Movie News

చివరి 10 నిముషాలు – దేవర 2 ఆయువుపట్టు

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కలయికలో రూపొందుతున్న దేవర ఇంకో నలభై ఎనిమిది గంటల్లోపే థియేటర్లలో తొలి షో వేయనుంది. ఇప్పటికే అభిమానుల ఉద్వేగం పతాక స్థాయిలో ఉండగా అర్ధరాత్రి ప్రీమియర్లు ఎన్నో సంవత్సరాల తర్వాత ఏపీ తెలంగాణలో పడుతుండటంతో వాటి టికెట్ల కోసం డిమాండ్ మాములుగా లేదు. సుదర్శన్ లాంటి క్రేజీ సింగల్ స్క్రీన్ లో అయిదు వేల రూపాయల ధర పలుకుతుండగా సి సెంటర్లలోనూ వెయ్యికి తక్కువ అమ్మడం లేదని ఆఫ్ లైన్ లో ఫ్యాన్స్ టాక్. తర్వాత నాలుగు గంటల షోకు సైతం ఇదే రేంజ్ లో అమ్మకాలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా దేవర రెండో భాగం గురించి రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఒక కీలకమైన క్లూ జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను డీకోడ్ చేస్తే అర్థమవుతుంది. దేవర పార్ట్ 1 చివరి ముప్పావు గంట కళ్ళు పక్కకు తిప్పుకోలేనంత కీలక భాగం కాగా ఆఖరి పది నిముషాలు మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంటుంది. అంటే బాహుబలిని ఎవరు చంపారు అనే ప్రశ్నను రేకెత్తించి దాని ద్వారానే సీక్వెల్ కి మార్కెటింగ్ చేసిన రాజమౌళి తరహాలోనే కొరటాల శివ మతి పోయే స్థాయిలో ట్విస్టుతో పాటు పెద్ద సస్పెన్స్ సృష్టించి పెట్టారట.

షో అయిపోయాక బయటికి వచ్చేటప్పుడు వీలైనంత త్వరగా పార్ట్ 2 చూడాలనిపించే ఎగ్జైట్ మెంట్ కలిగిస్తుందని ఇన్ సైడ్ టాక్. ఇంకో రెండు రోజులు ఆగితే మ్యాటర్ బయటికి వచ్చేస్తుంది కానీ కొరటాల మాత్రం ఊహించనంత యాక్షన్ మాస్ ని ఇందులో జొప్పించారని సమాచారం. దేవర పాత్ర మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుందని, వర క్యారెక్టర్ ని పరిచయం చేశాక దాన్ని విలన్ భైరతో ముడిపెట్టి శుభం కార్డుకు ముందు షాకింగ్ ఎలిమెంట్ తో ముగిస్తారట. ఎంత వయొలెన్స్ ఉన్నా ఎమోషన్స్ ఏ మాత్రం తగ్గకుండా ఒక కంప్లీట్ ప్యాకేజ్ లా రూపొందిన దేవరకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డులకు పాతరే.

This post was last modified on September 25, 2024 10:52 am

Share

Recent Posts

జిమ్ జిమ్ తార… కావాలనే వైరల్ చేసారా?

జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…

10 minutes ago

69 ల‌క్ష‌ల ఓట్లు హుష్‌..

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(సర్‌)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…

42 minutes ago

ఇది కియారా అద్వానీకే సాధ్యం

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…

1 hour ago

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…

1 hour ago

నష్టాలు వచ్చాయని ఒప్పుకున్న నాని

తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…

2 hours ago

చివరి మ్యాచ్‌లోనూ అదే మెస్సీ… వారసుడికే గోల్ ఇచ్చి వెళ్లాడు!

21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…

2 hours ago