ఎల్లుండి విడుదల కాబోతున్న దేవర అంచనాల గురించి మళ్ళీ చెప్పనక్కర్లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ షాకవుతున్నారు. కొన్ని చోట్ల ఏకంగా కల్కి 2898 ఏడిని దాటే దిశగా వెళ్లడం అనూహ్యం. ఇదిలా ఉండగా గత వారం రోజులుగా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అభిమానుల ముసుగులో ఫ్యాన్ వార్స్ చేస్తున్న వాళ్ళ సంఖ్య వేలల్లో కాదు లక్షలు అంతకు మించి అనే స్థాయిలో ఉంది. ఉద్దేశపూర్వకంగా దేవరను టార్గెట్ చేసుకుని బురద జల్లే ప్రయత్నం ఒకవైపు చేస్తుండగా, పరస్పరం మాటల దాడులతో హద్దుల్లేకుండా కవ్వించుకునే ధోరణి ఎక్స్ లో అంతకంతా పెరుగుతూ పోతోంది.
దేవరని సితార సంస్థ నుంచి తెలుగు రాష్ట్రాల్లో పంపిణి చేస్తున్న నాగవంశీ దీని గురించి ఒక సుదీర్ఘమైన సందేశం పంచుకున్నారు. అక్కర్లేని ఫ్యాన్ వార్స్ కి దూరంగా ప్రశాంతంగా, బాధ్యతతో ఉంటూ సినిమాని ఎంజాయ్ చేయమని పిలుపు ఇచ్చారు. ఆన్ లైన్ యుద్ధాల వల్ల అనవసరమైన నెగటివిటీని స్వాగతిస్తున్నారని, మొదట్లో కొంత కిక్ అనిపించినా ఇదంతా మనం ఇష్టపడే హీరోల సినిమాల మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఏదైనా సరే తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉంటేనే బ్రతుకుతుందని చెబుతూ థియేటర్లో వీడియోలు తీసి పైరసీని ప్రోత్సహించొద్దని కోరారు.
ఇంత ఓపెన్ గా ఫ్యాన్ వార్స్ గురించి మాట్లాడిన నిర్మాత నాగవంశీనే అని చెప్పొచ్చు. నిజంగానే ట్విట్టర్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇప్పుడు దేవరని లక్ష్యంగా పెట్టుకుంటే రేపు మేము పుష్పని వదలమంటూ ఒకరు, గేమ్ ఛేంజర్ కి ప్రతీకారం తీర్చుకుంటామని మరొకరు, విశ్వంభరతో చూసుకుందామని ఇంకొకరు ఇలా రెచ్చగొట్టే ధోరణితో సమయాన్ని వృథా చేసుకోవడంతో పాటు వందల కోట్ల పెట్టుబడితో తీసిన సినిమాకు డ్యామేజ్ చేస్తున్నారు. ఇకనైనా వాస్తవిక కోణంలో అలోచించి వ్యవహరిస్తే హీరోల తరహాలో వాళ్ళ అభిమానులు కూడా స్నేహంతో ఉండొచ్చు.
This post was last modified on September 25, 2024 10:17 am
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…