో స్వాగ్ తప్ప ఏ కొత్త రిలీజులు లేకపోవడం చాలా పెద్ద సానుకూలాంశం. టికెట్ రేట్ల పెంపు పదిరోజుల దాకా అమలులో ఉంటుంది కనక ఫిగర్స్ ని ముందస్తు ఊహించడం కష్టం. ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమా కావడంతో అభిమానులు మాములు సెలెబ్రేషన్స్ చేసుకోవడం లేదు. చిలకలూరిపేట, నంద్యాల లాంటి ప్రాంతాల్లో అత్యధిక వెడల్పున్న ఫ్లెక్సీలు, కటవుట్లు పెట్టేసి తమ ఆనందాన్ని ఈ రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on September 26, 2024 10:59 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…