కెరీర్ ప్రారంభంలో ఎగబడి వస్తున్నాయని తొందరపడి ఆఫర్లన్నీ ఒప్పేసుకుంటే వాటి ప్రభావం తర్వాత ఎప్పుడో ఉంటుంది. ముఖ్యంగా టాలెంట్ ఉన్న కుర్ర హీరోల జాగ్రత్తగా ఉండాలి. అర్జున్ రెడ్డి రిలీజయ్యాక విజయ్ దేవరకొండ ఇమేజ్ చూసి ఎక్కడో ల్యాబులో మూలానపడిన ఏ మంత్రం వేశావే కేవలం బిజినెస్ కోసం బయటికి తీసుకొచ్చిన ఉదంతం అభిమానులు మర్చిపోలేరు. సుహాస్ కు సైతం ఇది అనుభవమవుతోంది. అందరూ దేవర హడావిడిలో పడ్డారు కానీ మొన్న శనివారం గొర్రె పురాణం రిలీజైన సంగతి చాలా మంది పట్టించుకోలేదు. అసలు వచ్చిందనే విషయమే తెలియకుండా జరిగింది.
ట్రైలర్ లాంచ్ తో మొదలుపెట్టి విడుదల తేదీ దాకా సుహాస్ ఎక్కడా దీని ప్రమోషన్లలో పాల్గొనలేదు. రెండు మతాల మధ్య దోబూచులాటకు కారణమైన ఒక గొర్రెకు, జైల్లో ఖైదీకి ముడిపెట్టిన విధానం వినడానికి వైరెటీగా ఉన్నా తెరకెక్కించే క్రమంలో పడిన తడబాటు భరించలేని ప్రహసనంగా మారింది. అసలే పబ్లిసిటీ లేక ఓపెనింగ్స్ రాలేదని ఒకపక్క నిర్మాత ఇదవుతుంటే టాక్ కూడా అంతంత మాత్రంగా ఉండటం ఫలితాన్ని డిజాస్టర్ గా మార్చేసింది. ఆ మధ్య శ్రీరంగనీతులుకు సైతం సుహాస్ కి ఇదే అనుభవం ఎదురయ్యింది. ఓటిటిలో వచ్చేదాకా ఎవరికీ దాని ఊసే లేదు.
వచ్చే దసరాకు రాబోతున్న జనక అయితే గనక మీద సుహాస్ కు బోలెడు ఆశలున్నాయి. ఓవర్సీస్ హక్కులను కొన్నాడంటేనే నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా దిల్ రాజు పిల్లలు నెలకొల్పిన బ్యానర్. సో మార్కెటింగ్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇలాంటి మూవీ వస్తున్న టైంలో గొర్రె పురాణం రావడం కరెక్ట్ కాదని భావించాడో లేక ఎలాగూ కంటెంట్ ఎలా ఉందో అర్థమై దూరంగా ఉన్నాడో తెలియదు. ఇవి కాకుండా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయేమో లోగుట్టు పెరుమాళ్ళకెరుక. దీని తర్వాత తర్వాతి వరసలో కేబుల్ రెడ్డి, ఉప్పు కప్పురంబు, ఆనంద్ రావు అడ్వెంచర్స్ విడుదలకు రెడీ అవుతున్నాయి.
This post was last modified on September 25, 2024 10:10 am
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…