హీరోల కొడుకులు వేరే క్రాఫ్ట్ వైపు చూసే అవకాశమే కనిపించడం లేదు ఈ మధ్య. వేర క్రాఫ్ట్స్‌కు చెందిన వారసులు కూడా నటన వైపే అడుగేస్తున్న ఈ రోజుల్లో హీరోల కొడుకులు హీరోలు కాకుండా ఇంకేం అవుతారు అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ కొద్దిమంది మాత్రం తమ రూటే వేరు అంటూ సాగిపోతుంటారు. తమిళ టాప్ స్టార్ విజయ్ తనయుడు దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా అతను సినిమా చేయబోతున్నాడు.
ఐతే భవిష్యత్తులో దర్శకత్వమే చేస్తాడా లేదా అన్నది తెలియదు కానీ.. ప్రస్తుతానికి మాస్ రాజా రవితేజ తనయుడు మహాధన్ భూపతి రాజు కూడా ఆ విభాగం మీదే దృష్టిపెట్టినట్లు సమాచారం. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో సంచలనం రేపిన సందీప్ రెడ్డి దగ్గర అతను దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుంటున్నాడట.
మహాధన్.. తన తండ్రి సినిమా ‘రాజా ది గ్రేట్’తో బాల నటుడిగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. అందులో చిన్నప్పటి రవితేజగా కనిపించాడు. ఆ తర్వాత అతను మళ్లీ సినిమాల్లో నటించలేదు. చదువు మీద దృష్టిపెట్టాడు. ఇక కొంచెం పెద్దవాడు అయ్యాక హీరోగా ఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ అతను ఓవైపు చదువుకుంటూనే ఇంకోవైపు తనకెంతో ఇష్టమైన సందీప్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడట.
ఐతే దర్శకత్వ శాఖలో పని చేస్తున్నంతమాత్రాన దర్శకత్వమే చేయాలనేమీ లేదు. రవితేజ సైతం ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి ఆ తర్వాత నటనలోకి వచ్చాడు. నటుడికి అన్ని విభాగాల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఇలా చేయిస్తుండొచ్చు. మరి భవిష్యత్తులో మహాధన్ దర్శకుడవుతాడా.. హీరో అవుతాడా అన్నది కాలమే నిర్ణయించారు. మరోవైపు రవితేజ కూతురు సైతం సినిమాల్లోకి వస్తోందని.. ఆమె ప్రొడక్షన్ మీద దృష్టిపెట్టిందని సమాచారం.
This post was last modified on September 25, 2024 6:06 am
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…